ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(27 వ భాగము )

*దావీదుకు చిగురైన యేసు*

(యెష్షయి మొద్దు చిగురు – 2వ భాగం - 

(రోమా 15:12 యెష్షయిలో నుండి వేరు చిగురు, అనగా *అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును*; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.)

*దావీదు సంతానంగా చిగురు:*  యెష్షయి దావీదుకు తండ్రి. ఈ చిగురు పుట్టేది దావీదు వంశంనుండే. ఇక్కడ చిగురు లేక అంకురము గురించి దేవుడు చెప్తున్నాడు.

ఈ అంకురం లేక చిగురు ప్రభువైన యేసే.  యెషయా 7:14లోనూ 9:6,7లోనూ ఉన్న అభిషిక్తుడు, కుమారుడు, శిశువు మరెవరో కాదు. దావీదుకు చిగురు అయిన యేసు.

ఇదే విషయాన్ని పౌలు భక్తుడు తన రోమా పత్రికలో వ్రాస్తూ యేసు తన శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా వచ్చాడని వ్రాశాడు.

రోమా 1:5 యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.

ప్రకటన 22:16 నేను *దావీదు వేరు చిగురును సంతానమును,*  ప్రకాశమానమైన  వేకువ  చుక్కయునై యున్నాను.

దావీదు సింహాసం అధిష్టించుటకు ఎవరు కూడా అర్హులు లేని కారణంగా మరియు దావీదు సింహాసనం శాశ్వతం అని దేవుడిచ్చిన వాగ్దానం నేరవేర్పు కొరకు ఆ దేవాది దేవుడు తానే దావీదు కుమారునిగా జన్మించి తన వాగ్దానం నెరవేర్చెను. కన్య మరియతో దేవదూత చెప్పిన సారాంశం ఇదే. 

ఏ గ్రామంలో దావీదు జన్మించేనో, ఏ స్థలంలో దావీదు గృహమున్నదో, ఏ స్థలంలో దావీదు పుట్టెనో అదే స్థలం యేసు జన్మించు కాలానికి పశువుల పాకగా ఉన్నదని బైబిల్ పండితుల అభిప్రాయం.

ఆవును, పాప ప్రభావం ద్వారా నరికివేయబడుచున్న సమస్త మానవాళిని రక్షించుటకు మొద్దై పోయిన దావీదు వంశమునకు చిగురుగా వచ్చిన  యేసే *నిజమైన దావీదు కుమారుడనే* రహస్యాన్ని గ్రహించిన  గ్రుడ్డివారు *దావీదు కుమారుడా* మమ్మును కరుణించుమని అయనను వేడుకొన్నారు.

గ్రుడ్డి వాడిన బర్తిమయి కూడా ఇదే సత్యాన్ని గ్రహించి *దావీదు కుమారుడా* నన్ను కరుణించుము అని కేకలు పెట్టాడు. మార్కు 10:46-48

*చిగురు యొక్క కొన్ని లక్షణాలు చూద్దాం:*

*1. రాజుగా ఏలుటకు వచ్చిన చిగురు:* (రోమా 15:12 మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలో నుండి *వేరు చిగురు, అనగా అన్యజనులను ఏలుటకు* లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.)

దావీదుకు చిగురుగా వచ్చిన యేసు ఆయన సర్వోన్నతుడైన దేవుని అవతారం, ప్రపంచాన్ని భావి కాలంలో పరిపాలించ బోతున్నవాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసు క్రీస్తు.

(లూకా 1:32 -33 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని  ఆమెతో చెప్పెను.)

అనేక మందికి ఆయన రాజుగా విచారణ చేయును. (“ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.” యెషయా 11:10)

చిగురు ఏలుబడిలో అంతా నెమ్మది మరియు రాజ్యము నిత్యము స్థిరపరచ బడును. (2సమూ 7:11-13 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగానేను నీకు సంతానము కలుగ జేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను.)

*2.చిగురు ఎదిగి ఫలించునది:* (యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి *అంకురము ఎదిగి ఫలించును*) 

చిగురుగా పుట్టిన యేసు ఎదిగి ఫలించువాడు మనలను ఫలింపజేయువాడు. యోహాను  15:5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును.

*3. సేవకునిగా చిగురు:* ఆయన ఈ లోకమునకు పరిచారకుడుగా వచ్చెను. సేవకుని రూపం దాల్చెను. (జెకర్యా 3:8 ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ  యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా *చిగురు అను నా సేవకుని* నేను రప్పింపబోవు చున్నాను.)

సేవకుడుగా వచ్చినాడు గనుకనే రాజభవనంలో జన్మించక బెత్లేహేములోని పసుల పాకలో జన్మించాడు. (మత్తయి 20:28 ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును వచ్చెను.)

సేవకునిగా పుట్టిన యేసును గురించి ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు చెప్పారు. 

యెషయా 42:1 ఇదిగో నేను ఆదుకొను *నా సేవకుడు* నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు  అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. 

యెషయా 52:13 ఆలకించుడి, *నా సేవకుడు* వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.  53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన *నా సేవకుడు* జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.)

దావీదు చిగురు యొక్క మరి కొన్ని లక్షణాలు రేపు చూద్దాం:

దైవాశ్శీసులు!

- పాస్టర్ జ్యోతిరాజు వేముల
ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి 
నిడుబ్రోలు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...