✳ *....క్రిస్మస్....* ✳
(ఇరవై ఏడవ భాగము)
✳ *నిజమైన క్రిస్మస్ ఎప్పుడు ?....✍*
*ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను రెండవసారి ప్రత్యక్షమగును.*
హెబ్రీ 9:26-28
👉 ఈ పర్వదినాన క్రిస్మస్ గురించి మీరేమనుకుంటున్నారు?
👉 *గత దినాలలో క్రిస్మస్ పండుగ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అని కొన్ని మీడియా సంస్థలు ప్రజలను ఇంటర్వ్యూ చేయగా ప్రజల స్పందన ఈ విధముగా ఉంది.*
🔹 క్రిస్మస్ అంటే – Tree అని,
🔹 Star అని,
🔹 Colour Bulbs అని,
🔹 New Clothes అని,
🔹 Candles అని,
🔹 Church Attending అని,
🔹 Good Meals అని,
🔹Cake అని
👉 *ఇలా అనేకమంది క్రిస్మస్ అనగా అర్థం పర్థంలేని జవాబులిచ్చారు.*
♻ *కానీ నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించి, మహిమపరిచి, ఘనపరచుటయైయున్నది.*
ప్రకటన 4:8
*ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను రెండవసారి ప్రత్యక్షమగును.*
హెబ్రీ 9:26-28
సందేశంలోని వాక్యభాగమును జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒక్కసారే ప్రత్యక్షపరచబడెనని 26వ వచనము చివరి భాగంలో చూస్తాము.
👉 దీనిని క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షతగా మరి విపులముగా ధ్యానిస్తాము.
♻ *మొదటి ప్రత్యక్షత* ♻
♻ *క్రీస్తు మొదటి రాకడ కారణం*
👉 సృష్టిలో మొదటి మానవుడైన ఆదాము ద్వారా సంక్రమించిన *పాపము* భువిపై జన్మించిన ప్రతీ మనిషికీ సంప్రాప్తమైనది.
👉 ఆ వ్యాధి ద్వారా మానసిక శారీరిక రుగ్మతలలో, సాతాను బంధకాలలో స్వనీతిలో, హృదయంలో ఎవరూ నింపలేని శున్యంతో జీవిస్తూ తనలోని కొరతను నింపుకోవడానికి అనేక వారిలో నిజమైన శాంతి, సమాధానము పొందలేక విముక్తి కోసం పరితపిస్తున్న సమయంలో *కాలము పరిపూర్ణమైనపుడు దేవుడు తన కుమారుని పంపెను.*
👉 దేవునికి దూరస్తులును, దుష్క్రియలవలన మనసులో విరోధభావము గలవారునై యుండిన వారిని తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధనపరచెను. *ఆ పిల్లలు రక్తమంసములు గలవరైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయెను.*
👉 అయితే ఈనాడు చాలామంది క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నవారు పరిశుద్ధ గ్రంధంలోని ఆయన ప్రవచనాల నెరవేర్పును ఆయన ఉన్నతమైన గుణలక్షణాలను *ఆయన జన్మలోని రహస్యాన్ని హృదయ పూర్వకంగా గ్రహించి అంగీకరించకుండా కేవలం బాహ్య సంబంధమైన భౌతిక అలంకారాల కోసమే ప్రాధాన్యత నిస్తూ జరుపుకునే పండుగవలె "క్రిస్మస్" ను ఒక పండుగ వలె జరుపుకుంటున్నారు.*
👉మానవుడు తన జ్ఞానంతో సృష్టించుకున్న అనేక పండుగల వలే క్రిస్మస్ ఒక కులానికి చెందిన పండుగకాదు.
*ప్రపంచ మానవ జాతి పాప విముక్తికోసం దేవుడే మానవుడిగా అవతరించిన మహోన్నతమైన పర్వదినం క్రిస్మస్.*
👉 ఆయన నీ హృదయములో జన్మిస్తే నీవు ప్రతీరోజు పండుగ అనుభవించ గలవు.
👉 ఈనాడు మన దేశంలో క్రీస్తు ప్రభువు దళితుల కులదేవుడిగా వారి యొక్క పండుగగా క్రిస్మస్ జరపబడడం ఎంతో విచారించదగ్గ విషయం.
