✳ *నూతన నిబంధనకు శ్రీకారం ఈమె . . . .✍*
నా ప్రియ స్నేహితులారా...
👉 మీరు ఇప్పటికే *" క్రిస్టమస్ "* గురించి చాలా సందేశాలు చదివారు, చూశారు మరియు విన్నారు... అందును బట్టి దేవునిని స్తోత్రం.
ఈ రోజు " క్రిస్టమస్ " సందేశాన్ని మరో సరికొత్తకోణంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము...
గమనించండి.... *" క్రిస్టమస్ "* కు చాలా దగ్గరి సంబంధం ఉన్న ఒక మనిషిని ఈ రోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాము.
👉 ఇది మీకును, ముఖ్యముగా మీమీ సంఘాలలోని స్త్రీల విభాగాలకు ఆశీర్వాధకరముగా ఉంటుందని నమ్ముతున్నాము.
ముందుగా... ఒక వాక్యభాగమును చదువుదాము....
( Hebrews - హెబ్రీయులకు 12:1,2 )
*"ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము"*
👉 *మన చేతిలోని ఈ బైబిల్ లో ఒక గొప్ప సాక్షిసమూహము ఉంది అండి...*
👉వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు, వారి జీవిత విధానం గురించి తెలుసుకున్నప్పుడు, వారినుండి మంచి మంచి పాఠాలు మన నేర్చుకోగలము.
1 కొరింథీయులకు 10:11 ప్రకారము...
*అటు పాతనిబంధన కానివ్వండి, ఇటు క్రొత్తనిబంధన కాన్నివండి... ఈ లేఖనాలు అన్ని కూడా అందున్న మనుషుల మంచిని బట్టు మనకి జ్ఞానమును, అందున్న మనుషుల చెడును బట్టి మనకి బుద్ధిని కలిగించేందుకే వ్రాయబడినవి.*
Biblical Character Study ద్వారా జాగ్రత్తగా చూడగలిగితే బైబిల్ లోని మనుషులు మనకి ఎన్నో విషయాలు చెబుతారు. బైబిల్ అధ్యయన పద్ధతులలో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది...
*Biblical Character Study... బైబిల్ లోని మనుషులను అద్యయనం చెయ్యటం.ఈ మనుషులే మన ముందున్న గొప్ప సాక్షి సమూహము.*
👉ప్రత్యేకముగా స్త్రీల గురించి ఆలోచించినప్పుడు.
హన్నా... ఎస్తేరు... దేబోరా... రుతు... రిబ్క... ప్రిస్కిల్ల... సమరయ స్త్రీ... మగ్ధలేను మరియా... సరేపతు విధవరాలు... రహబు వేశ్య... లుదియా... అని చాలా మంది గుర్తొస్తుంటారు.
👉 *కానీ... నూతన నిబంధనకు ప్రారంభంమయిన ఒక స్త్రీని మనం ఈ క్రిస్టమస్ రోజులలో తప్ప ఇంకా ఎప్పుడూ గుర్తుచేసుకోము. ఆమె పేరు "మరియ" వాక్యం లో ఇలా వ్రాయబడియుంటుంది...*
*"ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను" అని...*
👉 మన ప్రభువైన యేసుక్రీస్తువారు శరీరధారిగా జన్మించిన క్రమములో ఆయనను నవమాసాలు మోసి జన్మనిచ్చింది ఈమె. *నూతన నిబంధన చరిత్ర అంతయు ఈ మరియ గారి నుండే ప్రారంభమవుతుంది.*
🔺 గమనించండి...
పాతనిబందనలో మనకి కనిపించే మొదటి స్త్రీ *"హవ్వ"*... అంటే... *"జీవముగలప్రతివానికి తల్లి"* అని అర్ధం.
🔺 *నూతన నిబంధనలో మనకి కనిపించే మొదటి స్త్రీ "మరియ"... ఈమె "నిత్యజీవమైన యేసుకి తల్లి"*
👉 *ఒకరు మనిషి మీద ఏలుబడిచేసే పాపానికి జన్మనిస్తే...*
👉 *మరొకరు ఆ పాపం నుండి మనిషిని విమోచించే రక్షకునిని జన్మనిచ్చారు.*
🔸ఒకరు పాత నిబంధనకు ప్రారంభం...
🔸మరొకరు నూతన నిబంధనకు ప్రారంభం.
👉 అంతే కాదు అండి....
ఇంకా ఎన్నో మంచి లక్షణాలు ఈ మరియలో మనకి కనిపిస్తాయి...
మొదటిగా....
1⃣ *... మరియ... ఎంతో మంచి జీవితవిధానంగల స్త్రీ....*
గమనించండి... ప్రపంచలోనే ఎంతో మంది స్త్రీలు ఉన్నారు... ఇంకా ఇశ్రాయేలు దేశములో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు... ఇంకా ఆ నజరేతు అనే ఊరిలోనే ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కానీ... *దేవుని దృష్టి ఈ మరియను మాత్రమే చూసింది.*
🔸ఎందుకండీ....? అని అడిగితే.
ముందు ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి... అదే నజరేతులో మరియతో పాటు మీరు ఉన్నారు, దేవుడు యేసుక్రీస్తుకు తల్లిగా మిమ్మల్ని ఎన్నిక చేస్తారా...?
🔸దీనికి అవునని చెప్పగలరా మీరు...?
మన మనసాక్షి ఒప్పుకోలేదు. *"మన జీవితాలు మనకి బాగా తెలుసు కనుక " అవునని " జవాబు చెప్పలేము.*
👉 మనం అనుకుంటాము... యేసుక్రీస్తువారికీ తల్లిగానా...? ఎంతో పుణ్యం చేసుకోవాలి అందుకు, మన వల్ల ఎం అవుతుంది... అని.
పుణ్యం కాదు అండి...
*మరియ దేవునికి అంగీకారమైన జీవితాని కలిగిఉంది. అందుకే ప్రపంచంలో ఎందరున్నా... ఇశ్రాయేలులో ఎందరున్నా... ఆ నజరేతులో ఎందరున్నా దేవుని దూత ఈ మరియదగ్గరికి పంపబడింది.మరియ... ఎంతో గొప్ప జీవితవిధానంగల స్త్రీ.*
2⃣ *మరియ... ఎంతో గొప్ప వివాహబంధాన్ని కట్టుకుంన్న స్త్రీ....*
గమనించండి... నేడు వయసువచ్చిన ఆడపిల్లను నీకు ఎలాంటి భర్తకావాలి అంటే... టకీమని, సినిమా ఆర్టిస్ట్ పేరు చెబుతారు. అందం, ఆస్థి, ఎత్తు, కండలు, పేరుప్రతిష్టలు ఉన్నవాడిని ఇష్టపడతారు. నేడు ప్రేమఅనేది మనస్సులోనుండి కళ్ళలోని వచ్చి చేరింది. ఆస్థి అంతస్తులను చూసి ఎటుకావాలి అంటే అటు మారటం ప్రారంభించింది.
👉 అమ్మాయిని అడగండి...? నాకు ఇంజనీర్ కావాలి, నాకు డాక్టర్ కావాలి, నాకు కలక్టర్ కావాలి, నాకు నెలకి లక్ష జీతం తెచ్చేవాడు కావాలి. ఇలాంటివి ఎన్నో వింటాం మనం.
మరియ ఒక వ్యక్తి కి ప్రధానం చేయబడింది. లూకా 1:27.... అతడు గొప్ప ఉదోగాస్తుడు కాదు, వ్యేపారవేత్త కాదు, నాయకుడు కాదు, లక్షలు లక్షలు సంపాదించే అవకాశము లేదు.
అతడు ఒక వడ్రంగి. బహుపేదవాడు... ఎలా అంటారా...?
మోషే ధర్మశాస్త్రం ప్రకారము *"ప్రతి తొలిచూలు మగ పిల్లవాడిని ప్రభునకు ప్రతిష్టించాలి... అందుకు ఒక గొర్రెపిల్లను అర్పించాలి, ఒకవేళ వారు పేదవారు అయితే... రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను అర్పించాలి....* లేవి 12:8.
అందుకని మరియ యోసేపులు మోషే ధర్మశాస్త్రం ప్రకారము తమ ఇంటి మొదటి బిడ్డని ప్రతిష్టించటానికి వచ్చినప్పుడు రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను తిసుకోచారు. (లూకా 2:24)
👉 *ఈ యోసేపు తన ఇంటిలో పుట్టిన మొదటి బిడ్డకు ఒక గొర్రెనుకూడా ఇవ్వలేనంత పేదవాడు. కానీ మనస్సులో అతడు మహారాజు... వివాహమునకు ముందే మరియ గర్భవతి అని తెలుసుకున్న యోసేపు ఆమెను అవమానపరచకూడదని మౌనంగా పక్కకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు.*
(మత్తయి 1:19)
🔺 ఆవేశంతో ఉగిపోయి ఒక అమ్మాయిని అల్లరి చెయ్యాలని అతడు అనుకోలేదు.
🔺 స్త్రీ మనమర్యాదలను కాపాడే మనసున్నమనిషి యోసేపు. అంతే కాదు అండి *"మరియ ఆ బిడ్డకు జన్మనిచ్చెంతవరకు కూడా ఈ యోసేపు మరియను తాకలేదు"*
( మత్తయి 1:24,25 ).
👉 *ఇలాంటి గొప్ప ఆలోచనలున్న, ఇలాంటి గొప్ప మనసున్న మనిషిని కోరుకుంది మరియ. పేదవాడు అయినా పరవాలేదు, మనసుంది. ఆస్థిలేకున్నా పరవాలేదు మర్యాద ఉంది.అలా... మరియ... ఎంతో గొప్ప వివాహబంధాన్ని కట్టుకున్న స్త్రీ. ఒక మంచి భర్తను ఎన్నిక చేసుకుంది.*
3⃣ *మరియ... ఎంతో గొప్ప దైవభక్తిగల స్త్రీ....*
గమనించండి... దేవదూత వచ్చి మరియకు ఒక వార్త చెప్పాడు.
▪లోకనుసారముగా చూస్తే అది తనకు అవమానమును కలిగించేది...
▪ *తన శీలంపై మచ్చవేసేదిగా ఉంది.*
▪ ఇంకా వివాహం కానీ కన్య... ఇంక కొన్ని రోజులలో పెళ్లి ఉంది... ఇప్పుడు తను గర్భవతి అని తెలిస్తే అది సమాజం ముందు ఎంతటి అవమానం.
👉 *జరగనున్న వివాహం నిలబడుతుందా ?*
*" ఇది విషయం " అని నిజం చెప్పినా ఎవరేనా నమ్ముతారా...?*
ఇన్ని అనుమానాలమధ్య మరియ ఒక్కటే మాట చెప్పింది
*"ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక"* అని....
👉 *మరియ జరగనున్న వైపరిత్యాలు అన్ని వదిలేసి దేవుని చిత్తం పూర్తిగా తనలో నేరవేరుటకు అనుమతించింది. దేవుని పై పూర్తిగా విశ్వాసముంచింది. అంతే కాదు అండి... వాక్యంలో వ్రాయబడిఉంది... పరిశుద్ధాత్మ ఆమెను కమ్మెను" అని... పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తను వెళ్ళిపోయింది. ఎంతో మందికి పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వెళ్ళటం చేతకాదు. దానికన్నా ముందు ఇష్టతచూపించారు.*
యోబు గారు అంటారు...
*"నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా"* అని... ( యోబు 4:6 ).
అదే మరియ ధైర్యం... రానున్న నిందలు ఆమెను భయపెట్టలేదు, తన వివాహబంధం ఏమవుతుందో అనే భయం లేదు. తనని ఇంకా ఏ మాటలుకూడా కలవారపెట్టలేకపోయాయి.
👉 *దేవుని చిత్తం తనలో నేరవేరాలి ఇది ఒక్కటే ఆమెలో పనిచేస్తూఉంది. పెద్దపెద్ద భక్తులలో కనిపించే మొదటి లక్షణం ఇదే. మరియ... ఎంతో గొప్ప దైవభక్తిగల స్త్రీ.*
4⃣ *మరియ... ఎంతో గొప్ప భార్య ....*
గమనించండి...
*లోకంలో నేడు జరుగుతున్న విడాకులకు కారణం*
▪ భార్యాభర్తలు ఒకరిని ఒకరు సహించుకోలేకపోవటం వల్లనే జరుగుతున్నాయి,
▪ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోలేకపోవటం వల్లనే జరుగుతున్నాయి,
▪ఒకరి లోపాలు మరొకరు అర్ధం చేసుకోలేకపోవటం వల్లనే జరుగుతున్నాయి.
▪భార్యను అడిగితే భర్త మీద ఎన్ని పిర్యాదులు ఇస్తుందో....
