ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(21 వ భాగము )

*యేసు యొక్క పుట్టుక గొప్ప మర్మము*
(వాక్యం శరీరధారి ఆయెను - 4వ భాగము)

1 తిమోతికి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన *మర్మము గొప్పదై యున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.*  

*10. విజయుడైన  యేసులోని మానవ లక్షణాలు ప్రస్తుతానికి దాచబడుట:*  యేసు మరణించి విజయుడై లేచినపుడు అనగా రక్షణ కార్యం ముగిసినపుడు యేసు యొక్క ఉనికిలో ఉన్న అన్ని మానవ పరిమితులు తొలగింప బడినవి. ఇంతకు ముందు యేసు ఆ మానవ పరిమితికి లోబడి జీవించాడు. కాని విజయుడైన తరువాత ఆయనలోని మానవ లక్షణాలు ఎక్కడికి పోలేదు గాని ఆయనలోనే దాచబడినవి అనగా అదృశ్యరూపంలో ఆయనలోనే ఉన్నవి.

యేసు తన ఆరోహణ సమయంలో ఆయనలోని అన్ని మానవ లక్షణాలు ఉపసంహరించబడి పూర్తి దైవస్వభావం కలిగి  ఆత్మ రూపునిగా మారినాడు. అనగా ఆయనలోని మానవలక్షణాలు దాచబడినవి. ఆసమయంలో  ఆయనను చూడగల్గడం మానవ కంటికి అసాధ్యమైన విషయం.  

ఆరోహణ సమయంలో, వాస్తవానికి జరిగినదేమంటే యేసు తన శిష్యుల (మన) కంటి దృష్టి పరిమితి నుండి అదృశ్యమయ్యాడు. ఆయన అక్కడే వారి ప్రక్కనే ఉన్నా శిష్యులు (మనం) చూడలేని పరిస్థితి. (అపో. కార్యములు 1:9). 

యేసు సర్వంతర్యామి గనుక వాగ్దానం చేసినట్లుగా అదృశ్యరూపునిగా మనతో ఇంకా ఉన్నాడు. అదే సమయంలో దేవుని కుడి పార్శ్యమున కూడా ఉన్నాడు.

యేసు రెండవ రాకడలో తిరిగి  ఆయన మానవ లక్షణాలు బయల్పరచబడి *ప్రతి నేత్రము చూచునట్లు* దైవ మహిమ ప్రత్యక్షతతో రాబోవు చున్నాడు. 

ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; 

తీతు 2:13  అనగా మహా దేవుడును మన రక్షకుడునైన *యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత* కొరకు ఎదురు చూచుచు...

2థెస్స 2:8  అప్పుడా ధర్మవిరోధి బయలుపరచ బడును. ప్రభువైన యేసు తన *నోటియూపిరి చేత* వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

*సారాంశం Summary:*
యేసు యొక్క మానవ అవతారం గొప్పమర్మం అని పౌలు తిమోతికి వ్రాశాడు.

1 తిమోతికి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన *మర్మము* గొప్పదై యున్నది; *ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.* ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

ఈ మర్మము అనగా ఒకే వ్యక్తిలో దైవ మానవ స్వభావాలు కలసి ఉండడం అనేది మనకు పూర్తిగా అర్థం అయ్యే విషయం కాదు; మనము కేవలం దీనిని విశ్వాసము ద్వారా మాత్రమే నమ్ముతాము. యేసు గురించి దేవుని వాక్యము ఏమైతే చెబుతుందో దానిని మాత్రమే మనము విశ్వసిస్తాము. వాక్యమైయున్న దేవుడు యేసుగా శరీర రూపం ధరించాడని బైబిల్లోని అనేక వాక్యాలను క్లుప్తంగా పరిశీలించాం. 

ఈ వచనాలన్నీ యేసు, *దేవుడు మరియు మానవుడని* మనకు చూపుతాయి.

దైవిక స్వభావం మరియు మానవ స్వభావం ఒక వ్యక్తిగా యేసులో కలిసినందున మనము వారిని నిజంగా *వేరు చేయలేము* అనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. 

*యేసులో ఉన్న దైవిక స్వభావం మరియు మానవ స్వభావం స్వతంత్రంగా పనిచేస్తాయని చెప్పడం సరికాదు.* అనగా యేసు ఇపుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి అవసరంలేదు కదా యని ఆయనలోని మానవ లక్షణాలు ఆయనను విడిచి పెట్టలేవు. కేవలం దాచబడ గలవు. ఆయన భూలోకంలో ఉన్నపుడు అవసరం లేదు కదాయని ఆయనలోని దైవలక్షణాలు ఆయనను విడిచి పెట్టలేవు. కేవలం ఆసమయంలో అవి కూడా దాచిపెట్టబడును. 

మనం పైన చూసినట్లుగా, బైబిలు యేసు యొక్క రెండు స్వభావాలను వేరుచేయదు. బదులుగా యేసు తన యొక్క వ్యక్తిత్వంలో దైవిక మరియు మానవ లక్షణాలను కలిగి ఉన్నాడని బైబిలు వివరిస్తుంది. 

*దైవమానవునిగా* ఆయన దైవిక ఘనతను కలిగి ఉన్నారు, మరియు ఆ *దైవమానవునిగా* మాత్రమే యేసు మన రక్షణను పరిపూర్ణంగా సాధించారు.

తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు పరిపూర్ణుడైన రక్షకునిగా ఇచ్చినాడు. ఆయన తప్ప వేరే  ప్రత్యామ్నాయం లేనేలేదు. 

మన విముక్తిని నెరవేర్చడానికి సాతానును శాశ్వతంగా ఓడించడానికి *దైవ మానవ స్వభావాలు* రెండూ కూడా అవసరమైనవి మరియు కలవవలసినవి. ఒకే వ్యక్తిత్వంగల *దేవునిగా* మరియు *మనిషిగా* యేసు, లోక పాపములను మోసికొని పోయిన దేవుని పరిపూర్ణమైన గొర్రె పిల్ల. 

మనం జీవించలేని పరిపూర్ణమైన, పాపరహిత జీవితాన్ని దైవ మానవునిగా ఆయన గడిపాడు. మన పాపాలకు వెల చెల్లించి, వాటిని తీసివేయుటకు మన స్థానంలో ఆయన మరణించాడు. మన కొరకు మరణాన్ని ఓడించి విజయవీరుడై  ఆయన మృతులలోని నుండి పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. 

యేసు మన దేవునిగా ఉండి, ఆయన జీవితం మరియు మరణం ద్వారా మన పాపాలకు మరియు సర్వలోకంలోని పాపాలకు వెల చెల్లించి అనంతమైన మేలు మనకు చేకూర్చాడు. 

యేసు మన యొక్క మానవ స్వభావాన్ని పంచుకున్నందున, ఆయన ఇప్పుడు మనపై *మనస్ఫూర్తిగా సానుభూతి* ప్రదర్శించుటకు మన బాధలు శ్రమలు ఎరిగినవాడిగా మనకు సరిపోయిన దయగల ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, *ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలవాడు.* (హెబ్రీయులకు 2: 17-18, 4:15) 

మరియ యుగసమాప్తి వరకు సదాకాలము మనతో కూడ ఉండువాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. హెబ్రీ 4:16. 

ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక! ఆమెన్!

(సమాప్తం)

దైవాశ్శీసులు!

From the desk of...
Pastor Jyothi Raju Vemula 
_(Soli Deo Gloria)_


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...