ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(ఇరవై యవ  భాగము)

♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻
(తొమ్మిదవ  భాగము)

కొలస్సీయులకు 2: 9
*ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;*

   👉  *యేసుప్రభులవారి దైవత్వాన్ని నిర్ధారించే తిరుగులేని సాటిలేని వచనం ఇది.*

 *ఏలయనగా* అని ఎందుకు అన్నారంటే: ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అంటూ *దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత  . . . . . ..*

👉 *దేవుడు అనడానికి ఏవైనా క్వాలిటీలు, లక్షణాలు, అర్హతలు, అధికారం ఏవైనా ఉన్నాయంటే అవి యేసుప్రభులవారిలోనే ఉన్నాయి అని నొక్కివక్కానిస్తున్నారు!!*

👉 ఇక అదే క్వాలిటీస్ కలిగి ఏ దేవుడైనా ఎప్పుడైనా శరీరంతో భూమిమీదకు వచ్చారు అంటే అది యేసుప్రభువే అని నిర్ధారించి చెబుతున్నారు!

   ఒకసారి ఆగి ఆలోచిద్దాం! 
👉 *ఇంతకీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు, అధికారాలు, అర్హతలు ఏమిటి?*

👉 *మరి మనం పూజించే దేవుడు ఎలాంటివాడై ఉండాలి అనేది తెలుసుకోవలసి యుంది కదా!*

 మన భారతదేశం పూర్వకాలం నుండి ఎంతో సనాతన ధర్మము, ఆచారాలు కలిగిన దేశం! అలాగే ఎన్నో మతపరమైన గ్రంధాలు మనకున్నాయి. వాటిప్రకారము, ఇంకా మిగతా దేశాలవారికి చెందిన మతాలవారి గ్రంథాల ప్రకారం దేవునికి ఉండవలసిన ముఖ్యలక్షణాలు కొన్ని ఉన్నాయి. Someone says God must have Three characteristics, 7 Attributes, 15 qualities like that….  
Characteristics are: God must be 
1. Omnipotence- - God is All Powerful; 
2. Omniscience—God knows everything; 
3. Omnipresence—God is Everywhere.

1). దేవుడు సృష్టికర్తయై ఉండాలి, సృజింపబడినవాడు కాకూడదు. 
2). నిరాకారుడు, నిర్గుణుడై ఉండాలి! అనగా ఒక ఆకారం కలిగి ఉండకూడదు, అరిషడ్వర్గాలు అని పిలువబడే క్రామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యము గలవాడై ఉండకూడదు! 
3) నిత్యమూ ఉండేవాడై ఉండాలి! 
4) గురువై ఉండాలి, మాదిరిగా ఉండాలి; 
5) పాపాలు తీయగలిగిన వాడై ఉండాలి! అనగా పాప సంహారకుడై ఉండాలి! 
6) లోక కల్యాణం కోసం పాటుపడినవాడై ఉండాలి! అనగా లోక కల్యాణం కోసం, ప్రజల శ్రేయస్సుకోసం తనను తానూ అర్పించుకోడానికైనా సిద్ధమై ఉండాలి! ; 
7) మంచివాడై యుండాలి. మంచిని కాపాడుతూ చెడును సంహరించేవాడై ఉండాలి!
8) స్వర్గమిచ్చువాడై ఉండాలి.
  ఇలాంటివి చాలా ఉన్నాయి గాని ముఖ్యమైనవి ఇవి! 

👉 *అది ఏ మతమైనా, ఏ దేశమైనా సరే! మరి ఈ లక్షణాలు కల దేవుడు ఎవరు ఉన్నారు? దేవుళ్ళు అని పిలవబడే కొంతమంది ఉన్నారు గాని వారికి వీటిలో ఒకటో రెండో లక్షణాలు ఉన్నాయి గాని, మొత్తమన్నీ ఎవరిలో ఉన్నాయి?*

👉 *ఇక రెండో లక్షణమైన నిర్ఘుణుడు అనగా అరిషడ్వర్గాలు లేనివాడు- అవి ఉంటే తను కూడా మనలాగ మనిషే తప్ప దేవుడు కాదు*. 

👉 *దేవునికి కామం ఉండి మనలాగే పెళ్లి చేసుకుంటే మనకి దేవునికి తేడా ఏమిటి?* 

   👉 కాబట్టి చివరికి ఈ లక్షణాలు అనగా దేవునికి ఉండవలసిన, ఒకటో రెండో కాదు మొత్తము అన్ని లక్షణాలు కలిగిన వాడు యేసుప్రభులవారు మాత్రమే!!!

*1). సృష్టికర్త* యోహాను 1: 2,3;  2 కొరింథీ 8:6; 
*2) నిర్ఘుణుడు*- పాపము లేనివాడు ఏసుప్రభు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు విసరినవాడు! యోహాను 8:46; 

*3) నిత్యమూ ఉండేవాడు:* ఆయన నిత్యుడగు తండ్రి, యెషయా 9:6; ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను మత్తయి 28:20.

*4) గురువైఉండాలి*- క్రీస్తు ఒక్కడే మీకు గురువు మత్తయి 23:10; యేసయ్యను అందరూ భోదకుడా, గురువుగారు అని పిలిచేవారు- ఆయనకు 12 మంది ముఖ్య శిష్యులు, వారే కాక అనేకమంది శిష్యులు.

*5) పాపాలు తీయగలిగిన వాడు:* ఆయన బ్రతికిఉండగానే కొందరి పాపములు క్షమించారు. లూకా 5:20-24; చనిపోయి అందరి పాపములు క్షమించారు. ఇదిగో ఇది మీ కొరకు చిందింప బడుచున్న క్రొత్త నిభందన రక్తము అన్నారు, మత్తయి 26:28 యేసురక్తము ప్రతీ పాపము నుండి మనలను కడిగి పవిత్ర పరచును అని గ్రంధం సెలవిస్తుంది. 1 యోహాను 1:7;

*6) లోక కల్యాణం కోసం పాటు పడినవాడు:* ఆయన ఈలోకానికి వచ్చిందే పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగినవారిని విడిపించడానికి, (లూకా 4:18), తద్వారా అందరిని దేవునిరాజ్యానికి వారసులుగా చేయడానికి యోహాను 1:12; 

*7) మంచివాడై యుండాలి:* నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచికాపరి తన గొర్రెల కోసం తన ప్రాణం పెట్టును అని చెప్పడమే కాదు చేసి చూపించారు! యోహాను 10:11

*8) పరలోకం ఇవ్వగలిగిన వాడై యుండాలి:* యోహాను 14: 2,3
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
కాబట్టి కొన్ని కాకుండా అన్ని క్వాలిటీస్ కలిగిన దేవుడు యేసుప్రభులవారు!

  👉 *ఇక్కడ పౌలుగారు దేవత్వము యొక్క సంపూర్ణత అంటున్నారు. ఇక ఆయన పరిపూర్ణుడు ఎలా కాగలిగారు?*

 దైవత్వం- పరిపూర్ణత ఎప్పుడ అవుతుందో మనకు చక్కగా వివరించగలిగినది యోహాను సువార్త మొదటి అధ్యాయం. మిగిలిన అధ్యాయాలలోను కొద్దిగా ఉన్నాయిగాని ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి. 

*నిజంగా ఇంతటి ప్రత్యక్షత/ Revelation ఏమీ చదువుకోని, ఒక చేపలు పట్టుకొనే జాలరి యైన యోహాను గారికి ఎలా దేవుడు ఇచ్చారో నిజంగా ఆశ్చర్యము!*

🔺 *Biblical concept కి పునాది ఇది.*  దీనిని మనం జాగ్రత్తగా గమనిస్తే: 

*ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.* అంటున్నారు. మొదటి వచనంలో వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద అనగా వాక్యమై ఉన్న కుమారుడు తండ్రియైన దేవుని యొద్ద ఉన్నారు అందుకే రెండవ వచనంలో అనుమానాలు లేకుండా ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను *అనగా కేవలం 2000 క్రితం పుట్టినవాడు కాదు, సృష్టి జరుగకముందే ఆయన దేవునియొద్ద ఉన్నారు.*

👉 ఇక మూడవ వచనం ప్రకారం *ఆయనలేకుండా ఏమీ కలుగులేదు. సమస్తము ఆయనద్వారా కలిగెను!* అనగా ఆయనే సృష్టికర్త! ఇంకా క్రిందకు చదివితే ఆయన మిగతా లక్షణాలు కనిపిస్తాయి. ఆయన వెలుగు అని , లోకానికి వెలుగుకు మధ్య వ్యత్యాసం ఉందని, చెబుతూ 12వ వచనంలో తనను ఎందరో అంగీకరిస్తారో వారిని ఆయన దేవుని పిల్లలుగా మార్చగలిగిన అధికారం కలిగిన వాడని వ్రాయబడింది. ఇక 14వ వచనంలో *ఆయన శరీరధారిగా భూమిమీదకు వచ్చారని రాశారు! కృపా, సత్య సంపూర్ణునిగా మనమధ్య నివశించెను అని రాస్తున్నారు!* 18వ వచనంలో ఎవడూ తండ్రిని చూడలేదు గాని యేసుప్రభులవారే తండ్రిని మానవులకు వెల్లడిచేశారు అంటున్నారు. 

29-34 వచనాలలో *మనకు పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు!* అనగా ఆయనే ఆత్మ, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ-

👉 అనగా *దేవుడు ఒక్కడే కాని ఆయనకు మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ముగ్గురు దేవుళ్ళు కానేకాదు! బైబిల్ గ్రంధంలో దేవుని మూడు వ్యక్తిత్వాలు ఒకేదగ్గర, ఒకేసారి ప్రత్యక్ష్యం అయ్యింది ఇక్కడే!* మత్తయి 3:17, లూకా 3:22 ప్రకారం యేసుప్రభులవారు బాప్తిస్మము తీసుకొని బయటకు వస్తారు, పరిశుద్ధాత్ముడు పావురం వలే ఆయనమీద వ్రాలుతాడు, అప్పుడు పరలోకం నుండి తండ్రి స్వరము అనగా ఆయన వాక్కు సెలవిస్తుంది: ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను. ఇదీ సంపూర్ణత. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ- త్రియేకదేవుడు!!! 

అందుకే  1 యోహాను 5:7 లో *సాక్ష్యమిచ్చువారు ముగ్గురు: అనగా తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్ముడు., For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one.*

👉 వీరు ముగ్గురు ఒక్కటే! అనగా ముగ్గురు ఒకరే! ఆయన మూడు వ్యక్తిత్వాలుగా ఎందుకు ఉండాల్సివచ్చింది? ఎందుకంటే అది సంపూర్ణం కాబట్టి! 
*కేవలం మూడు సంపూర్ణ సంఖ్య అయినందువలెనే ఆయన సంపూర్ణుడు అయ్యారా కాదుకాదు!*

🔺 *సంపూర్ణత అంటే:*

1). ఆయన తండ్రి: తండ్రి ప్రేమ చూపించారు. ఒక తండ్రి తన పిల్లలకు ఏమి కావాలో అవన్నీ అమర్చినట్లు ముందు సృష్టిని చేసి, తర్వాత మానవుణ్ణి చేసారు. తండ్రిలా ప్రేమించి, లాలిస్తున్నారు. మాట విననప్పుడు దండించారు, దండిస్తున్నారు. ఆదికాండం 6-8 అధ్యాయాలు, పాత నిబంధన మొత్తం; ఇంకా నిన్ను విడువను ఎడబాయను అంటూ మనల్ని కాస్తున్నారు. యెహోషువ 1:6; యిర్మియా 46:26; యోహాను 14:18; హెబ్రీ 13:5;

*2) మరి తండ్రిగానే ఉంటే మానవులు నాశనమైపోతారు. కాబట్టి కుమారునిగా భూమిమీదకు శరీరాకృతిలో వచ్చి, మానవులకు రక్షణసువార్తను అందించి, రక్షణ కార్యక్రమం చేసి, పేదలకు సువార్త ప్రకటించడంతో మొదలుపెట్టి, దేవునిరాజ్యమును స్థాపించారు. చివరకు మన పాపములకోసమై సిలువలో యాగమై, బలియాగమై తనరక్తముద్వారా మన పాపములకు పరిహారం చేసి, మనలను పరలోకానికి హక్కుదారులుగా చేసారు.* (యోహాను 1:12)  తిరిగి తండ్రికి మనకి ఒక లింక్ ఏర్పాటు చేసారు. 

*3) ఇక తను తండ్రి యొద్దకు వెళ్ళాలి కాబట్టి మనలను అనాదలనుగా వదలడం ఇష్టం లేక తన ఆత్మను మనకు కాపలాగా, నడిపించే నాయకునిగా , సంచకరవు అనగా డిపాజిట్ గా పెట్టి; మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను, ఎక్కడ? తనుండే చోటు అనగా పరలోకంలో!* యోహాను 14:2,3; ఇక్కడ పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగిస్తున్నాడు.
 ఇక్కడ రెండు వచనాలు మీకు గుర్తుచేయాలి అంటుకుంటున్నాను రోమా పత్రిక 8వ అధ్యాయం నుండి. 
🔺 *ఈ ముగ్గురు అనగా తండ్రి, కూమార, పరిశుద్ధాత్ముడు ఒక్కరే, ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి అనడానికి మంచి ఉదాహరణ.*

 26 వ వచనంలో *అటువలె మనకు ఎలా ప్రార్ధనచేయాలో తెలియదు కాబట్టి ఆత్మ మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు, ఎలా ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో!! అందుకే పరిశుద్ధాత్మ అనుభవం గల వ్యక్తి ప్రార్ధించడం మొదలుపెడితే కళ్ళంట నీరు వాటికవే కారిపోతాయి. ఈ విషయం ఇంటివారికి అర్ధంకాక, ఇప్పుడు ఎవడు చనిపోయాడని అలా ఏడుస్తున్నావు అంటుంటారు!!!*  సరే; ఇక 34 వ వచనంలో శిక్షించువాడు, Judge ఎవరు? ఏసుప్రభువే, అందుకే ముందుగా వారు/మనం తప్పిపోకుండా, యేసయ్య మన పక్ష్యంగా దేవుని కుడిప్రక్కన కూర్చొని మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు! ఇక్కడ అనగా భూమిమీద ఆయన ఆత్మ మనుష్యులను సిద్దపరచి అదే విజ్ఞాపనం చేస్తున్నారు, అక్కడ యేసుప్రభులవారు కూడా ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ అంటూ మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత జడ్జి స్థానం లోకూర్చుంటే ఇక తనకు క్షమించే అవకాసం ఉండదు కాబట్టి! 

👉 *ఇక్కడ ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలతో మానవ శ్రేయస్సుకోసం పాటుపడుచున్నారు! ఇదే సంపూర్ణత!* అందుకే పౌలుగారు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివాశం చేస్తున్నది అని ఘంటాపథంగా చెబుతున్నారు. 

   కాబట్టి ఈలోకంలో దేవుడు అని ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుప్రభులవారే! పాపములేని దేవుడు ఆయన! నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరిన ఏకైక, అద్వితీయ దేవుడు!! యోహాను 8:46;
 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చాటి చెప్పగలిగిన సత్తాగాలిగిన ఏకైక సత్యదేవుడు! యోహాను 14:6;

*మరి ఆదేవుడు నీకు కావాలా? నిజదైవమెవరో, నీ రక్షకుడు ఎవరో గుర్తెరుగు! నేడే ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించు! ఆయన నిన్నుతన స్వంత బిడ్డగా స్వీకరించి,తన రక్తముతో కడిగి, తనరాజ్యానికి వారసునిగా/   చేస్తారు !* యోహాను 1:12;

ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు *'ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వరునూ,ఎన్నడునూ మాట్లాడలేదు' అని సాక్ష్యం పొందారు.*

👉 అంటే ఆయన మాటలో కూడా 'పరిశుద్ధత' గలవారు.
*మాట,తలంపు, ఆలోచన, నడత,ప్రవర్తన అన్నింటిలోనూ ఆయన ప్రత్యేకమైన విధంగానూ,పరిశుద్ధంగానూ జీవించారు.* 
హెబ్రీ పత్రిక 7:26లో చెప్పినట్లుగా *'పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు'.*

మనకు ఒక మాదిరినీ,మార్గాన్నీ చూపిన ఆ ప్రభువు అడుగుజాడలలో నడుద్దాం...
ఆయన అన్ని విషయములలో పరిపూర్ణుడైయున్న ప్రకారము మనము కూడా ఆయన వలే పరిపూర్ణులమయ్యే ఆ స్థితికి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించును గాక......

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...