భర్తను అడిగితే భార్య మీద ఎన్ని పిర్యాదులు ఇస్తాడో.... ఆ పిర్యాదుల పట్టికకు అంతం ఉండదు.
ప్రేమ లేని బ్రతుకులు అవి.... ప్రేమ అంటే అర్ధం తెలియని జీవితాలు అవి....
👉 కానీ, *మరియ అలాంటిది కాదు. భర్తను అర్ధం చేసుకొనే మనస్సు ఆమెకు ఉంది. అది కష్టం అయినా... నష్టం అయినా... ప్రాణాపాయంలో అయినా... మరియ భర్త గురించి ఈ చెడు మాట్లాడలేదు.*
చూడండి... లూకా సువార్త 2వ అధ్యయము....
ప్రజాసంఖ్య వ్రాయబడుటకు ఆజ్ఞ ఇవ్వబడింది... ప్రతివాళ్ళు కూడా తమ పేరులు నమోదు చేసుకొనుటకు బేత్లెహేముకు వస్తుంటారు... బేత్లెహేములో విస్తారమైన జనం ఉంటుందని ఎవ్వరేనా ఉహించగలరు... ఉండేందుకు స్థలం దొరకకపోవచ్చు అని కూడా అందరు ఉహించగలరు.
👉 *కానీ యోసేపు ముందస్తు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేకపోయాడు. మరియ నిండు గర్భవతి కనుక తనకి అనుకూలముగా ఏర్పాట్లు చేయాల్సింది, కానీ అలా ఏమి ముదస్తూ ఏర్పాట్లు చేయలేదు.* యోసేపు ఉండేందుకు
స్థలం కోసం బేత్లెహేములో అటుఇటు తిప్పుతున్నాడు.
మరియ ప్రసవించే రోజులు అవి...
అయినా... *తన భర్తతో గాడిదమీద వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది,*
బేత్లెహేములో విడిది కోసం విధివిధి అలానే తిరిగింది,
తల దాచునే చోటులేక అప్పుడే పుట్టిన తన బిడ్డను పశువులు ఉండే చోట ఉంచవలసి వచ్చింది.
🔺 *అయినా.... అయినా... ఎప్పుడు కూడా, ఏవిషయంలో కూడా మరియ యోసేపును ఏదైనా మాట అన్నట్లు మనం వాక్యంలో చూడం.*
🔹 ఈ సంబర్భంలో మరియ మౌనంగా ఉండటంమే మనం చూస్తాము.
🔹యోసేపు వల్ల అన్ని కష్టాలు పడుతున్న సద్దుకుపోయింది, అన్నివిషయాలలో తన భర్తను అర్ధం చేసుకుంది.
🔹 ముందస్తు విడిది చూడనందుకు ఉల్లిక్కిపడలేదు...
పశువుల పాకలో ఉంచినందుకు అవమానంగా భావించి ఎగిరిపడలేదు.
*అన్నిటా, అంతటా, తన భర్తను వెంబడిస్తూ, పరిస్థితులను అర్ధంచేసుకుంటూ మెలిగింది.మరియ... ఎంతో గొప్ప భార్య.*
5⃣ *మరియ... ఎంతో గొప్ప తల్లి ....*
గమనించండి...
*రానురాను మనుషులలో సక్రమంగా పిల్లలను పెంచే సామర్ధ్యం తగ్గుతుంది అనుకుంట.*
🔸కుమారుడి మీద తండ్రికి అదుపుఉండదు,
🔸కూతురి మీద తల్లికి అదుపు ఉండదు.
పిల్లలు అదుపుతప్పటానికి సారాన్ని తెలిసితెలియక తల్లితండ్రులే వేస్తున్న రోజులు
వాక్యంలో వ్రాయబడియున్నది...
*"యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను."* అని...
అంటే...
🔹యేసు మానసికంగా ఎదుగుతున్నారు....
🔹 శారీరకంగా ఎదుగుతున్నారు...
🔹 అద్యాత్మికంగా ఎదుగుతున్నారు... అని.
🔺 *ఇలా ఒక బాలుడు ఎదుగుతున్నాడు అంటే అందులో తల్లితండ్రుల పాత్రే ఎక్కువ అని చెప్పాలి...*
యేసు తల్లితండ్రులకు పూర్తి విధ్యేయుడు అయ్యాడని వాక్యం చెబుతుంది. యేసు విధ్యేయత కలిగి ఉండునట్లుగా తల్లితండ్రులు మసలుకున్నారు అనేది మరోకోణం. యోసేపు మరియలు యేసుని చక్కగా పెంచారు... యేసు వారికీ పూర్తి విధ్యేయుడు అయ్యారు.
*మరియ ఒక తల్లిగా 9 మాసాలు కడుపులో మోయ్యటము మాత్రమే కాదు... ఆ చంటిబిడ్డను కాపాడుకొనుటకు రాత్రుళ్ళు ఎంతో దూరం పరుగుపరుగున ప్రయాణాలు చేసింది... 30 సం!!రాలు ఎంతో చక్కగా పెంచింది...*
▪ కుటుంబాన్ని వదిలేసి పరిచర్య అని తిరుగుతుంటే సహకరించింది...
▪చివరికి యేసుక్రీస్తు వారు న్యాయవిమర్శలో నిలుచుంటే ఆయనతోనే ఆ వెనుక ఉంది... యేసుక్రీస్తు సిలువ యాత్రలో నడచింది...
▪యేసయ్య అరిచే ప్రతి కేక తన గుండెను కోస్తున్నా యేసయ్య చివరి శ్వాసవరకు ఆయనకు తోడుంది...
▪యేసు సమాధి కార్యక్రమాలలో పాల్గొంది... యేసు పునరుద్ధానమును కన్నులారా చూసింది...
▪ *చివరికి సంఘం పరిశుద్ధాత్మతో నింపబడుట చూసింది.*
👉 *ఒక్క మాటలో చెప్పాలి అంటే తన కుమారునికి చెందిన ప్రతి సందర్భంలోను తను తన కుమారునితోనే ఉండిపోయింది. చివరికి తన గుండేలోనికి ఒక ఖడ్గం దూసుకోస్తుంది అని తనకి ముందే తెలుసు... కానీ, ఒక్కక్షణం కూడా తన బిడ్డను వదిలి ఉండలేక పోయింది.మరియ... ఎంతో గొప్ప తల్లి.*
నా ప్రియ స్నేహితులారా...
1... *మరియ... ఎంతో మంచి జీవితవిధానంగల స్త్రీ....*
2... *మరియ... ఎంతో గొప్ప వివాహబంధాన్ని కట్టుకుంన్న స్త్రీ....*
3... *మరియ... ఎంతో గొప్ప దైవభక్తిగల స్త్రీ....*
4... *మరియ... ఎంతో గొప్ప భార్య ....*
5... *మరియ... ఎంతో గొప్ప తల్లి .... ఒక పరిపుర్ణమైన స్త్రీ.*
చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను....
మరియగారి గురించి మాట్లాడాలి అంటే నాకు చాలా భయం...
👉 *ఎందుకంటే మరియను దేవతగా చేసి ఆరాధిస్తున్న ఉన్నారు. వారికీ అనుకూలముగా ఈ మాటలు ఉంటాయేమో అని భయం.
గమనించండి... మరియ ఎంతో గొప్ప మనిషి, భక్తిపరురాలు గౌరవించతగిన స్త్రీ...
*కానీ పూజింపతగినది కాదు.దేవుడు ఆమెను తన సాధనముగా ఉపయిగించారు. ఆమె అందుకు సమ్మతించింది.అందుకు మనం మరియ గారిని గౌరవించాలి. అరాధించకూడదు.*
👉 *యెహోవా(యేసు) దేవునిని తప్ప మనం ఎవ్వరిని ఆరాధించినా... పూజించినా... వారికీ ప్రార్ధించినా... అది ముమ్మాటికి పాపంగా లెక్కింపబడుతుంది.*
👉 *మనం మరియ గారి నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి, అంతే కానీ అజ్ఞానంతో ఆమెను ఆరాధించి పాపం మీద వేసుకోకూడదు.*
*"నేను రోషంగల దేవుడను, నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాదు"* అని మన దేవుడు చెబుతున్నారు.
అలాంటప్పుడు దేవునిని కాకుండా మరొకరిని ఎలా మహిమపరచగలము.
*సైన్యములకు అధిపతియగు యెహోవా(యేసు).... సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమేవసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. . . !*
*ఆమేన్. ఆమేన్. ఆమేన్.*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి