✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(18 వ భాగము )
*వాక్యము శరీరధారి ఆయెను - 1వ భాగము*
(యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై..)
*మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మానవ అవతారంపై ఒక నిశిత పరిశీలన
- A Close Look at the Incarnation of Our Savior, Jesus the Christ*
యేసు, దేవుడు మరియు మానవుడు: ఒక వ్యక్తి, రెండు స్వభావాలు (Jesus is God and Man: One Person, Two Natures)
*1. యేసు నిజమైన దేవుడని బైబిలు మనకు చూపిస్తుంది:* 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే *నిజమైన దేవుడును* నిత్యజీవమునై యున్నాడు
తీతు 2:13 అనగా *మహా దేవుడును* మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు...
రోమా 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన *సర్వాధికారియైన దేవుడై యుండి* నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్
*2. యేసు నిజమైన మానవుడని బైబిలు మనకు చూపిస్తుంది:* యోహాను 1:14 ఆ వాక్యము *శరీరధారియై,* కృపాసత్య సంపూర్ణు డుగా మనమధ్య నివసించెను
1తిమో 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన *క్రీస్తుయేసను నరుడు*
హెబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై నందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును 17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన *తన సహోదరుల వంటివాడు* కావలసివచ్చెను
యేసు తనను తాను "మనుష్యకుమారుని" అని పిలిచినప్పుడేల్లా తాను *నిజమైన మానవుడని* ప్రకటించాడు.
*3. యేసు మనలాంటి మానవ స్వభావం కలిగి ఉన్నాడు ఒక్క మన పాపముతప్ప:* హెబ్రీ 2:17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
యెషయా 53:9 అతడు అన్యాయమేమియు చేయలేదు *అతని నోట ఏ కపటమును* లేదు.
2 కొరి 5:21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు *పాపమెరుగని ఆయనను* మనకోసము పాపముగాచేసెను
1పేతురు 2:22 *ఆయన పాపము చేయలేదు*; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు
హెబ్రీ 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, *పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును* ఆకాశ మండలము కంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.
మానవులకు అవసరమైన నిజమైన ఆహారం, పానీయం, విశ్రాంతి, నిద్ర మొదలైన అన్ని సార్వత్రిక మానవ బలహీనతలను యేసు స్వయంగా తనలోనికి తీసుకున్నాడు. దీనిని మనము సువార్తలలో చూడగలం.
అయితే మానవులకు సామాన్యమైన సమస్యలుగా ఉన్న శారీరక వ్యాధులు, బలహీనతలు మొదలగునవి యేసు అనుభవించినట్లు మనకు ఆధారం లేదు.
మనలను పాపము నుండి కాపాడటానికి యేసు ఈ ప్రత్యేక విషయాలను ఆయన తన లోనికి తీసుకోలేదు.
పైన చెప్పిన వాక్యాలు యేసు *రెండు స్వభావాలు* కలిగి ఉన్నట్లు మనకు తెలియ జేయుచున్నవి. దైవ స్వభావం మరియు మానవ స్వభావం ఈ రెండు స్వభావాలు ఒక వ్యక్తిగా బేత్లెహేములో జన్మించిన యేసులో ఐక్యమయ్యాయి.
*3. అవతారం - The Incarnation:* దేవునిగా ఉన్న వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. యేసు భూలోక అవతారంలో, దైవ స్వభావం చురుకుగా (active) ఉన్నది మరియు మానవ స్వభావం నిష్క్రియగా (passive) ఉంది.
దేవుడు మనుష్యుడయ్యాడు, కానీ మానవుడు దేవుడు కాలేదు. కొలస్సి 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత *శరీరముగా క్రీస్తునందు* నివసించుచున్నది
1తిమో 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను
గల 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన *స్త్రీయందు పుట్టి* మనము దత్తాపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము నకు లోబడినవాడాయెను.
యేసు యొక్క దైవ స్వభావం ఎటువంటి పరిస్థితులలోను మారదు. వాక్యం దేవునిగా మారినప్పుడు ఆయన యొక్క దైవిక స్వభావంలో ఏ మార్పు చెందలేదు. దైవిక స్వభావం యొక్క వ్యక్తిత్వమే మానవ స్వభావంలో కొనసాగింది మరియు నివసించింది.
ఆయనలో ఉన్న రెండు స్వభావాల యొక్క *మూలం* భిన్నంగా ఉంటుంది. యేసు యొక్క దైవ స్వభావం నిత్యత్వం నుండి ఉన్నది అనగా అద్వితీయ కుమారునిగా యేసు జగదుత్పత్తి ముందే తండ్రితో బాటుగా నిత్యత్వంలో ఉన్నటువంటివాడు. (యోహాను 1:14, 18; 3:16).
అయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని సంకల్పం చొప్పున యేసు యొక్క *మానవ స్వభావం ప్రారంభమైనది.* (గలతీ 4:4).
దైవ మానవ స్వభావాల కలయిక ఒక అద్భుతమైన చర్యగా కన్య మరియ యొక్క గర్భంలో ప్రారంభమైనది. (లూకా 1:35, మత్తయి 1:20). యేసు శరీరంలో యేసు యొక్క దైవిక స్వభావం నివసించినదని మరియు యేసు యొక్క దైవ స్వభావం యేసు మానవ స్వభావంనకు వెలుపల లేదని కొలస్సి 2:9 మనకు చెప్పుచున్నది.
మానవులను విమోచించే పనిని సాధించేందుకు యేసు శిలువయొక్క అవమానకరమైన సమయంలో ఉన్నపుడు, ఆయన మానవ స్వభావం ఆ పరిస్థితులకు మరియు ఆ సమయాలకు పరిమితమై ఉన్నది.
యేసు యొక్క విజయోత్సవ సమయంలో, ఆయన మానవ స్వభావం అనేది సమయం మరియు పరిస్థితుల యొక్క మానవ సంబంధాల పరిమితి నుండి పూర్తిగా ఎత్తివేయబడింది మరియు ఇకపై దేనికి మానవ స్వభావం పరిమితం కాదు అనగా అయనకు ఆటంకం కాదు.
మత్తయి 28:18 అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను *నాకు సర్వాధి కారము* ఇయ్యబడి యున్నది
మత్తయి 28:20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి. వరకు *సదాకాలము మీతో* కూడ ఉన్నానని వారితో చెప్పెను.
పరమ దేవుడైన యేసు దైవస్వభావంతో కూడిన మనుష్య రూపములో మనందరి పాప విమోచన కోసమే దిగివచ్చినాడు. అకారమే లేని *వాక్యం* మానవ శరీరమును ధరియించడం అది ఒక గొప్ప మర్మమై యున్నది.
సర్వాధికారం కలిగిన *వాక్యం* తన అధికారం మరియు వైభవమును విడిచి
దాసునిగా మారడం ద్వార దైవ ప్రణాళిక నెరవేర్చబడి రక్షణ భువిలోనికి తీసుకురాబడింది. అందువల్లనే దేవునికి మానవునికి మధ్య గోడ కూల్చబడి తిరిగి సమాధానం ఏర్పడింది. (To be continued..)
దైవాశ్శీసులు!
From the desk of...
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి