📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
*🕵️బైబిల్ పరిచయం 🕵️*
*బైబిలు చదువుటకు ముందే దాని గూర్చి సవివరముగా తెలుసుకొనవలెను*
➡️ బైబిల్ అనే మాట బిబ్లాస్(biblos)అనే హిబ్రూ పదము నుండి తీసుకొనబడినది.
➡ గ్రంధకర్త దేవుడే - 2పేతురు1:20,21;2తిమోతీ3:16
➡ బైబిల్ రెండు నిబంధనలతో కూడిన గ్రంధము.
a) పాత నిబంధన 39 పుస్తకములు ఇది ఆదిమ హిబ్రూలో వ్రాయబడెను.
b) క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఇది గ్రీకు మరియు అరామిక్ బాషలలో వ్రాయబడెను.
➡ రచనాకాలం - క్రీ"పూ 1500సం" నుండి క్రీ"శ 90వ సం" వరకు (ఇంచుమించు 1600 సం"రాల కాలము పట్టింది.
➡ బైబిల్ ఆసియా,ఆఫ్రికా,యూరఫ్ ఖండాలలో వ్రాయబడెను.
➡ క్రీ"శ 1240 సం"లో "హ్యూగో డిసాంక్టో కారో" మరియు "స్టీఫన్ లాంగ్టన్" అను ఇరువురు బైబిల్ ని అధ్యాయాలుగా విభజించిరి.
➡ క్రీ"శ 1445సం"లో మొర్దెకై నాథన్ పాత నిబంధనను వచనములుగా విభజించెను.
➡ క్రీ"శ 1551సం"లో రాబర్ట్ స్టీఫెన్ క్రొత్త నిబంభనను వచనములుగా విభజించెను.
➡ బైబిలును 40 మంది గ్రంధ కర్తలు 1600సం"రాల వ్యవదిలో వ్రాసిరి.
➡ వీరు వివిధ ప్రాంతాలకు చెందిన వారు,వివిధ కాలాలకు,విధ్యా స్థాయిలకు,వివిధ సాంప్రధాయాలకు చెందిన వారు.
అయినప్పటికి వీరు అందరు ఒక దేవుని గూర్చి,సృష్ఠిని గూర్చి ,మానవును గూర్చి ఒకేలా సవివరంగా వ్రాసారు.
➡వ్రాసిన వారిలో రాజులు,ప్రవక్తలు,పండితులు,జ్ఞానులు,వైధ్యులు,చేపలు పట్టువారు,పశువుల కాపరులు,ధర్మశాస్త్ర పండితులు ఉండిరి.(అ"పో 4:13)
➡ పాత నిబంధన "32" మంది క్రొత్త నిబంధన "8" మంది వ్రాసిరి.
*బైబిలును గూర్చి భౌతిక ఆధారాలు*
1.ఈజిప్టు.హిందూ దేశం.
2. *పట్టణాలు* - యెరుషలేము,ధమస్కు,రోమా.
3.సీనాయి పర్వతము.
4. *సముద్రములు* - ఎర్ సముద్రము,మృత సముద్రము,గలలియ సముద్రము.
5. *నదులు* - యొర్ధాన్నది,నైలునది,యూఫ్రటిస్ నది.
*చారిత్రాత్మక ఆధారాలు*
1. ఇశ్రాయేలు చరిత్ర.
2. కల్ధీయుల చరిత్ర.
3. గ్రీకు చరిత్ర.
4. రోమా చరిత్ర.(AD and BC)
*బైబిల్ అందరికి అన్ని విధాల సరిపోయే గ్రంధము ఇది దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన గ్రంధము.*
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి