ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(పన్నెండవ భాగము)

♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻

 (మొదటి భాగము)

*ఈ యేసుక్రీస్తు వారు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైనఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.* రోమా 1:5

 *యేసుక్రీస్తు వారికీ రెండు స్వభావాలు ఉన్నాయి....*

♻ *ఒకటి దైవత్వము,* 
♻ *రెండు మానవత్వము....*

 *యేసు దావీదు సంతానము* (మత్తయి 1:1).... 

 *యేసు దేవుని కుమారుడు కూడా* (మత్తయి 3:17)....

👉యేసుక్రీస్తులో ఉన్న మానవత్వము వర్ణింపతరము కానిది... 
*దేశాలను పడగొట్టిన "పాపము"  కనీసము ఆయను ప్రభావితం చేయలేకపోయింది...*

 *రాజుల, అధికారులు తలలు వంచిన ఈ లోకాశలు ఆయనను జయించలేకపోయాయి...*

 *చివరికి ఆయనపై నేరంమోపటానికి కూడా ఆయన శత్రువులకు ఒక్క కారణం కూడా దొరకలేదు, చివరికి దొంగ సాక్షులను ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.*

*యేసు పరిపుర్ణమైన మనిషి.*

మరి అలాగే... 
*సృష్టికర్తగా యేసయ్య  సర్వబౌమాధికారమును చూసినప్పుడు ఆయన దైవత్వముతో మరొకరిని పోల్చలేము....*

అందుకే.... 
🔺నిర్గమకాండములో ఇలా వ్రాయబడియున్నది.... 
*“యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు”* (నిర్గమకాండము 15:11)....

ఇంక.... 
🔺దావీదు భక్తుడు ఇలా అంటున్నారు....
*“... దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు”* ( 2 సముయేలు 7:22)....

అవును... 
👉మన ఆశ్రయమైన దేవుని వంటి దేవుడు మనకి మరొకరు కనిపించరు....

*ఈ లోకంలో మనిషి కల్పించుకున్న దేవుళ్ళు, దేవతలు చాలా మంది యెహోవా దేవుని పరిశుద్ధత అనే మెట్టు దగ్గరే చతికిలపడ్డారు.*

నా ప్రియ స్నేహితులారా....

 *యేసు దేవుని కుమారుడు అనటానికి అంటే యేసు దేవత్వాన్ని రుజువుచేసే కారణం ఆయన మరణాన్ని జయించి తిరిగిలేవటమే...* 


రోమా 1:5.
*యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.*

   ప్రియ దైవజనమా! *ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. అవి యేసుక్రీస్తు ప్రభులవారి రెండు స్వభావాలు. మొదటిది దైవ స్వభావం; రెండు: మానవ స్వభావం*. 

  
1⃣ *శరీరమును బట్టి దావీదు సంతానము గాను . . . .*   యేసుక్రీస్తు ప్రభులవారు దావీదు సంతానముగా పిలువబడేవారు. దానికోసం అనేకమైన రిఫరెన్సులు ఉన్నాయి. 
*ఆయన దావీదు సంతానం అని, దావీదు సింహాసనం మీద నిత్యమూ ఆసీనుడై ఉండేవాడని, దావీదుకు వేరు, చిగురు అని, ఇలా ఎన్నో ఉన్నాయి.*   యెషయా 9:7, 16:5 ప్రకారం ఎల్లప్పుడూ యేసుప్రభులవారు దావీదు సింహాసనం మీద, దావీదు గుడారములో ఉంటారని వ్రాయబడి యుంది.

 ఇక *యేహెజ్కేలు* గ్రంధములో దావీదు వారిమీద అధికారిగా ఉంటాడు అని, ఎల్లకాలము వారికీ దావీదు అధిపతియై ఉంటాడని వ్రాయబడింది. ౩7:24;25. 

*ఆమోసు* గ్రంధంలో పడిపోయిన దావీదు గుడారమును కడతాను అంటున్నారు దేవుడు 9:11; కారణం దావీదు సింహాసనం పడద్రోయబడి యూదులు బానిసలుగా అమ్మబడ్డారు .

♻  *క్రొత్త నిభందనలో ప్రకటన 5:5 లో దావీదుకు చిగురు/ వేరు అని వ్రాయబడింది.* అయితే క్రొత్త నిభందన మొదట్లో చాలా ఆసక్తికరమైన విషయాలుంటాయి. 

*మత్తయి 1:1 లో అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభమయ్యింది.*

  అబ్రాహాము గారినుండి దావీదు గారికి 14 తరములు, గాని దావీదు గారు అబ్రహాము గారి కుమారుడని పిలువబడ్డారు. ఇక దావీదు గారి నుండి యేసుక్రీస్తు ప్రభులవారికి 14 తరములు (1:17) గాని యేసయ్య దావీదు కుమారుడని పిలువబడ్డారు. 

*ఇక భక్తుడు, వైద్యుడు అయిన లూకా గారు దావీదు వంశస్తుడైన యోసేపు అను పురుషునికి ప్రధానం చేయబడిన కన్యకయోద్దకు పంపబడెను, ఆ కన్యక పేరు మరియ అంటారు.*

 *దేవదూత గాబ్రియేలు యోసేపుతో అంటున్నాడు దావీడు కుమారుడవైన యోసేపు నీభార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము!*

👉  ఇక్కడ దావీదు కుమారుడు యోసేపు.  

*ఇక అనేకసార్లు యేసుక్రీస్తు ప్రభులవారిని దావీదు కుమారుడా కరుణించు అని పిలిచారు.*
 మత్తయి 15:22 . .20:౩౦; 21:9;22:42; మార్కు 10:47; లూకా 18:౩8; 
ఇక లూకా 1:32 లో యేసుప్రభుల వారికోసం చెబుతూ గబ్రియేలు దేవదూత అంటున్నాడు:  
*ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.  ప్రకటన గ్రంధంలో ఆయన దావీదు తాళపు చెవులు కలిగి ఉన్నవాడు అని సెలవిస్తుంది. ౩:7;*

  అందుకే పేతురు గారు మొదలుకొని అందరు అపోస్తలులు, ప్రవక్తలు ఆయన దావీదు కుమారుడని, దావీదు వంశపు వాడని చెప్పడం జరిగింది. అపోస్తలులు 2:25—34; 

👉 కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు వంశాస్తుడని, దావీదు కుమారుడని రోమీయులకు రూఢిగా చెబుతున్నారు పౌలుగారు. 

👉 *ఏం ఎందుకు చెప్పాలి అంటే: ఇంకా అనేకమంది యూదులు దావీదు కుమారుడైన మెస్సయ్యకోసం అనేక దేశాలలో ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయనకోసం ఎదురు చూడ వద్దు. ఆయన ఈ భూలోకం ఆల్రెడీ వచ్చేశారు. ఆయనే యేసుక్రీస్తు అని చాటిచెబుతున్నారు వారికి!*

  ఇది మానవ స్వభావము. ఆయన దావీదు వంశానికి చెందినవాడు. దావీదు కుమారుడు. దావీదు సింహాసనానికి అర్హుడు అని చెబుతున్నారు.
 
*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...