ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(14 వ భాగము )

*ఎవరీ శిశువు – బలవంతుడైన దేవుడు*

_(యెషయా 9:6  ఏలయనగా మనకు శిశువు పుట్టెను - బలవంతుడైన దేవుడు)_

➡A. ఎందుకు *శిశువు* బలవంతుడైన దేవుడుగా ఈ లోకంలో పుట్టాడో ముందుగా పరిశీలిద్దాం. యెషయా కాలం నాటి పరిస్థితులు చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలిగి ప్రజలు ఎంతో బలహీనులై పోయారు. ప్రజలందరూ గాఢాంధకారములోనికి తోలివేయబడి ప్రజల మెడ మీద కట్టుకర్ర వేయబడి, బరువైన కష్టాలనే కాడి మోయుచూ, వారిని తోలువాని కొరడా దెబ్బలు తింటూ ఎంతో సొమ్మసిల్లి ఏమి చేయలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. 

ఇటివంటి బలహీన స్థితిలో ఉన్న తన ప్రజలను విడిపించి తోలువాని కొరడాలు విరిచి ప్రజల మెడల మీద ఉన్న సాతాను కాడిని తొలగించుటకు కొరకు *“బలవంతుడైన దేవుడుగా”* కుమారుడు ఈలోకంలో జన్మించవలసి యున్నది. 

సాతాను భయకరమైన *మరణబలం* గలవాడు గనుక ఏ మానవుడు కూడా ఆ మరణ బలమును ఎదిరించలేని పరిస్థితి గనుక దేవుడు స్వయంగా దిగివచ్చి ఆ మరణబలమును నశింపజేసి ప్రజలకు విడుదల నిచ్చాడు గనుక ఆయన పేరు ‘బలవంతుడైన దేవుడు” అని పెట్టబడింది.

ఒక్క మాటలో చెప్పాలంటే, మరణబలం గలిగిన దుష్ట శక్తిని సంహరించాలంటే ఆ దుష్టుని చెరలోనుండి బయటకు రప్పించుటకు బలవంతుడైన దేవుడు అవసరం. అందునుబట్టి  యేసు *బలవంతుడైన దేవుడు* అను పేరుగలిగి ఈలోకానికి వచ్చి ఎన్నో బలమైన కార్యాలు చేసి మరణబలం గల అపవాదిని నశింపజేశాడు.

➡B. బలవంతుడైన దేవుడు అను పేరు ఎందుకు: కారణం
*1. యేసువంటి బలాఢ్యుడైన దేవుడు ఇంకొకరు లేరు:* కీర్తన 89:8   యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు?

*2. కుమారుని నోటిమాటలో బలం:* ఎంతో బలమైన తుఫానును కూడా ఆయన ఒక్క మాటతో (వాక్యం ద్వారా) ఆపివేయగల బలాఢ్యుడు యేసు. మార్కు 4:39  అందుకాయన లేచి గాలిని గద్దించినిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.

*3. కుమారుని వస్త్రంలో బలం:* పండ్రెండు సంవత్సరాల నుండి రోగముతో బలహీన పడిన స్త్రీని ఆయన వస్త్రం బలపరిచినది. లూకా 8:43  ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.

*4. కుమారుని స్పర్శలో బలం:* లూకా 13:11  పదునెనిమిది ఏండ్లనుండి *బలహీన పరచు దయ్యము* పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. 13  ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.

*5. కుమారుని బాహువు బలమైనది:* నిర్గ 13:3  యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను.

*6. కుమారుని నామము బలమైనది:* సామెతలు 18:10  *యెహోవా నామము బలమైన దుర్గము.* నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును

*7. కుమారుని వివేచన శక్తి బలమైనది:* యోబు 36:5  ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది
 
➡C. ఆయన తన బలాన్ని మనకు ఇచ్చుటకే ఈలోకంలో జన్మించాడు: ఆయన బలాన్ని మనకు ఇచ్చి మనలను బలపరుస్తాడు. యెషయా 41:10 దిగులుపడకుము నేను నిన్ను బలపరతును. 

దేవుని వలన మాత్రమే మనకు బలమని ఆయన బలాన్ని పొందుకున్న భక్తులు యెషయ సమూయేలు దావీదు పౌలు మొదలగువారు ఈ క్రిందివిధంగా సాక్ష్యం చెప్పుచున్నారు.

1 తిమోతి 1:13 నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. 1 దిన 16:27   బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.

బలము ధరింప జేయువాడు ఆయనే అని దావీదు కీర్తిస్తున్నాడు. కీర్తన 18:32 నాకు బలము ధరింప జేయువాడు ఆయనే.

2సమూ 22:33 దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు కీర్తన 68:28 నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి యున్నాడు. 1దిన 29:12 బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. 

యెషయా 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. 

కీర్తన 68:35 ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ ముల ననుగ్రహించుచున్నాడు.   కీర్తన 29:11 యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును.

➡D. కుమారుడైన యేసు యొక్క బలాన్ని మనం ఎలా పొందుకుంటాం:

👉 *1.విశ్వాసము వలన బలము* – రోమా 4:21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి *విశ్వాసము వలన బలము నొందెను.* జెకర్యా 12:5 అప్పుడు యెరూషలేము లోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను *నమ్ముకొనుట వలన మాకు బలము* కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పు కొందురు.

👉 *2. యధార్ధవంతులకు బలము* - 2 దిన 16:9 తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది;

👉 *3. సేవకులకు బలము* - కీర్తన 86:16 నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము.

👉 *4. దేవుని ప్రేమించు వారికి బలము* - కీర్తన 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.

👉 *5. దేవుని కృప పొందిన వారికి బలము* - కీర్తన 94:18 నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

👉 *6. పరిశుద్దాత్మ పొందిన వారికి బలము* - ఎఫేస్సి 3:15 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన *ఆత్మ వలన బలపరచబడునట్లుగాను..*

👉 *7. దేవునియందు ఆనందించు వారికి బలం* - నేహేమ్యా 8:10 యెహోవా యందు *ఆనందించుట వలన మీరు బలమొందుదురు.*
 
➡E. దేవుడు మనకిచ్చిన ఆత్మ బలాన్ని సాతానుడు మాయజేసి తొలగించువాడు కనుక ప్రార్ధనతో మెలుకువ కలిగి జాగ్రత్తగా ఉండాలి. కారణం పాపము దోషము మన బలమును తొలగింప జేయును. కీర్తన 31:10 నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చు చున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా *దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది* నా యెముకలు క్షీణించుచున్నవి.

ఉదా: సంసోను న్యాయా 16:5 ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతోనీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము. న్యాయా 16:6 కాబట్టి దెలీలానీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుము.

కాబట్టి ప్రియ స్నేహితులారా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుందాము. (ఎఫెస్సి 6:10) దేవుని బలాన్ని పొందుకున్న మనం సమస్తం చేయగలం. (ఫిలిప్పీ 4:13)  మనలను బలపరచువాని ద్వారా సమస్తం చేయుటకు ప్రభువు తన కృపను మనకు సమృధ్ధిగ అనుగ్రహించును గాక! ఆమెన్!!
 
దైవాశ్శీసులు!
 
From the desk of...
Pastor Jyothi Raju Vemula 
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...