ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(పదమూడవ భాగము)

♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻

 (రెండవ భాగము)

*ఈ యేసుక్రీస్తు వారు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైనఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.* రోమా 1:5

*పరిశుధ్ధాత్మా నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుధ్ధుడై దేవుని కుమారుడనబడును*
(లూక 1:35)అని చెప్పెను.

👉 *మరియ* తన్ను తాను గర్భవతి చేసుకొనుటకు అవకాశములేదు, 

ఎందుకంటే ఆమె ఒక సామాన్యమైన పనిముట్టు లాంటిది. దేవుడు మాత్రమే అవతరించుట అనే అధ్భుతమును చేయగలడు.

👉ఏదిఏమైనప్పటికి, యోసేపు మరియల మధ్య శారీరక సంభంధమును నిరాకరించుటను అట్టి 
*యేసు నిజమైన మానవుడు కాడు అని సూచిస్తుంది.*

👉 *యేసు సంపూర్తిగా మానవుడే, మనకు లాగా శరీరమును కలిగియున్నాడని అని లేఖనము భోధిస్తుంది.* 
👉ఇది మరియ దగ్గర్నుండి పొందుకున్నాడు.
 *అదే సమయంలో యేసు నిత్యమైన, పాపములేని స్వభావముతో సంపూర్తిగా దేవుడే*
 (యోహాను 1:14; 1 తిమోతి 3:16; హెబ్రీయులకు 2:14-17.)

👉యేసు పాపములో పుట్టినవాడు కాదు అంటే ఆయన స్వభావములో పాపములేదు 
(హెబ్రీయులకు 7:26).
👉 తండ్రినుంచి ఒక తరమునుండి మరొక తరముకు పాపస్వాభావము సంప్రాప్తమైనట్లు అగుపడుతుంది
 (రోమా 5: 12, 17,19). 
 *పాపపు స్వభావమును ప్రసరించే గుణాన్నినుండి తప్పించుకొనుటకు కన్యక గర్భము ధరించుట దోహదపడింది మరియు నిత్యుడైన దేవుడ్ని పూర్తిమంతమైయున్న మానవుడుగా అవతరించుటకు అనుమతికలిగింది.*

 *యేసుక్రీస్తు వారికీ రెండు స్వభావాలు ఉన్నాయి....*

♻ *ఒకటి దైవత్వము,* 
♻ *రెండు మానవత్వము....*

 *యేసు దావీదు సంతానము* (మత్తయి 1:1).... 

 *యేసు దేవుని కుమారుడు కూడా* (మత్తయి 3:17)....

👉యేసుక్రీస్తులో ఉన్న మానవత్వము వర్ణింపతరము కానిది... 
*దేశాలను పడగొట్టిన "పాపము"  కనీసము ఆయను ప్రభావితం చేయలేకపోయింది...*

 *రాజుల, అధికారులు తలలు వంచిన ఈ లోకాశలు ఆయనను జయించలేకపోయాయి...*

 *చివరికి ఆయనపై నేరంమోపటానికి కూడా ఆయన శత్రువులకు ఒక్క కారణం కూడా దొరకలేదు, చివరికి దొంగ సాక్షులను ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.*

2⃣ *దైవ స్వభావం*: దేవుని కుమారుడు: మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపించబడెను; ఈ విషయాన్ని చదువుకుంటూ పొతే ఏమీ అర్ధం కాదుగాని, ఈ వచనంలో పౌలుగారు చూపించిన తార్కికత చూస్తే చాలా అమోఘంగా ఉంటుంది. 

*యేసుక్రీస్తు దేవుడే గాని ఈ భూలోకంలో  ఆయన పుట్టుక మానవ రూపమైనా,  ఆయన చనిపోయి తిరిగి లేచినందువలననే ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడింది అంటున్నారు.*

👉 ఎలా నిరూపించబడింది? *ప్రభావముతో నిరూపించబడింది!*

 పౌలుగారు కొరింథీ పత్రికలో ఆయన లేచారు అని చెబుతూ, పేతురు గారికి కనబడ్డారు, మగ్ధలేనే మరియకు కనబడ్డారు అని చెబుతూ, అనేకమందికి కనబడ్డారు అని చెబుతూ, *ఎవరికో కనబడ్డారు అని చెప్పడమే  కాకుండా కడగొట్టు వాడనైన నాకు కూడా కనబడ్డారు. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోలేదు. ఆయన సమాధి ఖాళీగా ఉంది! ఆయన సజీవుడు! ఎంతోమందికి కనబడ్డారు. చివరికి ప్రధాన పాపినైన నాకు కూడా కనబడ్డారు అని చెబుతున్నారు.*  1కొరింథీ 15:1-10; 

👉   ఇంకా అచ్చమైన భాషలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలి అంటే: *క్రీస్తు దేవుని కుమారుడు అని అనడానికి చివరి రుజువు ఏమిటంటే ఆయన చనిపోయి తిరిగి సజీవంగా లేవడమే! అందుకే ఆయన దేవుని కుమారుడయ్యాడు.*

ఇప్పుడు... 
👉మీరు మరణం నుండి లేస్తే దేవుడేనా....? 
అని అడగవచ్చు....

