ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్.....* ✳

(ఆరవ భాగము)

♻ *....విధేయత.....*♻

లూకా 1: 38
అందుకు మరియఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.

మత్తయి 1: 20
 *అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;*
 *క్రిస్మస్ లో ప్రధానమైన అంశాలలో "విధేయత" ఒకటి.*

👉 *ఇద్దరు యవ్వనుల యొక్క విధేయతే క్రీస్తు శరీరధారిగా లోకానికి రావడానికి కారణమయ్యింది.*

1⃣ *మరియ:*
ఆమె కన్యక.
లూకా 1:27

*లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించిన పరిశుద్దురాలు.*
 
 బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.

 ♻ *ఆరుగురు మరియలు* ♻

 నూతన  నిబంధనలో పేర్కొనబడిన 
*ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము.

1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ 
స్పష్టముగా గుర్తింపబడినది.

2 *మగ్దలేనేమరియ*
లోనుండిఏడుదయ్యములు
వెళ్ళగొట్టబడినవి.
మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2)
గుర్తించుటకు 
*మగ్ధలేనే*
అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు.

 3.అపోస్తులుడైన
యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది.
యోహాను19:25,
మత్తయి27:56,మరియు మార్కు15:40
పోల్చి చూచినట్లయితే
చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25)
యేసు తల్లి అయిన మరియ  సహోదరి
మత్తయి 27:61 మరియు
28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు
యోహాను19:25
ఉన్నట్లు క్లోపా భార్య అనిగాని పిలువబడినది.
ఆమెను గూర్చి ఎప్పుడు చెప్పబడినను ,తన కుమారులలో ఒకరు గాని లేక ఇద్దరిని గూర్చి గానీ వచ్చిన సందర్బములోనే చెప్పబడినది.

4.మార్త మరియు లాజరు సహోదరియైన *బేతనిమరియ* ఆమె పేరుతో లూకా10:39,42
యోహాను11:1,2,19,20,28,31,32,45;12:3;
మత్తయి26:7;
మార్కు14:8,9;
చెప్పబడినది.

5.బర్నబా సహోదరియు
మరియుయోహాను,మార్కు
(John Mark) తల్లి అయిన *మరియ*
అపొ.కా.12:12; ఈమె పేతురు సోదరి.

6.రోమా పట్టణములో  పౌలుకు సహాయం చేసిన
*మరియ* రోమ16:6;

  *యేసు తల్లియైన మరియ*

మరియ... ఎంతో గొప్ప మరియ... ఎంతో గొప్ప   *దైవభక్తిగల స్త్రీ....*
గమనించండి...  

దేవదూత వచ్చి మరియకు ఒక వార్త చెప్పాడు. *లోకనుసారముగా చూస్తే అది   తనకు అవమానమును కలిగించేది...* తన సిలంపై మచ్చవేసేదిగా ఉంది.
ఇంకా వివాహం కానీ కన్య... ఇంక కొన్ని రోజులలో పెళ్లి ఉంది... ఇప్పుడు తను గర్భవతి అని తెలిస్తే అది సమాజం ముందు ఎంతటి అవమానం. జరగనున్న వివాహం నిలబడుతుందా ? 
*" ఇది విషయం "* అని నిజం చెప్పినా ఎవరేనా నమ్ముతారా...? ఇన్ని అనుమానాలమధ్య మరియ ఒక్కటే మాట చెప్పింది *"ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక"* అని....

మరియ జరగనున్న వైపరిత్యాలు అన్ని వదిలేసి దేవుని చిత్తం పూర్తిగా తనలో నేరవేరుటకు అనుమతించింది. 

*దేవుని పై పూర్తిగా విశ్వాసముంచింది. అంతే కాదు అండి... వాక్యంలో వ్రాయబడిఉంది... పరిశుద్ధాత్మ ఆమెను కమ్మెను"* అని... పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తను వెళ్ళిపోయింది. ఎంతో మందికి పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వెళ్ళటం చేతకాదు. దానికన్నా ముందు ఇష్టతచూపించారు.

