ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(6 వ భాగము )

*గొప్ప రక్షణ కలుగజేసెను*


1 సమూ 19:5  అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీ యుల కందరికి *గొప్ప రక్షణ* కలుగజేసెను.

ఇప్పటి వరకు, గొప్ప దేవుడు, గొప్ప ప్రేమ, గొప్ప నామము, గొప్ప కృప అను అంశములను ధ్యానించాము. ఈ దినం గొప్ప దేవుని యొక్క *గొప్ప రక్షణ* గూర్చి ధ్యానిద్దాం. 

అలనాడు దావీదు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయవాణ్ణి చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరికీ *గొప్ప రక్షణ* చేకూర్చాడు. ప్రాణాలకు తెగించి పోరాడడం అంటే, ప్రాణం మీద ఆశ వదలి పోరాడడం. ఇశ్రాయేలు శిబిరంలో ఉన్న ఎవ్వరూ ఇదేవిధంగా ప్రాణాలను త్యాగం చేసి పోరాడడానికి ముందుకు రానప్పుడు దావీదు అత్యంత ప్రమాదకరమైన ఈ పోరాటానికి తనకు తానుగా సిద్ధపడ్డాడు. 

సర్వ మానవాళిని రక్షించుటకు ఎవరులేని పరిస్థితులలో ఆ గొప్ప దేవుడే *ఈ లోకంలో జన్మించి* శత్రువుతో పోరాడి సమస్త జనులకు *గొప్పరక్షణ* కలుగజేసెను.
 
ఇశ్రాయేలీయుల రక్షణకు దావీదు ఎలా సిద్ధమైనాడో అదే విధంగా మానవజాతి యొక్క రక్షణకొరకు యేసు భూమ్మీదకు రావడం మరియు పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ దేవుని ధర్మ శాస్త్రం నెరవేర్చి, ప్రపంచంలోని సమస్త పాపాలకు పరిపూర్ణ బలిగా మరణించి సాతానును ఓడించి సర్వ మానవులకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఆయనే మన రక్షకుడు. 

క్రీస్తు ద్వారా పాపపు మానవాళికి రక్షణ ప్రణాళికను దేవుడు తన అనంత కనికరముచొప్పున ముందుగానే నిర్ణయించాడు (1 పేతురు 1:20 ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను). మానవజాతిని రక్షించడానికి “జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్ల” అని యేసు ప్రకటించబడ్డాడు (ప్రకటన 13: 8 జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్ల).
 
*యేసు ద్వారా మాత్రమే గొప్ప రక్షణ:* కీర్తన 18:50 నీవు నియమించిన రాజునకు *గొప్ప రక్షణ* కలుగ జేయువాడవు.  1తెస్సా 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను 1సమూ  19:5 (దావీదు) - అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి *గొప్ప రక్షణ* కలుగజేసెను;

అటువంటి అద్భుతమైన యేసుక్రీస్తు యొక్క రక్షణను మనం ఈ క్రింద విధంగా పొందుకొనగలం.

*1. సువార్త  ద్వారా రక్షణ:* రోమా 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ *రక్షణ* కలుగ జేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

*2. మారుమనస్సు (పశ్చాత్తాపం) ద్వారా రక్షణ:* 2కొరి 7:10 దైవచిత్తాను సారమైన దుఃఖము *రక్షణార్థమైన* మారు మనస్సును కలుగజేయును Mat 12:41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారు   మనస్సు పొందిరి

*౩. బాప్తీస్మం ద్వారా రక్షణ:* మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు *రక్షింపబడును*; నమ్మని వానికి శిక్ష విధింపబడును. 1 పేతురు 3:20ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.

*4. విశ్వాసము ద్వారా రక్షణ:* అపో 16:30 వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అపో 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును *రక్షణ* పొందుదురు. లూకా 7:50 అందుకాయన     నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ  స్త్రీతో చెప్పెను.

*5.  కృప ద్వారా రక్షణ:* తీతు 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై..... ఎఫేస్సి 2:8 మీరు విశ్వాసముద్వారా కృపచేతనే *రక్షింపబడియున్నారు* ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

*6. యేసు రక్తము ద్వారా రక్షణ:* హెబ్రీ 9:12 మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ప్రక 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక హెబ్రి 13:12 కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను. నిర్గ 12:13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ *రక్తమును చూచి మిమ్మును నశింపచేయక* దాటిపోయెదను.

*7. ప్రార్ధన ద్వారా రక్షణ:* హెబ్రీ 5:7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి హెబ్రీ 7:25 ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా *రక్షించుటకు* శక్తిమంతుడై యున్నాడు. చివరి క్షణాలలో ఆ దొంగ ప్రార్ధించి రక్షణ పొందుకొనెను. లూక  23:42  ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము  లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను

*గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు:* దేవుని రక్షణ అన్నది నిశ్చయత విషయంలో, రక్షించగలిగిన బలప్రభావాల విషయంలో, అందులో వెల్లడైన ప్రేమ, కృప విషయంలో, దాని ఫలితాల విషయంలో ఎంతో గొప్పది. రక్షణ శుభవార్త విని కూడా దాన్ని తేలికగా తీసుకునేవారు శిక్షనుంచి తప్పించుకోగలరని కాదు గాని నిజానికి వారికి వచ్చే శిక్ష మరింత ఖాయం, మరింత భయంకరం. ఎందుకంటే వారు తేలికగా తీసుకున్నది అన్నిటి కంటే కూడా గొప్పది. దేవుని న్యాయమైన శిక్షను ఎదుర్కోవాలంటే మనిషి తీవ్రంగా ఎదురు తిరిగి శుభవార్తను వ్యతిరేకించ నవసరం లేదు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకుండా ఊరుకుంటే చాలు. అదే తీవ్రమైన శిక్ష రాగలదు. దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసినవారు తప్పించుకోలేక పోయారు. 

క్రీస్తు రక్షణ శుభవార్తను నిర్లక్ష్యం చేసేవారి గతి కూడా ఇంతే. రక్షణ శుభవార్తలో దేవుని ప్రేమ, కృప వెల్లడి అయ్యాయి గనుక ఇదే మనుషులకు రక్షణ మార్గం. రక్షణ యొక్క గొప్ప ప్రాముఖ్యతను నొక్కి రచయిత ఇలా చెప్తున్నాడు.  హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?

ప్రభువు అట్టి గొప్ప రక్షణను దేవుడు సమస్త మానవాళి హృదయాలలో సమృద్ధిగా కుమ్మరింపజేయును గాక. ఆమెన్!

దైవాశ్శీసులు
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...