చరిత్రను చూడండి... *చావునుండి లేచినవారు చాలా మంది ఉన్నారు...*
🔹 బైబిల్ లోనే మరణంనుండి లేచినవారు అనేకులు...
🔹 యేసయ్యే ముగ్గురిని మరణం నుండి లేపారు.... మంచిది... 
👉ఇప్పుడు వాళ్ళను కూడా దేవుళ్ళు అనాలా....? 
కాదు.
*ఎందుకంటే...?*

 *దైవశక్తీతో వాళ్ళు ప్రాణాలు పోసుకున్నారు, మరణం నుండి లేచారు కానీ వారి కాలం ముగిశాక తిరిగి చనిపోయారు.*

గమనించండి.... 
👉సమాధి నుండి లేచిన లాజరు ఆ తరువాత తన కాలము ముగిశాక చనిపోయారు... 
👉చావునుండి లేచాడు అని ప్రచారంలో ఉన్న వారు ఆతరువాత మరలా చనిపోయారు.

👉చరిత్రలో వీరు మరణం నుండి తిరిగి లేచారు అని చెప్పే ప్రతి వారి సమాధులు ఇప్పుడు మనకి కనిపిస్తాయి. పైగా అవి మూసి ఉంటాయి.... 
*ఒక్క యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఇప్పటికి తెరచియున్నది.*

🔺సర్వ మానవాళి పాపముల కొరకు యేసు బలిగా మరణించారు... 
🔺సమాధి చేయబడ్డారు...
🔺 సరిగ్గా మూడవ రోజున మరణమును, సమాధిని జయించి తిరిగి లేచారు. 
*ఇదిగో యుగయుగములు ఆయన సజీవుడైయున్నారు.* (ప్రకటన 1:17,18)....

వేదాలు, నీతిసూక్తులు, ఉపనిషత్తులు పలికిన చాలా మంది అలాగే దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు చాలామంది చనిపోయారు... సమాధిలోనే ఉండిపోయారు. 
కానీ, 
*నా యేసయ్య సమాధిలో అలాగే ఉండిపోలేదు...ఆయన పునరుత్థానుడై తిరిగిలేచారు... ఆయన దైవత్వానికి ఇది ఒక రుజువు.*

👉 *యేసు సంపూర్తిగా మానవుడే, మనకు లాగా శరీరమును కలిగియున్నాడని అని లేఖనము భోధిస్తుంది.* 
👉ఇది మరియ దగ్గర్నుండి పొందుకున్నాడు.
 *అదే సమయంలో యేసు నిత్యమైన, పాపములేని స్వభావముతో సంపూర్తిగా దేవుడే*
 (యోహాను 1:14; 1 తిమోతి 3:16; హెబ్రీయులకు 2:14-17.)

👉యేసు పాపములో పుట్టినవాడు కాదు అంటే ఆయన స్వభావములో పాపములేదు 
(హెబ్రీయులకు 7:26).
👉 తండ్రినుంచి ఒక తరమునుండి మరొక తరముకు పాపస్వాభావము సంప్రాప్తమైనట్లు అగుపడుతుంది
 (రోమా 5: 12, 17,19). *పాపపు స్వభావమును ప్రసరించే గుణాన్నినుండి తప్పించుకొనుటకు కన్యక గర్భము ధరించుట దోహదపడింది మరియు నిత్యుడైన దేవుడ్ని పూర్తిమంతమైయున్న మానవుడుగా అవతరించుటకు అనుమతికలిగింది.*


   ప్రియ స్నేహితుడా! నీకేమైనా అనుమానాలున్నాయా? పౌలుగారు చెబుతున్నారు. ఆయన దేవుడు, దైవకుమారుడు. దైవ మానవుడు! నీవు పడుచున్న ప్రతీ దురవస్తను, ప్రతీ కష్టాన్ని ఆయన అర్ధం చేసుకోగలరు! 

*కారణం ఆయనకు ఈ కష్టాలన్నీ తెలుసు! ఆయనకూడా ఈ భూమిమీద నున్నప్పుడు ఇవన్నీ అనుభవించిన వారే! కాబట్టి నీ ప్రతీ సమస్య, నీ ప్రతీ బాధను ఆయన అర్ధం చేసుకుని నీకు సహాయం చేయగలరు.*

 నా ప్రియ స్నేహితులారా....

*నా యేసయ్య పరిపూర్ణమైన మానవత్వం కలిగినవారు కనుక ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి శ్రమ, వ్యాధి, కష్టనష్టములను ఆయన అర్ధం చేసుకోగలరు...*
 అలాగే... 
*ఆయనకున్న దేవత్వమును బట్టి మీ ప్రతి అవసరతలలో మీకు సహాయము చేయగల సమర్ధులు.*

👉మనిషిగా మన అవసరతలు ఆయన గ్రహించగలరు....

👉దేవునిగా ఆ ప్రతి అవసరతలను తీర్చి, రక్షించగలరు....


 ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కాబట్టి ఆయన యందు మాత్రమే విశ్వాసముంచు. ఆయన నిన్ను ఆదుకోడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నీవు ఆయన వద్దకు వస్తావా? నీ భారమును ఆయన మీద మోపుతావా? 

*ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు దేవుడు.* మత్తయి11:28; లోబడనొల్లని ప్రజలకోసం దినమెల్ల తనచేతులు చాపి పిలుస్తున్నారు దేవుడు! యెషయా 65:2;
  ఆయన స్వరము వింటావా?
 వస్తావా? 
వస్తే రక్షించబడతావు. 
నేడే రక్షణ దినం! నేడే అనుకూల సమయం!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు