ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *....క్రిస్మస్....* ✳

(ఇరవై ఎనిమిదవ భాగము)

♻ *క్రిస్మస్ తాత* ♻

👉క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు గాని, 
*క్రిస్మస్ లో క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు అనే స్ధితిలోకిదిగజారిపోయుంది*

👉 *క్రిస్మస్ లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించిపోయాడు.* 

*క్రిస్మస్ అంటే?*
👉 బహుమతుల పండుగని, యేసు క్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించ బడ్డాడని, క్రిస్మస్ సందర్భముగా ఒకరికొకరు బహుమతులిచ్చు కోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం చేస్తుంటారు. 
ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి వచ్చాక వీటికి అంతేలేదు. 


గమనిక :- *క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాజ్..... మొదలైన ఏవి బైబిల్ లో లేవు. కొంత మంది మిత్రులు వాటిని వివరించమని అడగడం వలన పోస్ట్ చేస్తున్నాను.* 
ఈ విషయం మిత్రులు గమనించాలి. ఎందుకంటే ప్రతి పోస్టులో వీటి గురించి బైబిల్ లో ఎక్కడ ఉంది అంటున్నారు. బైబిల్ లో లేవు. పండుగలో కాలక్రమేణ వాటి ప్రాధాన్యతను బట్టి వచ్చి చేరాయి. అందుకే క్రిస్మస్ 1-28 భాగములలో  వీటికి కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట కాబట్టి ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాను.

*"శాంటాక్లాజ్"* 【 క్రిస్మస్ తాత 】

 క్రిస్మస్ తాత సంప్రదాయం మూడవ శతాబ్దంలో పరిచయమయ్యాడు. క్రిస్మస్ వేడుకల్లో చిరస్థాయిగా చోటు చేసుకొనిన ఒక వ్యక్తి క్రిస్మస్ తాత (santa Claus).

*డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే భక్తిపరుడైన క్యాథలిక్ బిషప్ ఉదంతమే శాంటాక్లాజ్ సృష్టికి మూలమని చెబుతారు.*

          క్రిస్మస్ ముందురాత్రి పడుకున్న తరువాత... క్రిస్మస్ తాత ఇంటింటికీ వెళ్లి వారి బహుమతులను ఇంటి ముంగిట పెట్టి తలుపుకొట్టి వెళ్లిపోయేవాడు. పాశ్చాత్యదేశాల్లో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. మనం *"క్రిస్మస్ తాత"* అంటాం... వాళ్లు *"శాంటాక్లాజ్"* అంటారు.  

👉 *క్రిస్మస్ తాత అసలు పేరు సెయింట్ నికొ్లాస్. లుాసియ దేశంలోని పత్రాసు అను పట్టణంలో క్రీ.శ.300 సం.లో జన్మించాడు. ఈయన తండ్రి బిషప్, తల్లి భక్తి పరురాలు. నికొ్లాస్ బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ;ఆట పాటల కంటే దైవ వాక్యం చదువుటలొ్ శ్రద్ధ వహించాడు.* ఆయన బాల్య ప్రాయంలోనే తల్లిదండ్రులిరువురు పరమపదించారు .గాని వారి ఏకైక కుమారుడైన నికొ్లాస్ కు విస్తారమైన ఆస్తి సమకుార్చి పెట్టారు.

*బాలుడైన నికొ్లాస్ ఈ ధనాన్ని లక్ష్యపెట్టలేదు.*

ఒక బీదవానికి ముగ్గురు కుమార్తెలు వారికి వివాహం చేయడానికి తగిన వనరులు లేకపోయినందువలన,వారిని బానిసలుగా అమ్మివేయాలనుకొన్నాడా బీదవాడు. ఈ సంగతి నికొ్లాస్ కు తెలిసింది. 
  దాంతో బిషప్ నికొలస్ అర్ధరాత్రిపూట బంగారు నాణాలున్న మూడు చిన్న మూటలను చిమ్నీ ద్వారా ఇంట్లోకి జారవిడుస్తాడు. అవి చిమ్నీ ద్వారా జారి, అక్కడ ఆరబెట్టి ఉన్న ఓ సాక్స్‌లో పడ్డాయట (అందుకే క్రిస్మస్ అలంకరణలో సాక్స్‌ను రకరకాల రంగుల్లో వేలాడదీయడం ఆచారంగా మారింది). 
          
*అలా ఆయన చేసిన సత్కార్యం ఒక పేదరైతు కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ మాట ఆ నోట ఈ నోట వెలువడి అంతా ప్రచారమైంది. దాంతో కష్టాల్లో ఉన్న చాలామంది తమకు కూడా అలా సాయం అందుతుందేమో అని చూడటం మొదలుపెట్టారు.* 
         రాత్రి వేళలో మరో కంటికి కనబడకుండా, మరో చెవికి వినబడకుండా డబ్బు మరియు బంగారుతో నింపబడిన సంచిని ఆ బీదవాని ఇంటి కిటికీ గుండా పారవేశాడు. 
*తెలియని విధంగా డబ్బు సంచిని రాత్రి వేళలో ఎవరు ఇస్తున్నారా?*  అని ఆ బీదవాడు దాని రహస్యం తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటి నుండి కిటికీ దగ్గరే రాత్రుళ్ళు పండుకొని కాపల కాయగా దొడ్డ పని చేసిన దొరను పట్టుకొనుటలొ్ సఫలమైనాడు బీదవాడు. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని నికొ్లాస్ అన్నాడు గాని,  అది అందరికీ తెలిసిపోయింది.   

*ఈ నికొ్లాస్ అనతి కాలంలోనే బిషప్ అయిపోయాడు. తరువాత ఆర్చ్ బిషప్ కుాడా అయ్యాడు. నికొ్లాస్ క్రీ.శ.343 డిసెంబర్ 6న మరణించాడు.*

        
*దాంతో మనసున్నవాళ్లంతా రకరకాల సాయాలు చేసే క్రిస్మస్ తాతలుగా పుట్టుకొచ్చారు. కొన్ని చోట్లనైతే ఆ ఏడాదంతా సర్వే చేసి ఎవరికి ఏం అవసరమో తెలుసుకొని వారి వారి అవసరాల ప్రకారం అనామకంగా ఉంటూనే సాయం అందజేసే క్రిస్మస్ తాతలు బయలుదేరారు.*

👉 ఈ తాత ముఖ్య పాత్ర బహుమతులు ఇవ్వడం. పాపం,బహుమతులు పొందేవారి దగ్గర నుండి ఏమి ఆశించకుండా;అంతేకాదు, తాను ఇస్తున్నట్లు ఎవరికీ తెలియకుండా ఇస్తాడట!


*చిన్న పిల్లల విషయంలో కూడా అట్లా జరిగేది, పెద్ద వాళ్ళు చెప్పడంవల్ల డిసెంబర్ 24 రాత్రి క్రిస్మస్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు ఇచ్చి వెళ్తాడని వాళ్ళు నమ్మేవారు.* 


*క్రిస్మస్ అంటే?*
👉 బహుమతుల పండుగని, యేసు క్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించ బడ్డాడని, క్రిస్మస్ సందర్భముగా ఒకరికొకరు బహుమతులిచ్చు కోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం చేస్తుంటారు. 
ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి వచ్చాక వీటికి అంతేలేదు. 

*నికోలస్(శాంతా క్లాజ్) కూడా ఇట్లా బహుమానాలుఇచ్చేవాడని తీసుకొచ్చి క్రిస్మస్ లో అంతర్భాగం చేసేసారు.* 

👉 *అది ఎంత వరకూ వచ్చిందంటే?* 

 👉 పిల్లలకు క్రీస్తు అంటే తెలియకపోయినా గాని,
 క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియకుండా వుండదు. 

👉 *క్రిస్మస్ తాత వస్త్రాలు, అలంకరణ వస్తువుల పేరుతో కోట్ల బిజినెస్ జరుగుతుంది.* 

*క్రీస్తు జననానికి, క్రిస్మస్ తాతకు ఎక్కడైనా సంబంధం ఉందా అంటే?*
👉 *లేనే లేదు.* 

🔺 *ఆచారాల ముసుగులోపడి, దేవుని ఆరాధించలేక పోతున్నాం. దేవునికి చెందవలసిన మహిమ వేటికో అర్పిస్తున్నాం.* 

🔺 ఇది  *"సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం"* కాదంటారా? 

👉దేవుని యొక్క స్థానాన్ని మరొకటి తీసేసుకుంటే?
 *అది విగ్రహారాధన కాదంటారా?* 

👉పది నిమిషాల పిల్లల సంతోషం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించే *మనం నిజరక్షకుని ఎట్లా ఆరాధించాలో వారికి తెలియజేయగలిగితే?*
👉 వారి జీవితమంతా సంతోషమే కదా! 

*ఈ క్రిస్మస్ లో మనమెందుకు ప్రత్నించ కూడదు?*

🔺 *....క్రిస్మస్ ట్రీ....* 🔺

👉 *క్రిస్మస్ ఆరాధనకు వెళ్తే పిల్లలు మొదలుకొని పెద్దలు వరకు అందరి కళ్ళు మనకు తెలియకుండానే క్రిస్మస్ ట్రీ మీదకు వెళ్లిపోతాయి. క్రిస్మస్ లో క్రిస్మస్ ట్రీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ.*

🔺 *వాస్తవానికి పరిశుద్ద గ్రంధములో క్రిస్మస్ చేసినట్లు గాని, చెయ్యాలని గాని, వాటిలో ఇట్లాంటివి వుండాలని గాని ఎక్కడా ప్రస్తావించబడలేదు.*

👉 *ఇవన్నీ మనుష్యులు కల్పించుకున్నవే.*

👉 శతాబ్దాలు గడచిపోతున్నా వాటిని మాత్రం అట్లానే ఆచరిస్తున్నాం. 

👉యేసు ప్రభువు వారు ఆచరించమని చెప్పిన *"ప్రభు రాత్రి భోజనం"* జోలికి మాత్రం వెళ్ళం.

మనమొక ఆధ్యాత్మికమైన 
విషయం నేర్చుకోవడానికి 
ఒక కల్పిత కథ చెప్తాను.

ఒక సరుగుడు చెట్టు వంటి చెట్టు ఏడుస్తూ వుందట , నా పువ్వులకు వాసన లేదు. నా కాయలు తినడానికి పనికి రావు. నన్నెవరూ పట్టించుకోరని.
దాని ఏడుపు చూసి నక్షత్రాలు ఆకాశం నుండి దిగివచ్చి, ఏడవకు మేము నీతో ఉంటామని దాని మీద వ్రాలాయట. అంతే! ప్రపంచములో ఏ చెట్టుకు లేని ఆధిక్యత, ఘనత దానికి వచ్చేసిందట.

🔺 *క్రిస్మస్ చెట్టు నీవెందుకు అల పిలవబడుతున్నావు?* 🔺

👉ఈ రోజుల్లో నే కాదు చాల రోజులనుండి చాలా మందికి తెలియనిది తెలియక అర్ధం పర్ధం లేకుండా వాదించే ఇంకొక విషయం *క్రిస్మస్ చెట్టు* గురించి.

 కొందరు క్రిస్మస్ చెట్టు పెడతారు కొందరు పెట్టరు. అసలెందుకు క్రిస్మస్ సందర్భంగా ఒక పచ్చని అదే కూడా అన్నిటిని కాదు *ప్రత్యేకంగా ఒక జాతి చెట్టు ను మాత్రమె పెట్టి అలంకరిస్తారు?*

👉 ఈ విషయాలు ఈ రోజు మీతో పంచుకోవాలి అనుకుంటున్నా. 
*ఎందుకో తెలుసా అన్యులు మిమ్మల్ని అడిగితె కనీసం సమాదానం Whatsapp, facebook లో నైన చదివి చెబుతారేమో అని చిన్న ఆశతో......*