🔺 ఈనాడు క్రైస్తవులు కూడా పల్లెలో, పట్టణాల్లో ఈ పండుగ వేడుకల కోసం డిసెంబర్ మొదటి వారం నుండే అడ్వాన్స్ క్యారెల్స్, చింతలేదిక యేసు పుట్టెను పాటలు (హృదయంలో చింత పోకుండానే) నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం సాంస్కృతిక కార్యక్రమాల కోసం సిద్దపాట్లు తమ తమ స్వగ్రామాలకు ప్రయాణాలు,
ఇళ్ళు, సున్నాలతో అలంకరణలు, పిండి వంటలు *సంవత్సరమంత గుడికి రానివారు రావడంతో చర్చినిండిపోవడం,*
👉 విష్ యు హ్యాపీ క్రిస్మస్ అంటూ అభినందనలు, ఇలా ఇంకా ఎన్నో ....రకాలైన బాహ్య సంబంధమైన ప్రాముఖ్యాలతో క్రిస్మస్ పండుగ ఖర్చులతో ప్రేస్టేజి కోసం చేసిన అప్పుల బాధతో వెళ్ళిపోతుంది.
*ఓ క్రైస్తవ ప్రియ చదువరీ! ....*
👉ఒక్క నిమిషం ఈ విషయంలో దయచేసి ఆచి ఆలోచించుమని మనవి *సంవత్సరాని కొకసారి అలాచేసి,,,,, సంవత్సర మంతా నీ ఇష్టానుసారంగా జీవించమనికాదు.*
👉ఆయన శరీరాకారంలో జన్మించింది నీ కోసం మనందరి కోసం
*నీవు పండుగ నాడు చేసే ఆర్భాటాలు కాదు ఆయనకు కావలసింది*
👉 *క్రీస్తు నీ హృదయంలో జన్మిస్తే*
🔺 పాప పంకిలమైన నీ హృదయంలోని శూన్యత,
🔺 అజ్ఞానం,
🔺 అపవిత్రత,
🔺పాపభారం
*సంపూర్ణంగా తొలగించబడి ఆయనతో కలసి సహవాసం, సమాధానం, సంతోషం అనుభవించగలము.*
👉 ఆయన యందలి విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడగలవు.
*క్రిస్మస్ క్రైస్తవుడిగా కాక*
👉 ప్రతిదినం క్రీస్తును వ్యక్తిగతంగా అనుభవిస్తూ అనుకరిస్తూ,
👉అనుసరిస్తూ నీవున్న చోట ఆయన కోసం బ్రతకాలని
👉 ప్రజలు నీలో ఆయనను చూడాలని
👉ఆ సత్య సువార్త నీ ద్వారా ప్రకటింపచేయాలని ఆయన కోరిక,
*ఆయన పేరే తెలియని ప్రజలు నీ చుట్టూ ఎంతోమంది వుంటూ ఉండగా మానవుడు వెతుక్కునే మోక్షమార్గం క్రీస్తు ప్రభువేనని ప్రకటించాల్సిన భారం, బాధ్యత నీ మీద వుండగా*
👉 క్రిస్మస్ ని ఓ పండుగలా జరుపుకొని మరచిపోతే,,,,, *రేపు ఆయన ధవళసింహాసనం ముందు నిలుచున్నపుడు నీవు ఎంత బాగా పండుగ జరపావని అడగడు, నా కోసం ఎన్ని ఆత్మలను రక్షించావు? నా నామాన్ని ఎంత మందికి నా నామంకోసం ఎన్ని అవమానాలు, హింసలు, పొందావు? అని అడుగుతాడు.*
👉అప్పుడు నీ సమాధానం ఎమిటి?
🔺ఇప్పటికైనా,
*ఈ సంవత్సరమైనా ఆచార క్రిస్మస్ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి,*
*క్రైస్తవ విశ్వాసవీరునిగా ఆ మహా ప్రభువు, త్యాగమూర్తి యొక్క జన్మ ప్రాముఖ్యతను వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఆయన జన్మమును గూర్చి తెలియని వారికి తెలియజేయి.*
*అప్పుడే నీ జీవితంలో ప్రతిదినం నిజమైన క్రిస్మస్ అనుభవించగలవు.*
👉 ఈ ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభువులవారిని తండ్రియైన దేవుడు ఈ లోకానికి బహుమానముగా ఇచ్చెను అని యోహాను 3:16లో చూస్తాము.
*దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అనగా ఆయన లోకములో వుండే మనలనందరినీ ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా అనగా అనేక కుమారులు వుండికాక ఒకేఒక అనగా తన ఏకైక కుమారుని మన కొరకు మరియు ఈ లోకమును రక్షించుటకు మనకు అరుదైన బహుమానముగా ఎవరుకూడా జీవితములో ఇవ్వలేనటువంటి బహుమానమునిచ్చెను.* కనుక మనకందరికి దేవుడిచ్చిన అద్భుత వరం. అంతేకాక గొప్పతనములోను, విలువలోను వర్ణనాతీతమైన ఉచిత వరం అని తెలుసుకోవాలి.
2కోరింథీ 9:15లో
*శక్యముకాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు* అని పౌలు అన్నాడు.
👉 యేసు ప్రభువును లోకానికి పంపడములో దేవుని ఉద్దేశ్యము ఇక్కడ స్పష్టముగా వెల్లడయింది. మనుష్యులు పాపములో నశియించిపోవుచున్నారు. వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక. మనము శాశ్వతముగా నరకములో నశించిపోవడం దేవునికి ఇష్టములేక తనతో అనంతకాలం జీవించడానికి దేవుడు మనకిచ్చిన అవధులులేని, పరిమితిలేని, కానుక.
*ఈ మొదటి ప్రత్యక్షత వలన మనము దేవుని స్తుతించి, ఆరాధించి, ఘనపరచాలి.*
♻ *ప్రత్యక్షత మర్మము* ♻
👉 *యేసుక్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షతమవ్వడానికి మూలకారణం లోకమంతటిని రక్షించి తన బిడ్డలనుగా చేసుకోవాలన్నది తన ప్రణాళికయైయున్నది.*
అందుకే ఆయన పరిశుద్ధాత్మవల్ల జన్మించి నరావతారుడై ముప్పదిమూడున్నర సంవత్సరములు జీవించి ఈ లోకము కొరకు తానే తన ప్రాణమును బలిగా యిచ్చెను.
👉 *ఒక వ్యక్తి ప్రజల కొరకు ప్రాణము పెట్టడం ఎప్పుడైనా చూశామా?*
👉 ఎవరైనా ప్రాణము పెడితే తమ కొరకో, తమవారి కొరకో ప్రాణము పెట్టడం సహజం. కానీ ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం చూడలేము.
*కానీ మన ప్రభువు పాపమానవాళి కొరకు ప్రాణం పెట్టడం చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం.*
ఈ విషయాన్ని గురించి యోహాను 10:18లో చూస్తాము.
*మరణము, జీవము ఆయన చేతిలో వున్నాయి* అని పై వాక్యభాగములో చూస్తాము. కావున తనంతటతానే తన ప్రాణమును మనకొరకు ఇచ్చెను. ఎంత ధన్యకరము!
ప్రియులారా! ఇలాంటి ధన్యకరమైన జీవితం మనం పొందుట ఎంత ఆశీర్వాదకరం. అనగా తన ప్రాణమును ఇతరుల కొరకు ఇచ్చి అందరిలో అతిశ్రేష్ఠుడైన యేసుప్రభువును మనం దేవుడిగా కలిగియుండడం మనకెంతో దీవెన. అలాంటి దేవున్ని నిత్యము నీవు స్మరిస్తూ నీ జీవితంలో నీ ప్రతిభారమును ఆయన మీద మోపగలిగినట్లయితే ఆయన నిన్ను విడిపించి రక్షించి కాపాడువాడు.
*యేసుక్రీస్తు నరావతారిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను* అని
ఫిలిప్పీ 2:7లో చూస్తాము.
👉 కనుకనే ఆయన అందరిలో తనను తాను తగ్గించుకొనినవారిలో క్రీస్తు ప్రథముడైయున్నాడు. అందుకే పౌలు యేసు ప్రథమ ఫలము అని వర్ణించాడు. అంతేకాక ఆయన మనకొరకు మధ్యవర్తిగా వుండి విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు ఆయన మనకు సమాధాన పరిచర్యను అప్పగించెను. మన పాపములను మనము మోయకుండనే ఆయనే మోసి మనకు సమాధానమునిచ్చెను. ఈ సమాధానమే ఒక గొప్ప సువార్త అని పౌలు వర్ణించాడు. పైన పేర్కొనబడిన విషయాలన్నీయుకూడా క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షతను జ్ఞాపకము చేయుచున్నవి. ఆయన బిడ్డలైనవారందరు ఈ గొప్ప ప్రత్యక్షతను అనుభవించిరి.
👉 *ఈ ప్రత్యక్షత నీవు అనుభవించినచో ధన్యుడవే. క్రీస్తు మొదటి ప్రత్యక్షత నీకు లేనట్లయితే నీవు ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుని ఆయన రక్తముచేత కడుగబడి నీతిమంతుడిగా తీర్చబడితే నీవు కూడా మొదటి ప్రత్యక్షత అనుభవించినవాడవు. ఎవరైతే మొదటి ప్రత్యక్షత అనే అనుభవమును కలిగియుంటారో వారికే రెండవ ప్రత్యక్షత దొరకును.*
♻ *రెండవ ప్రత్యక్షత* ♻
👉 *క్రీస్తు రెండవ సారి ప్రత్యక్షమగునని*
హెబ్రీ 9:28వ వచనములో చూడగలము.
👉ఎవరైతే ఆయనను నమ్మి ఆయన బిడ్డలుగా జీవించుదురో వారికి ఈ ప్రత్యక్షత రాబోవు కాలమందు దొరకును. ఈ లోకములో మనుష్యులందరు మరణమునొందుదురని పౌలు హెబ్రీ పత్రిక 9:27లో జ్ఞాపకము చేస్తున్నాడు. గనుక మరణము అందరికీ తథ్యమని చెపుతున్నాడు,
👉 *కావున మరణము తరువాత ఏమిజరుగుతుందో ఎవరికి తెలియదు.*
👉 ఈ విషయమును లోకములో ఎవ్వరూ తెలుసుకొనలేక పోతున్నారు. అయితే ఈ విషయమును గూర్చి మనము వాక్యముద్వారా తెలుసుకుందాం.
👉 *మరణము తరువాత ఏమని ఆలోచించేవారంతా ఒకవిషయంలో జాగ్రత్తగా గమనించాలి.*
*మరణము తర్వాత తీర్పు ఉన్నదని మనము చూస్తాము.తీర్పులో నిర్దోషిగా వుండే వారందరికి తదుపరి గమ్యస్థానం పరలోకమే.*
🔹ఈ ధన్యత భూమిమీద జీవించువారందరికి అనగా ఆయననెరిగియున్న వారందరికి దేవుడిచ్చే గొప్ప బహుమానం. కావున ఆయన రక్తములో కడుగబడివుంటే ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో వుంటావు. ఈ ధన్యత పొందవలసినది నీవు, నీ కుటుంబము, నీ సంఘమే. తద్వారా మహిమ, ఘనత, మెప్పును దేవుని ద్వారా పొందగలవు.
*ఇదే రెండవ ప్రత్యక్షత.*
👉 *ఎవరైతే ఈ రెండవ ప్రత్యక్షతకు యోగ్యులుగా వుందురో వారిదే నిజమైన క్రిస్మస్.*
👉 *కనుక ఈ ప్రత్యక్షత కొరకు నీవు సిద్ధపడియున్నావా?*
👉 *లేక ఇంకా ఈ లోకమును ప్రేమించుచున్నావా?*
👉 *మన జీవితములను పరీక్షించుకొని మారుమనస్సుపొంది పశ్చాత్తాపపడి ఆయన కొరకు జీవించుచు, మన దృష్టిని లోకమువైపు మరల్చకుండా ఆయన వైపే గురి కలిగి వుండినచో నీవు ఆశీర్వదించబడుదువు.*
🔺 నీవు క్రిస్మస్ పండుగ ఆచరణలో మునిగి, త్రాగి, భుజించి, కేరింతలు వేస్తూ గడుపుతున్నట్లయితే నీవు ఒక సారి జాగ్రత్తగా ఆలోచించు.
🔺 *క్రిస్మస్ అంటే కేకలు కాదు, అరుపులు కాదు, ఆర్భాటాలు కాదు.*
🔺 *క్రిస్మస్ అనగా సమాధానము మీకు కలుగునుగాక అని దూతలు పలికినట్లు మనం కూడా సంఘములో తోటి విశ్వాసులతో క్రిస్మస్ దినాన నీకు సమాధానము కలుగునుగాక అని పలికితే అంతకంటే సంతోషము మరొకటి లేదు.*
♻ *కావున మనం సంతోషకరమైన క్రిస్మస్ జరపాలంటే*
1⃣ *క్రీస్తు మొదటి ప్రత్యక్షతను పొంది రెండవ ప్రత్యక్షతకు సిద్ధపడాలి.*
2⃣ *అందరితో సమాధానముగా వుంటే అదే అసలైన సిసలైన క్రిస్మస్ పండుగ.*
👉 *కావున దేవుడు కోరే అసలైన క్రిస్మస్ అనే రెండవ రాకడకు నీవు నీ కుటుంబము సిద్దపడియుండాలి.*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి