ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

⚡️✨💫 క్రిస్మస్ 💫✨⚡️
        (పదకొండవ భాగము) 

క్రిస్మస్ లో ప్రధానమైన అంశాలలో "విధేయత" ఒకటి. ఇద్దరు యవ్వనుల యొక్క విధేయతే క్రీస్తు శరీరధారిగా లోకానికి రావడానికి కారణమయ్యింది.

💮 1. మరియ:
ఆమె కన్యక. లూకా 1:27 

లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించిన పరిశుద్దురాలు. దానిలో ఎట్టిసందేహం లేదు. ఆమెను పరిశుద్దమైన స్త్రీగా మనము గౌరవించాలి. తన జీవితాన్ని మన జీవితాలకు ఆదర్శప్రాయంగా మలచుకోవాలి. కాని, ఆరాధించడానికి వీల్లేదు. కారణం? మనుష్యలు గాని, దేవదూతలు గాని ఆరాధనకు యోగ్యులుకారు. దేవుడొక్కడే ఆరాధనకు పాత్రుడు. జ్ఞాలులు కుడా యేసును మాత్రమే ఆరాధించారుగాని, మరియను గాని, యోసేపును గాని కాదు. 

♻️ఎట్లాంటి పరిస్థితులలో ఆమె యేసు ప్రభువుకు తల్లి అయ్యే ధన్యతను పొందుకోగలిగింది? 

మరియ హృదయంలో అద్భుతమైన సంఘర్షణ. ఒక వైపు రక్షకునికే తల్లి అయ్యే ధన్యత. మరొక పైపు వివాహం కాకుండా తల్లి అయితే? లోకంలోఎట్లా జీవించగలగడం? రాళ్లతో కొట్టి చంపేస్తారు. చివరకి ఒక నిర్ణయానికి వచ్చేసింది. నిందలు, అవమానం భరించడానికే సిద్దపడింది. దేవుడు పంపిన, దూత చెప్పిన వర్తమానముకే విధేయురాలయ్యింది.

🔸తాను అనుకున్నట్లే జరిగింది. 
🔸లోకం సూటిపోటి మాటలతో ఆమెను హేళన చెయ్యడం ప్రారంభించింది. 
🔸మరియ పరిశుద్దత ఏంటో ఇప్పుడు బయటపడిందని, లోకం కోడై కూస్తుంది. 
🔸చివరకి కొంతకాలం ఇంట్లోనుండి వెళ్ళిపోవలసి వచ్చింది. 
🔸అన్నిటిని భరించింది. 
కాబట్టే! లోక రక్షకునికి తల్లి అయ్యింది. 

💮 2. యోసేపు:
అతడు నీతిమంతుడు. మత్తయి 1:19

పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడిన నీతిమంతులలో యోసేపు ఒకడు. 

నీతి అంటే? ఆయనను నమ్మడమే నీతి. 
నీతిమంతుడు అంటే? ఆయనను నమ్మినవాడు. నీతిమంతుని లక్షణం?
ఇతరులను అవమాన పరచకపోవడం. 
అందుకే నీతిమంతుడైన యోసేపు ఒక తీర్మానమునకు వస్తున్నాడు. మరియను అవమాన పరచకుండా రహస్యముగా విడచి పెట్టాలని. వివాహం కాక మునుపే తాను ప్రధానం చేసుకున్న మరియ గర్భం ధరించిందని ఊరంతా తెలిసింది. అది యోసేపుకు గొప్ప అవమానం. కాని, ఆ అవమానాన్ని తానే భరించడానికి నిర్ణయించుకున్నాడు గాని, ఇతరులను అవమాన పరచడానికి ఇష్టపడినవాడు కాదు. 

♻️యోసేపు విధేయుడు:

దూత వర్తమానం తెచ్చాడు. మరియ పరిశుద్దాత్మ వలన గర్భంధరించింది. ఆమెను చేర్చుకోవడానికి వెనుకాడవద్దని. దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఆమెను చేర్చుకున్నాడు. గర్భం ధరించిన స్త్రీని చేర్చుకుంటే లోకం ఊరుకుంటుందా? వాటన్నిటిని భరించాడు. అందుకే, ఈ లోకంలో లోకరక్షకునికి తండ్రిగా పిలవబడుచున్నాడు. 

👉దేవుని మాటకు గొర్రెల కాపరులు విధేయులయ్యారు. 
👉దేవుని మాటకు మరియ విధేయురాలయ్యింది.
👉దేవుని మాటకు యోసేపు విధేయుడయ్యాడు. 

మన సంగతేంటి? ఇంకనూ ఎదురాడు వారిగానే జీవిస్తున్నామా? అవిధేయులుగానే బ్రతుకుతున్నామా? ఇంకెంత కాలం?
👉ఆయనను ఇంకనూ, పశువుల తొట్టెలోనున్న శిశువుగానే చూస్తూ జోలపాటలు పాడే సమయమిది కాదు. 
👉ఆయన కృపా మయుడు, ప్రేమామయుడు అంటూ, జీవితాన్ని సరిచేసుకోకుండా వాయిదాలు వేసే సమయమిది కాదు. 
👉ఆయనను గొర్రెపిల్లలా చూస్తూ, గుర్రుపెట్టి నిద్రపోయే సమయమిది కాదు. 

ఆయన మాహోగ్రుడై, దహించు అగ్నిగా, న్యాయాధిపతిగా, గర్జించు కొదమ సింహమువలే రాబోతున్నాడు. ఇంకనూ, విధేయత చూపకుంటే. తప్పించుకోలేము. కృపా కాలం గతించిపోతుంది. ప్రభువు రాకడ సమీపమౌతుంది. ఇకనైనా, విధేయులవుదాం! శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...