యోబు గారు అంటారు... *"నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా"* అని... ( యోబు 4:6 ).
అదే మరియ ధైర్యం... రానున్న నిందలు ఆమెను భయపెట్టలేదు, తన వివాహబంధం ఏమవుతుందో అనే భయం లేదు. తనని ఇంకా ఏ మాటలుకూడా కలవారపెట్టలేకపోయాయి.

*దేవుని చిత్తం తనలో నేరవేరాలి ఇది ఒక్కటే ఆమెలో పనిచేస్తూఉంది. పెద్దపెద్ద భక్తులలో కనిపించే మొదటి లక్షణం ఇదే. మరియ... ఎంతో గొప్ప దైవభక్తిగల స్త్రీ.*

ఆమె కన్యక.
లూకా 1:27

*లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించిన పరిశుద్దురాలు.*

👉దానిలో ఎట్టిసందేహం లేదు.
*ఆమెను పరిశుద్దమైన స్త్రీగా మనము గౌరవించాలి.*
👉 తన జీవితాన్ని మన జీవితాలకు ఆదర్శప్రాయంగా మలచుకోవాలి.
కాని, 
*ఆరాధించడానికి వీల్లేదు.* 
👉కారణం?
 *మనుష్యలు గాని, దేవదూతలు గాని ఆరాధనకు యోగ్యులుకారు. దేవుడొక్కడే ఆరాధనకు పాత్రుడు.*

*జ్ఞాలులు కుడా యేసును మాత్రమే ఆరాధించారుగాని, మరియను గాని, యోసేపును గాని కాదు.*

👉ఎట్లాంటి పరిస్థితులలో ఆమె యేసు ప్రభువుకు తల్లి అయ్యే ధన్యతను పొందుకోగలిగింది?

*మరియ హృదయంలో అద్భుతమైన సంఘర్షణ.*
 
🔺ఒక వైపు రక్షకునికే తల్లి అయ్యే ధన్యత. 
🔺మరొక పైపు వివాహం కాకుండా తల్లి అయితే? 
లోకంలోఎట్లా జీవించగలగడం? 
రాళ్లతో కొట్టి చంపేస్తారు.

👉చివరకి ఒక నిర్ణయానికి వచ్చేసింది. 
*నిందలు, అవమానం భరించడానికే సిద్దపడింది.*
👉 దేవుడు పంపిన, దూత చెప్పిన వర్తమానముకే విధేయురాలయ్యింది.

*తాను అనుకున్నట్లే జరిగింది.* 

*లోకం సూటిపోటి మాటలతో ఆమెను హేళన చెయ్యడం ప్రారంభించింది.* 

*మరియ పరిశుద్దత ఏంటో ఇప్పుడు బయటపడిందని, లోకం కోడై కూస్తుంది.*

*చివరకి కొంతకాలం ఇంట్లోనుండి వెళ్ళిపోవలసి వచ్చింది.*
 
👉అన్నిటిని భరించింది.
కాబట్టే! 
*లోక రక్షకునికి తల్లి అయ్యింది.*

🔹దేవుని మాటకు గొర్రెల కాపరులు విధేయులయ్యారు. 

🔹దేవుని మాటకు మరియ విధేయురాలయ్యింది.

*మన సంగతేంటి?*
👉ఇంకనూ ఎదురాడు వారిగానే జీవిస్తున్నామా? 

👉అవిధేయులుగానే బ్రతుకుతున్నామా?
*ఇంకెంత కాలం?*

🔺ఆయనను ఇంకనూ, పశువుల తొట్టెలోనున్న శిశువుగానే చూస్తూ జోలపాటలు పాడే సమయమిది కాదు. 

🔺 ఆయన కృపా మయుడు, ప్రేమామయుడు అంటూ, జీవితాన్ని సరిచేసుకోకుండా వాయిదాలు వేసే సమయమిది కాదు.
వద్దు! 

*ఆయన గర్జించు కొదమ సింహమువలే రాబోతున్నాడు.*
ఇంకనూ, విధేయత చూపకుంటే. తప్పించుకోలేము.

 విధేయులవుదాం! 
శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...