ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *..... క్రిస్మస్.....* ✳

( ఐదవ భాగము)

 *తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.*   మత్తయి 2:11



*జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".*

👉బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు. 

*బంగారము రాజ్యాధికారమును సూచిస్తుంది.*
👉 ఆయన రాజు అనియు, ఆయన రాజరికంలో మనముండాలని తెలియజేస్తుంది. 

*జ్ఞానులు బంగారం సమర్పించడంద్వారా మనపట్ల దేవుడు ఎట్లాంటి అధ్బుతమైన ప్రణాళికను కలిగియున్నాడో అర్ధమవుతుంది.* 

👉హేరోదు యేసును చంపించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా యోసేపు కుటుంబ సమేతముగా ఐగుప్తుకు వెళ్లి కొంతకాలం అక్కడ జీవించ వలసివస్తుంది. 
*అటువంటి  పరిస్థితులలో వారి జీవనాధారం ఎట్లా?* 
👉అందుకే, 
*జ్ఞానులు సమర్పించిన బంగారం వారి అవసరాలు తీర్చేదిగావుంది.* 

అవును! 

*కొన్ని సందర్భాలలో నీకు సమస్య రాకముందే పరిష్కారాన్ని ఆయన సిద్దం చేస్తాడు.* 

*మరి కొన్ని సందర్భాలలో సమస్య వచ్చిన తర్వాత ఆయన పరిష్కరిస్తాడు.* 

*ఆయనకు అసాధ్యమైనది ఏదీలేదు. అన్నీ సుసాధ్యమే.* 
ఇదెప్పుడు సాధ్యం? 
ఆయనను రాజుగా నీ జీవితములో అంగీకరించి, చేర్చుకొని, నీపై రాజ్యాధికారాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించినప్పుడు. 

జ్ఞానులు వెతుక్కొంటూ ఆయన కోసం వెళ్ళారుగాని, 
*ఆయనే వెతుక్కొంటూ నీకోసం వచ్చాడు.* 

ఆయన నీ హృదయమనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు.
*ఆయన మర్యాదస్థుడు.త్రోసుకొని లోనికి వచ్చేవాడుకాదు.* 

👉ఆయన మెల్లనైన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చెయ్యి. 
ప్రశాంతమైన మనస్సుతో తట్టుచున్న శబ్దాన్ని వినడానికి నీ హృదయాన్ని సిద్ద పరచుకో! 

ఈ సంవత్సరాన్ని దాటిపోవడానికి కొన్ని  దినమే నీమధ్యలో వుంది. 
కనీసం, ఈదినమైనా ఆయనను చేర్చుకో! 

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! 

 *తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.*   మత్తయి 2:11

*జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".*

👉బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు. 

*బంగారము రాజ్యాధికారమును సూచిస్తుంది.*

*రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి*

*యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.*   మత్తయి 2:1,2

👉మన తలంపులు జ్ఞానమునకు అందవు. దానికి జ్ఞానులే ప్రత్యక్ష సాక్షులు. 
తూర్పు దేశమునుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 

ఎడారులు, కొండలు, లోయలు, గుట్టలగుండా వారి ప్రయాణం సాగిపోతుంది. రోజులు, వారములు, నెలలు గడచిపోతున్నాయి, 
*ఇంకా ఎంత కాలం?*
 *ఎంత దూరం ప్రయాణం చెయ్యాలో?* 

👉ఈలోపు వారు యెరూషలేము చేరుకున్నారు. ఒక పెద్ద రాజభవనం వారి కంటపడింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

👉కారణం? 
*ఈ లోక జ్ఞానం ప్రకారం రాజు, రాజు కుటుంబంలోనే జన్మిస్తాడు.* 

👉అంతవరకు నడిపించిన నక్షత్రాన్ని ప్రక్కనబెట్టి, స్వంత నిర్ణయంతో రాజ భవనంలోనికి ప్రవేశించారు. 

*జ్ఞానులు తీసుకున్న స్వంత నిర్ణయం ఎంత మూల్యం చెల్లించిందంటే?*
 
👉ఆ దినాలలో రెండు సంవత్సరముల లోపు వయస్సుగల మగ పిల్లలందరినీ హేరోదు చంపించడానికి కారణమయ్యింది.

👉దేవుని మార్గాన్ని విడచి మనం తీసుకున్న ఎట్లాంటి నిర్ణయాలైనా? 
*మనతో పాటు మన కుటుంబం, సంఘం, సమాజం కూడా భారీమూల్యం చెల్లించాల్సిందే?* 

👉కాని, వారు మార్గంతప్పినా, తిరిగి మరళా ఆనక్షత్రాన్ని అనుసరించి గమ్యం చేరుకోగలిగారు. 

*మన జీవిత ప్రయాణంలో ఎక్కడ తప్పిపోయామో?*
 
*దేనికి ఆకర్షించబడి దేవునికి దూరమయ్యామో?* 

ఈ క్రిస్మస్ దినాలలో ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకుందాం!

సరి చేసుకొని, మన గమ్యమైన నిత్యరాజ్యం వైపు సాగిపోదాం! 

 *తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.*   మత్తయి 2:11

*జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".*

👉బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు. 

*బంగారము రాజ్యాధికారమును సూచిస్తుంది.*
👉 ఆయన రాజు అనియు, ఆయన రాజరికంలో మనముండాలని తెలియజేస్తుంది.
 
*జ్ఞానులు సమర్పించిన కానుకలలో రెండవ "సాంబ్రాణిని"*

♻ *"సాంబ్రాణిని"*
ఇదీ మండుచున్నా అగ్ని లో వేస్తే పొగ వస్తుంది. మరియు మంచి సువాసన వస్తుంది. 

ఎఫెసీయులకు 5: 2
*క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను;*

లేవీయకాండము 2: 15
అది నైవేద్యరూపమైనది, నీవు దాని మీద నూనెపోసి దానిపైని సాంబ్రాణి వేయవలెను.

 *అర్పణ గా అర్పించుకున్నా యేసు క్రీస్తుకు సాదృశ్యము గా ఉన్నాది.*

*శిలువయాగము ద్వారా విమోచన కు సాదృశ్యము గా ఉన్నాది.*

*యేసుక్రీస్తులో ఉన్న మానవత్వంతో పోల్చవచ్చును*

*యేసు దావీదు సంతానము* (మత్తయి 1:1).... 

 *యేసు దేవుని కుమారుడు కూడా* (మత్తయి 3:17)....

👉యేసుక్రీస్తులో ఉన్న మానవత్వము వర్ణింపతరము కానిది... 
*దేశాలను పడగొట్టిన "పాపము"  కనీసము ఆయను ప్రభావితం చేయలేకపోయింది...*

 *రాజుల, అధికారులు తలలు వంచిన ఈ లోకాశలు ఆయనను జయించలేకపోయాయి...*

 *చివరికి ఆయనపై నేరంమోపటానికి కూడా ఆయన శత్రువులకు ఒక్క కారణం కూడా దొరకలేదు, చివరికి దొంగ సాక్షులను ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.*

*యేసు పరిపుర్ణమైన మనిషి.*

మరి అలాగే... 
*సృష్టికర్తగా యేసయ్య  సర్వబౌమాధికారమును చూసినప్పుడు ఆయన దైవత్వముతో మరొకరిని పోల్చలేము....*

రోమా పత్రిక 1: 4,5 వచనములు....
*“దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.*

♻ *జ్ఞానులు సమర్పించిన కానుకలలో మూడవది "బోళము"*

యోహాను 19: 39
*మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆసుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.*

*బోళము* అనేది పునరుత్థానమునకు సాదృశ్యంము.

 *యేసు దేవుని కుమారుడు అనటానికి అంటే యేసు దేవత్వాన్ని రుజువుచేసే కారణం ఆయన మరణాన్ని జయించి తిరిగిలేవటమే...* 

ఇప్పుడు... 
👉మీరు మరణం నుండి లేస్తే దేవుడేనా....? 
అని అడగవచ్చు....

చరిత్రను చూడండి... *చావునుండి లేచినవారు చాలా మంది ఉన్నారు...*
🔹 బైబిల్ లోనే మరణంనుండి లేచినవారు అనేకులు...
🔹 యేసయ్యే ముగ్గురిని మరణం నుండి లేపారు.... మంచిది... 
👉ఇప్పుడు వాళ్ళను కూడా దేవుళ్ళు అనాలా....? 
కాదు.
*ఎందుకంటే...?*

 *దైవశక్తీతో వాళ్ళు ప్రాణాలు పోసుకున్నారు, మరణం నుండి లేచారు కానీ వారి కాలం ముగిశాక తిరిగి చనిపోయారు.*

గమనించండి.... 
👉సమాధి నుండి లేచిన లాజరు ఆ తరువాత తన కాలము ముగిశాక చనిపోయారు... 
👉చావునుండి లేచాడు అని ప్రచారంలో ఉన్న వారు ఆతరువాత మరలా చనిపోయారు.

👉చరిత్రలో వీరు మరణం నుండి తిరిగి లేచారు అని చెప్పే ప్రతి వారి సమాధులు ఇప్పుడు మనకి కనిపిస్తాయి. పైగా అవి మూసి ఉంటాయి.... 
*ఒక్క యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఇప్పటికి తెరచియున్నది.*

🔺సర్వ మానవాళి పాపముల కొరకు యేసు బలిగా మరణించారు... 
🔺సమాధి చేయబడ్డారు...
🔺 సరిగ్గా మూడవ రోజున మరణమును, సమాధిని జయించి తిరిగి లేచారు. 
*ఇదిగో యుగయుగములు ఆయన సజీవుడైయున్నారు.* (ప్రకటన 1:17,18)....

వేదాలు, నీతిసూక్తులు, ఉపనిషత్తులు పలికిన చాలా మంది అలాగే దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు చాలామంది చనిపోయారు... సమాధిలోనే ఉండిపోయారు. 
కానీ, 
*నా యేసయ్య సమాధిలో అలాగే ఉండిపోలేదు...ఆయన పునరుత్థానుడై తిరిగిలేచారు... ఆయన దైవత్వానికి ఇది ఒక రుజువు.*

👉 ఆయన శరీరమునుబట్టి *దావీదు సంతానముగాను*
పరిపూర్ణమైన మానవునిగాను,
👉 మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి *దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.*

నా ప్రియ స్నేహితులారా....

*నా యేసయ్య పరిపూర్ణమైన మానవత్వం కలిగినవారు కనుక ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి శ్రమ, వ్యాధి, కష్టనష్టములను ఆయన అర్ధం చేసుకోగలరు...*
 అలాగే... 
*ఆయనకున్న దేవత్వమును బట్టి మీ ప్రతి అవసరతలలో మీకు సహాయము చేయగల సమర్ధులు.*

ఒక్కవిషయం!!!

*ఆరాధించే మనసు నీకుంటే?*
 
*నీవు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదు.*

👉కారణం? 
*ఆయన నిన్నే వెతుక్కుంటూ వచ్చాడు.*

*నీకోసం వచ్చిన ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటేచాలు.*

*నీ హృదయమనే తలుపు నొద్దనుండి తట్టు చున్నాడు. కనీసం ఈ రోజయినా ఆయనను ఆహ్వానిద్దామా? ఆరాధిద్దామా?*

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.*


👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు నేను మరియు కొంతమంది దైవజనులు కొన్ని గంటలు శ్రమించి మీ ముందుకు తెస్తున్నాము.* 
గనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...