🔺 *క్రిస్మస్ చెట్టుగా పేరుపొందిన చెట్టు గురించి తెలుసుకుందామా!!!!.* 

👉క్రిస్మస్ చెట్టు పెట్టె ఆనవాయితి మొట్టమొదట జర్మేనీలో మొదలయ్యింది. *క్రిస్మస్ చెట్టుగా పిలవబడుతున్న చెట్టు అసలు పేరు ఫైర్(FIR ).*
👉 ఎందుకు కేవలం ఈ చెట్టునే ప్రత్యేకంగా క్రిస్మస్ చెట్టుగా పేరు గాంచిందంటే ఈ చెట్టుకు మాత్రమె వుండే ఒక లక్షణం వలన. 
*ఫైర్ చెట్టు ఏ కాలం లో కూడా ఆకు రాల్చదు. సంవత్సరం పొడవునా పచ్చగా వుండే ఏకైక జాతి కి చెందినది. అంటే సతత హరిత చెట్టు.*

👉 మనం ఏ మొక్కను చుసిన చెట్టు ను చూసిన పొదలు గాని తీగలు గాని అన్ని ఆకు రాల్చివె . *ఇంకా వివరంగా చెప్పాలంటే ఎప్పుడు మోడు భారని చెట్టు. నిత్యమూ పచ్చగా వుంటుంది.*

 *పాపం వలన దేవుని నుండి దూరమైనా మనిషిని మరల తిరిగి తనవద్దకు పాపరహితులుగా చేర్చుకోవటానికి స్వయంగా లోక రక్షకుడిగా ఈ భూమి మీద మనవ శరీరం తో నివసించిన ఆది దేవుడుని ఆరాధించుటయే క్రిస్మస్.*

👉 జీవం అనగానే అందరికి వెంటనే గుర్తుకు వచ్చే రంగు *పచ్చ.* నిత్యమూ పచ్చగా వుండే చెట్టు ఫైర్ చెట్టు.

*క్రీస్తు జీవం భూమి మీద మొదలయ్యింది కాదు. అయన ఆది నుండి వున్నా దేవుడు.*

👉 *ఒక్కరోజుకు ఆయన ఆరాదనను పరిమితం చేయకూడదు అనే బైబిల్ లో ఎక్కడ ఆయన జనన దినమును రాయించలేదు దేవుడు.*

*యేసు క్రీస్తు జనన దినము ఫలానా రోజు అని బైబిల్ ల్లో ఎక్కడ లేదు కాని అయన శీతాకాలం లో జన్మించాడు అని మాత్రం కొన్ని పరిస్తితులను బట్టి అర్ధం అవుతుంది అనగా గొర్రెల కాపరులను బట్టి.*

👉 శీతాకాలం లో చాల వరకు అన్ని మొక్కలు పుష్పాలతో వుంటాయి. క్రీస్తు భూమి మీద జన్మించిన సమయంలో అన్ని మొక్కలు దాదాపుగా పువ్వులు కాయలు కలిగి వున్నాయి ఒక్క ఫైర్ జాతి చెట్లు తప్ప. 

👉 *నిత్యజీవానికి వారసులమైన మనము ఆత్మ ఫలముతో అలకరించుకొని క్రిస్మస్ చెట్టుల మారదాము.*

👉 యేసు ని హృదయాల్లోకి ఆహ్యనించి వెలుగు దివ్వేలగా మారి లోకానికి సువార్తను చాటి చెప్పేద్దాము

*"బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. "*
 దానియేలు 12.

*"మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని మారులగునట్లు,సణుగులును సంశయములును మాని,సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు."*
 ఫిలిప్పి 2:16

*ఆ చెట్టుకు ఘనత ఆ చెట్టునుబట్టి కాదు. దాని మీద కూర్చున్న నక్షత్రాలను బట్టి.*
 
*గాడిదకు ఘనత ఆ గాడిదనుబట్టి కాదు. దాని మీద కూర్చున్న యేసయ్యను బట్టి.*

*నీకు కలిగిన ఘనత నిన్నుబట్టి కాదు. నీకోసం ప్రాణం పెట్టడానికి దిగివచ్చిన యేసయ్యను బట్టే.*

*ఏ పాపము ఎరుగని ఆయన నీ కోసం శాపముగా మారడానికి ఇష్టపడ్డాడు.*

*నీకోసం ఆయన సింహాసనాన్ని విడచి పెట్టుకున్నాడు.అంతగా నీకోసం తగ్గించుకున్నాడు.*

👉 *నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా?* 
*నేడే ఆయనను చేర్చుకో!* 

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...