ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(పదిహేడవ  భాగము)

♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻
(ఆరవ భాగము)

కొలస్సీయులకు 1: 17
*ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.*

    ప్రియులారా! ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి, *ఆయన అనగా యేసుప్రభులవారు అన్నింటికన్నా ముందుగా ఉన్నవాడు!!*

👉 *చాలామంది పొరబడుచున్నట్లుగా యేసుప్రభులవారు కేవలం సుమారు 2018 సం.ల క్రితం నుండే ఉన్నారు, అంతకముందు యేసుప్రభులవారు లేరు, తండ్రియైన యెహోవా దేవుడే ఉన్నారు అనుకుంటున్నారు!!!* ఇది తప్పు అని వాక్యము ఖరాఖండిగా సెలవిస్తుంది! 

*ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవారు! అనగా ఈ సృష్టిని చేయకముందే ఆయన ఉన్నారు.*

 అందుకే ఆదికాండం 1:2 *దేవునిఆత్మ జలములపైన అల్లాడుచుండెను.అప్పుడు ఆ ఆత్మ- తనవాక్కు ద్వారా వెలుగు కమ్మని పలుకగా (వాక్కు)(1:3) వెలుగు కలిగెను.* 
👉 ఈ రకంగా సమస్త సృష్టి జరిగింది!!

   మరలా మనం యోహానుసువార్త మొదటి అధ్యాయానికి రావాలి. *ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియెద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. కలిగియున్నవేమియు ఆయన లేకుండా కలుగలేదు!*
 ఇక్కడ వాక్యము= దేవుడు; వాక్యము = కుమారుడు. ఈ వాక్యము దేవునియొద్ద ఉన్నది అనగా తండ్రి, కుమారుడు అక్కడే కలసి ఉన్నారు. ఎందుకంటే వీరిద్దరూ ఒక్కటే! *కలిగియున్నదేదియు ఆయనలేకుండా కలుగలేదు అనగా యేసుప్రభులవారు తండ్రియైన దేవునిని సంప్రదించి, ఈ సృష్టిని రచించి, ఆయనే చేసారు!* తెలుగులో ఈ వచనము తర్జుమా: 

*ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారసంభూతుడు అని తర్జుమా చేయబడింది,* అయితే కొన్ని తర్జుమాలలో *ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తున్నాయి* అని వ్రాయబడింది. 

👉 అనగా *ఈ సమస్త సృష్టి – నక్షత్రములు, గ్రహాలూ, ఋతువులు అవి సక్రమంగా తిరిగేలా, గతి తప్పకుండా, మానవ వినాశనం కాకుండా ఈ సమస్త సృష్టిని నిర్వహించేది యేసుప్రభులవారే!!!! హల్లెలూయ!*

    🔺 *కాబట్టి కుమారుడైన యేసయ్య, రెండువేల సం.ల క్రితము పుట్టినవారు కారు,*

🔺 *పెద్దదేవుడు చేసిన చిన్నదేవుడు అంతకంటే కాదు!!!*

👉 *సృష్టికన్నా ముందున్నవాడు, సృష్టి చేసినవాడు, ఆదియు- అంతమునై ఉన్నవాడు!!!* ప్రకటన1:8; 21:6; 22:13;
 *సృష్టికర్త ఆయనే- సృష్టి లయకర్త ఆయనే!!!*

👉 *ఈ సమస్త విశ్వము ఉనికిలోనికి రాకముందే దేవునికి కుమారుడు ఉన్నాడు!!*
 కేవలం భూమిపై జన్మించినప్పుడు ఆయన కుమారుడు కాలేదు! ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను యోహాను 1:2; 
*ఆయన ఇప్పుడు కాదు ఆదియందే దేవుని యొద్ద ఉన్నారు.*
 యోహాను 17:5 లో యేసుప్రభులవారు తండ్రితో అంటున్నారు: *తండ్రీ! లోకము పుట్టకముందు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను బలపరచుము” .* ఎంత స్పష్టముగా వ్రాయబడిందో చూడండి. 

👉 *లోకము పుట్టకముందే ఆయన ఉనికిని కలిగియున్నారు!!!* అందుకే మీద వచనంలో కొలస్సీ 1:17 
*ఆయన అన్నింటికన్నా ముందున్నవాడు* అంటున్నారు పౌలుగారు!
 1 కొరింథీ 8:6 ప్రకారం *సమస్తం చేసింది ఆయనే!* 

   ఒకసారి కుమారుడు కోసం మనం ఆలోచిద్దాం! దేవునికి కుమారుడు ఉన్నాడు అని పూర్వకాలమందే అనగా సుమారు ౩౦౦౦ సం.ల క్రితమే వ్రాయబడింది. *సామెతలు గ్రంధం 30వ అధ్యాయంలో*
👉 మనకు ఒక ప్రవక్త కనిపిస్తారు. ఆయన పేరు *ఆగూరు.* ఆయన నేను పశుప్రాయున్ని, నాకు జ్ఞానం లేదు, జ్ఞానాభ్యాసం లేదు అనగా చదువులేదు అంటూ దేవోక్తులు పలుకుతున్నారు. 30:1 దేవోక్తి అనగా ప్రవచనం. 

సామెతలు 30: 4
*ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?*
 . . . (నిజంగా ఈ అధ్యాయం మొత్తం అర్ధం చేసుకుంటే మనకు జీవిత పరమావధి అర్ధం అవుతుంది కాబట్టి ఒకసారి మొత్తం అధ్యాయం చదవండి). 
సరే ఈ వచనంలో *ఆకాశానికి ఎక్కి దిగినవాడు ఎవడు?  దీనికి జవాబు యేసుప్రభులవారే కదా!* 

*భూమియొక్క దిక్కులు స్తాపించిన వారు ఎవరు?* 

*అయన పేరు ఏమిటి? ఆయన కుమారుని పేరు ఏమిటి?   అనగా దేవునికి కుమారుడు ఉన్నాడు, కుమారునికి పేరు ఉంది ,* అయితే ఆ పేరు ఆగూరుగారికి తెలియదు! ఇక 

కీర్తనలు 2  లో *కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును”* అంటున్నారు! 

👉 ఇక్కడ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు! ఆయనను ముద్దుపెట్టుకోకపొతే అనగా ఆయనను ఇష్టపడకపోతే, సేవించకపోతే తండ్రియైన దేవునికి కోపం వస్తుంది.

👉 *ఇక ఆయనకు కుమారుడుగా భూలోకంలో పుడతారు* అని యెషయా గారు నేటికి సుమారు 2755 సం.ల పూర్వమే అనగా క్రీ.పూ. 740లో ప్రవచించారు! 

యెషయా 9: 6
*ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.*
  
ఇక ఎలా పుడతారో 
యెషయా 7:14 లో చెప్పారు. 
*ఒక కన్యక గర్భమందు జన్మిస్తారు, ఆయనకు ఇమ్మానుయేలు అనిపేరు. ఆ కుమారుడు పుట్టాడు, వెళ్లి చూడండి అని 2014 సం.ల క్రితం గొల్లలకు దేవదూతలు చెబితే వారు వెల్లిచూసి అందరికీ చెప్పారు. ఆ వార్త మనవరకు వచ్చింది!!* లూకా 2:11; కాబట్టి ఆయన సృజింపబడిన వాడు కాదు, సృష్టికర్త!సమస్తమును నిర్వహిస్తున్నవాడు!!
    
  యేసయ్య భాప్తిస్మము పొంది బయటకు వచ్చినవెంటనే 
*“ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను”* అని దేవుడు పరవశుడై పలుకుతున్నారు!! మత్తయి3:17; లూకా 3:22;

🔺  *మరి అట్టి దేవాదిదేవుడ్ని నీవు పూజిస్తున్నావా?* 

*కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును అంటున్నారు.* కీర్తనలు 2:12; కాబట్టి ఆయనను ప్రేమించి, సేవిస్తున్నావా?

 మనందరికీ ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన 
యెషయా 9:6 లో *ఉదహరింపబడిన యేసుప్రభులవారు! ఆయన పేరు రక్షకుడు! పాప రక్షకుడు/ పరిహారకుడు! ఆయన నీకోసం, నాకోసం ఈ భూలోకానికి వచ్చి, మన పాపములకోసం కల్వరి సిలువలో బలియాగమై, మన పాపములులను పరిహరించినవాడు. యేసు రక్తము ప్రతీ పాపములనుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును!*

 1 యోహాను 1:7; మరి ఆ రక్తంలో కడుగబడతావా? 
అట్టి పాప పరిహారకుడు, కుమారుడు, సృష్టికర్త, సృష్టిని నిర్వహించువాడు అయిన యేసుప్రభులవారిని నమ్ముకో! 
రక్షణ పొందుకో! 

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...