✳ *.....క్రిస్మస్....* ✳
(పదకొండవ భాగము)
♻ *కన్యక గర్భము ధరించుట అనే సిధ్ధాంతము చాల కీలకంగా ప్రాముఖ్యమైంది....✍*
మత్తయి 1: 22
*ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు*
*కన్యక గర్భము ధరించుట అనే సిధ్ధాంతము చాల కీలకంగా ప్రాముఖ్యమైంది.*
(యెషయా 7:14; మత్తయి 1:23; లూకా 1:27, 34). మొదటిగా లేఖానాలు ఏవిధంగా ఈ సంఘటనను వివరిస్తుందో పరిశీలిద్దాము.
*మరియ ప్రశ్నకు యిదెలాగు జరుగును?*
(లూకా 1:34)అని దూతతో పలుకగా, దానికి ప్రతిస్పందనగా దూత - *పరిశుధ్ధాత్మా నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుధ్ధుడై దేవుని కుమారుడనబడును*
(లూక 1:35)అని చెప్పెను.
*దేవునిదూత యోసేపును ప్రోత్సాహపరుస్తు నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమే గర్భము ధరించినది పరిశుధ్ధాత్మ వలన కలిగినది*
(మత్తయి1:20).
👉 మత్తయి నిర్థారించేది ఏంటంటే వారేకము కాకకమునుపే అంటే
*కన్యకగా నున్నప్పుడే ఆమే పరిశుధ్ధాత్మునివలన గర్భవతిగా నుండెను*
(మత్తయి 1:18).
*దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీ యందు పుట్టి* అని గలతీ 4:4 కూడా కన్యక గర్భమును గూర్చి భోధిస్తుంది.
👉ఈ పాఠ్యాభాగాలనుంచి మనకు చాల స్పష్టముగా అర్థము అయ్యేదేంటంటే యేసు జన్మ ఫలితమే మరియ శరీరములో పరిశుధ్ధాత్ముడు జరిగించిన కార్యము.
*పరిశుధ్ధాత్మా నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుధ్ధుడై దేవుని కుమారుడనబడును*
(లూక 1:35)అని చెప్పెను.
👉 *మరియ* తన్ను తాను గర్భవతి చేసుకొనుటకు అవకాశములేదు,
👉ఎందుకంటే ఆమె ఒక సామాన్యమైన పనిముట్టు లాంటిది.
👉దేవుడు మాత్రమే అవతరించుట అనే అధ్భుతమును చేయగలడు.
👉ఏదిఏమైనప్పటికి, యోసేపు మరియల మధ్య శారీరక సంభంధమును నిరాకరించుటను అట్టి
*యేసు నిజమైన మానవుడు కాడు అని సూచిస్తుంది.*
👉 *యేసు సంపూర్తిగా మానవుడే, మనకు లాగా శరీరమును కలిగియున్నాడని అని లేఖనము భోధిస్తుంది.*
👉ఇది మరియ దగ్గర్నుండి పొందుకున్నాడు.
*అదే సమయంలో యేసు నిత్యమైన, పాపములేని స్వభావముతో సంపూర్తిగా దేవుడే*
(యోహాను 1:14; 1 తిమోతి 3:16; హెబ్రీయులకు 2:14-17.)
👉యేసు పాపములో పుట్టినవాడు కాదు అంటే ఆయన స్వభావములో పాపములేదు
(హెబ్రీయులకు 7:26).
👉 తండ్రినుంచి ఒక తరమునుండి మరొక తరముకు పాపస్వాభావము సంప్రాప్తమైనట్లు అగుపడుతుంది
(రోమా 5: 12, 17,19). *పాపపు స్వభావమును ప్రసరించే గుణాన్నినుండి తప్పించుకొనుటకు కన్యక గర్భము ధరించుట దోహదపడింది మరియు నిత్యుడైన దేవుడ్ని పూర్తిమంతమైయున్న మానవుడుగా అవతరించుటకు అనుమతికలిగింది.*
♻ *యేసు దేవుని కుమారుడు*
👉 యేసు దేవుని కుమారుడు అనేది మానవ తండ్రికుమారులవలె కాదు.
👉దేవుడు పెళ్ళి చేసుకోలేదు కుమారుని కలిగి యుండటానికి.
*యేసు దేవుని కుమారుడు అన్నప్పుడు మానవ రూపంలో ఆయనను దేవునికి ప్రత్యక్ష పరచాడు* (యోహాను 1:1-14). *పరిశుధ్ధాత్ముని ద్వారా మరియ గర్భము ధరించుటను బట్టి యేసు దేవుని కుమారుడు.*
యూదా నాయకుల తీర్పు సమయంలో ప్రధానయాజకుడు యేసయ్యను రెట్టించి అడిగాడు. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి -
*నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని ఆనబెట్టుచున్నాననెను* (మత్తయి 26:63).
👉అందుకు *యేసు నీవన్నట్టే.*
*ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా* (మత్తయి 26:64).
👉అందుకు దానికి యూదానాయకులు స్పందిస్తూ *యేసయ్య దేవదూషణ చేస్తున్నాడని నేరారోపణ చేశారు*
(మత్తయి 26:65-66).
👉ఆ తర్వాత పొంతిపిలాతుముందు అందుకు యూదులు- మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి (యోహాను 19:7).
🔺ఆయన దేవుని కుమారుడను చెప్పుకోవటం ఎందుకు మరణ శిక్ష విధించాల్సిన దేవదూషణ అయ్యింది?
🔺యూదానాయకులు దేవుని కుమారుడు అని చెప్పుకొన్నదాన్ని సరిగాఅర్థం చేసుకున్నారు.
*దేవుని కుమారుడు అనగా దేవుని స్వభావము కలిగినవాడు అని అర్థం. దేవుని కుమారుడు దేవునినుండి వచ్చాడు. దేవుని స్వభావము కలిగినవాడు*
👉 అనగా దేవుడు కాబట్టి యూదానాయకులు దేవదూషణగా గుర్తించారు. *లేవీకాండం 24:15*
👉 ఆధారం చేసుకొని యేసయ్య మరణాన్ని కోరారు.
*ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి,* అని హెబ్రీయులకు 1:3 దీనిని చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది.
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి