✳ *.....క్రిస్మస్....* ✳
(పద్దెనిమిదవ భాగము)
♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻
(ఏడవ భాగము)
✳ *యేసు దేవుడా?*
*"బైబిలులో కొన్ని విషయాలను ఎత్తి చూపుతూ.....బైబిల్ పైనే వ్యంగ్యాస్త్రాలు సంధించడం తరచు మనము చూస్తున్నాము.*
చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని చర్చించదలిచాను... దయుంచి కొంచెం ఓపికతో చదివి గ్రహించండి.
👉దేనిగురించైనా మన అభిప్రాయాన్ని తెలియజెప్పే స్వేచ్ఛ మనకుంటుంది.
అయితే
👉బైబిలులో ఏదైనా ఒక అంశం ఆధ్యాత్మిక సమస్య గా పరిణమించినపుడు దానికి బైబిల్ ఏ విధమైన పరిష్కారం చూపించనపుడు మన అభిప్రాయాన్ని బలపరచుకోవచ్చు.
👉 యేసు దేవుడా?
👉 యేసు దేవుని కుమారుడా?
👉 యేసు మరణించి తిరిగి లేచాడా?
👉 యేసు నేను దేవున్ని అని ఎక్కడైనా చెప్పుకున్నాడా?
ఇలాంటి విషయాలు
*"క్రైస్తవేతరులకు"* *"ఆధ్యాత్మిక సమస్యలు"* గా పరిణమించాయి.
అయితే పైనున్న విషయాలన్నిటి గూర్చి ఈ వ్యాసం లో చర్చించుటకు వీలుపడదు (కాని కచ్చితంగా తరువాత వీటిని చర్చకు తీసుకువస్తాను).
♻ *యేసు దేవుడా?*
అన్న ప్రశ్నకు ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం....
👉ఎవరైనా ఒకరు *"మంచివాడు"* అని ఎలా తెలుసుకోగలం?
👉 *"నేను మంచివాన్ని"* అని తన మెడలో ఒక బోర్డు తగిలించుకోవడం ద్వారానా?
👉 లేక జనసమూహాలు ఉన్న చోట *"నేను మంచివాన్ని"* అని గట్టిగా అరచి చెప్పుకోవడం వలనా?
🔺 ఎంతమాత్రమూ ఈ రెండింటి వలనా కాదు...మరెలా చెప్పగలం? వాని యొక్క
👉 మంచి గుణాలను చూచి
👉 మంచి లక్షణాలను చూచి
👉 మంచి ప్రవర్తనను చూచి
ఈ అంశాల ద్వారా ఆ వ్యక్తిని *"మంచివాడు"* అని గుర్తించగలం
*"అలాగే యేసు దేవుడా? కాదా?* అనేది
*"ఆయన చెప్పుకున్నాడా? లేదా? అనే దాని మీద ఆధారపడి లేదు....*
🔺యేసులో *"దేవుని గుణములు"*
🔺యేసులో *"దేవుని లక్షణములు"*
అనేవి ఉన్నాయా..లేవా?
👉 అనే దాని మీద ఆధారపడి ఉంది
🔺బైబిలులోని నాలుగు *"సువార్త"* లను బాగా పరిశీలించినపుడు చాలా స్పష్టంగా *"యేసు"*లో గుణలక్షణాలు" కనపడతాయి. ఇందులో ఏ సందేహము లేదు.
*ఇహపరాలలో ఆరాధించబడే వాడు దేవుడొక్కడే .*
♻ *యేసు దేవుడు కాకపోతే "దేవునిలా ఎందుకు ఆరాధింపబడ్డాడు?"*
👉ఇచ్చట ఒక విషయాన్ని మనం గమనించాలి......
🔹యూదులు దేవునికి తప్పా మరే మనిషికి *"సాష్టాంగపడి...మ్రొక్కి ఆరాధించరు"*
🔹 మరెవరైనా
*యూదుని పాదములకు మ్రొక్కి... సాష్టాంగ పడి ఆరాధిస్తే ఎట్టి పరిస్థితులలోను ఒప్పుకనరు.*
- అపో.కా.10:25, 26...లో *"పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను...అందుకు పేతురు -- నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అన్నాడు"*
👉 పేతురు దీనిని తిరస్కరించాడు.
- ప్రక. 22:8, 9....లో
*"......నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు (దూత) వద్దుసుమీ....నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంధమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను"*
👉 దూత కూడా దీనిని తిరస్కరించెను.
*యేసును మనుషులు మ్రొక్కి, సాష్టాంగపడి, ఆరాధించారు*
🔹మత్తయి 8: 2 లో.........
*"ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు (యేసుకు) మ్రొక్కాడు"*
🔹యోహాను 9: 35 -
39........లో
*"పుట్టుకతోనే గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి స్వస్ధపరచబడినపుడు ఆయన (యేసు) ఎదుట సాగిలపడి ఆయనను (యేసును) ఆరాధించాడు".*
🔹 మత్తయి 14: 33......లో
శిష్యులు
*"నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు (యేసుకు) మ్రొక్కిరి"*
👉పైన వివరించబడిన సందర్భాలలో ........
*"యేసును వారు మ్రొక్కి...సాష్టాంగపడి నమస్కారించి... ఆరాధించినా ఆయన తిరస్కరించలేదు"*
👉 "యేసు దేవుడు కాకపోతే వారు ఎందుకు ఆరాధించారు?"
👉 యేసు దేవుడు కాకపోతే తనెందు ఆరాధన స్వీకరించాడు?
👉 యేసుని గూర్చి బైబిల్ ఇచ్చే మరొక తిరుగు లేని సాక్ష్యం --- రోమా 9: 5 లో........
*"పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు"*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి