✳ *....క్రిస్మస్....* ✳
(ఇరవై ఆరవ భాగము)
*దేవునిగా ఉన్న వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను....✍*
*ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి*
యోహాను 1: 14
👉 దేవునిగా ఉన్న వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను.
*యేసు భూలోక అవతారంలో, దైవ స్వభావం చురుకుగా (active) ఉన్నది మరియు మానవ స్వభావం నిష్క్రియగా (passive) ఉంది.*
👉దేవుడు మనుష్యుడయ్యాడు, కానీ మానవుడు దేవుడు కాలేదు.
కొలస్సి 2:9
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత *శరీరముగా క్రీస్తునందు* నివసించుచున్నది
1తిమో 3:16
*నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను*
గల 4:4
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన *స్త్రీయందు పుట్టి* మనము దత్తాపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము నకు లోబడినవాడాయెను.
యేసు యొక్క దైవ స్వభావం ఎటువంటి పరిస్థితులలోను మారదు. వాక్యం దేవునిగా మారినప్పుడు ఆయన యొక్క దైవిక స్వభావంలో ఏ మార్పు చెందలేదు. దైవిక స్వభావం యొక్క వ్యక్తిత్వమే మానవ స్వభావంలో కొనసాగింది మరియు నివసించింది.
ఆయనలో ఉన్న రెండు స్వభావాల యొక్క *మూలం* భిన్నంగా ఉంటుంది.
👉యేసు యొక్క దైవ స్వభావం నిత్యత్వం నుండి ఉన్నది
*అనగా అద్వితీయ కుమారునిగా యేసు జగదుత్పత్తి ముందే తండ్రితో బాటుగా నిత్యత్వంలో ఉన్నటువంటివాడు.* (యోహాను 1:14, 18; 3:16).
♻ *...ప్రవచనాలు - నెరవేర్పు...* ♻
*బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ కొన్ని వందల సంవత్సరాల ముందే రాశారు. అవి ఉన్నవున్నట్లుగా నిజమౌతున్నాయి.*
👉 వాటిలో ఒక్క పొల్లు కూడా పోకుండా యేసు క్రీస్తు నందు అంత ఖచ్చితంగా నెరవేరుతున్నాయంటే వాటిని రాయించింది ఓ మనిషి మాత్రం కాదని అర్థమౌతుంది.
2 పేతురు 1:21.
✳ *"దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను."*
రోమా 1:4
👉సువర్తకు విశ్వసనీయతను పెంచి చేయూతనిచ్చే మాటలు ఈ వచనములో వ్రాయబడినాయి....
*సువార్త(సువార్త అంటేనే యేసుక్రీస్తు.) ఎదో 2017 సం!!రాల క్రితం ప్రారంభమయ్యిందని అనుకోవటానికి వీలులేదు....*
👉 సువార్త (సువార్త అంటేనే యేసుక్రీస్తు)పౌలు తెచ్చినది కాదు...
👉 బెత్లేహేములో పుట్టి నజరేతులో పెరిగేన యేసు అనే ఒక యవ్వనస్తుని సృష్టి కాదు.
*సువార్త అంటే యేసుక్రీస్తు స్థాపించినది కాదు, సువార్త అంటేనే యేసుక్రీస్తు. ఆయన గురించి మాట్లడటమే సువార్త.*
👉మరి ఈ యేసు నిన్న మొన్న 2 వెల సం!!రాల క్రితమే కదా అండి ఉంది అంటారా....?
🔺మీకా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఇలా అంటున్నారు
*“బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను." ( Micah (మీకా) 5:2 )*
👉అవును... *ఆయన పురాతనకాలము నుండి ఉన్నవారు....*
👉సువార్త 2 వెల సం!!రాల క్రితం పుట్టినది కాదు. అది పురాతనకాలము నుండి ప్రత్యక్షమగుచుండెను.
👉 క్రీస్తు సువార్త కొత్తది కాదు...
👉అనాది కలం నుండి
🔺ప్రవక్తల ద్వారా,
🔺లేఖనాల ద్వారా,
🔺సాదృశ్యాల ద్వారా,
🔺నీడల ద్వారా,
🔺సూచనల ద్వారా,
*క్రీస్తు సువార్త మనకి కనిపిస్తుంది.*
♻గమనించండి...
👉 ధర్మశాస్త్రమును బట్టి చూసినప్పుడు పాతనిబందన, క్రొత్తనిబంధన వేరు వేరు....
👉 క్రీస్తు సువార్తను బట్టి చూసినప్పుడు *పాత నిబందన, క్రొత్త నిబంధనకు నీడగా....*
*క్రొత్త నిబంధన, పాత నిబందనకు నేరవేర్పుగా కనిపిస్తుంది.*
👉క్రీస్తు విషయమైతే పాత నిబందనను క్రొత్త నిబంధనను వేరు చెయ్యలేము.
*ఎందుకంటే...?*
*యేసుక్రీస్తు పురాతన కాలము నుండి ఉన్నవారు. ఆయనే సువార్త. యేసు గురించి మాట్లాడటమే సువార్త.*
నా ప్రియ స్నేహితులారా....
*యేసుక్రీస్తు సువార్త అనాదికాలము నుండి ఉన్నది, యేసు క్రీస్తు సువార్త అనాదిలోనే వాగ్దానము చేయబడినది.*
♻ *ఆదికాండము 3వ అధ్యాయములోనే యేసుక్రీస్తు గురించిన సువర్తకు సంబంధించిన మొదటి వాగ్ధానము ఇవ్వబడియుండుట మనం చూడగలము.*
పౌలు గారు ఈ విషయాన్నే రోమా పత్రికలో చాలా చక్కగా వివరిస్తున్నారు....
రోమా పత్రిక 1వ అధ్యయము 4వ వచనము....
*"దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను."*
👉అవును.... యేసుక్రీస్తు గురించిన ఈ సువార్త గురించి ఎన్నో వాగ్ధానాలు మనకి ముందు ఉన్నాయి.
👉అసలు వాగ్ధానాలు, ప్రవచనాలు ఉండటము వేరు కానీ....
*అవి యేసయ్య జీవితములో నెరవేరటము అనేది ఎక్కువగా మనం శ్రద్ధగా గమనించవలసిన విషయము.*
*సుమారు మూడు వందలకు పైగా లేఖన భాగము క్రీస్తు గురించి ఉన్నాయి అని కొందరు అంటారు. కానీ, సులువుగా ఒక సాధారణమైన మనస్సు కూడా గ్రహించగలిగే వీలున్న వాగ్ధానపూరితమైన లేఖన భాగాలూ 43, 44 మనకి కనిపిస్తాయి.*
👉ఈ రోజు యేసుక్రీస్తువారి సువార్త గురించి వెల సం!!రాల ముందుగా ప్రవక్తలు పలికిన లేఖనాలు, కొన్ని వాక్య భాగాలు చూద్దాము.
👉 *యేసు ఒక స్త్రీ గర్భామున జన్మిస్తారు అని ఆదికాండము 3:15 లో వ్రాయబడితే....*
🔺 దాని నెరవేర్పు మత్తయి 1:20, గలతీ 4:4 లో వ్రాయబడినది.
👉 *యేసు ఒక కన్యకయిన స్త్రీ గర్భామున జన్మిస్తారు అని యెషయా 7:14 లో వ్రాయబడితే....*
🔺దాని నెరవేర్పు మత్తయి 1:22, లూకా 1:26-31 లో వ్రాయబడినది.
👉 *యేసు యుదయా బెత్లేహేములో జన్మిస్తారు అని మీకా 5:2 లో వ్రాయబడితే....*
🔺దాని నెరవేర్పు మత్తయి 2:1, లూకా 2:4-6 లో వ్రాయబడినది.
👉 *యేసు అబ్రాహాము కుటుంబములో జన్మిస్తారు అని ఆదికాండము 12:3 లో వ్రాయబడితే....*
🔺దాని నెరవేర్పు మత్తయి 1:1, రోమా 9:5 లో 😳 వ్రాయబడినది.
👉 *యేసు యూదా గోత్రములో జన్మిస్తారు అని ఆదికాండము 49:10 లో వ్రాయబడితే....*
🔺దాని నెరవేర్పు లూకా 3:3, హెబ్రీ 7:14 లో వ్రాయబడినది.
👉 *యేసు దావీదు సింహాసనానికి వారసునిగా వస్తారు అని యెషయా 9:7, 2 సమూయేలు 7:12-13 లో వ్రాయబడితే....*
🔺దాని నెరవేర్పు లూకా 1:32,33 లో వ్రాయబడినది.
👉 *యేసుకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని యెషయా 7:14 లో వ్రాయబడితే....*
🔺దాని నెరవేర్పు మత్తయి 1:23లో వ్రాయబడినది.
👉 *యేసు ఐగుప్తులో కొంతకాలము ఉండును అని హొషేయ 11:1 లో వ్రాయబడితే....*
🔺దాని నెరవేర్పు మత్తయి 2:14-15లో వ్రాయబడినది.
*యేసు పుట్టిన ప్రదేశము తన పిల్లలను గురించి అంగలార్చును అని యిర్మీయా 31:15 లో వ్రాయబడితే....*
దాని నెరవేర్పు మత్తయి 2:16-18లో వ్రాయబడినది.
*యేసుకు ముందుగా ఆయన మార్గమును బాప్తిసమిచ్చుయోహాను సిద్ధపరచును అని యెషయా 40:3-5లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు లూకా 3:3-6లో వ్రాయబడినది.
*యేసు తన స్వజనముతో తృణీకరించబడును అని యెషయా 53:3 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు యోహాను 7:5లో వ్రాయబడినది.
*యేసు ప్రవక్త అని ద్వితీయోపదేశకాండము 18:15 లో వ్రాయబడితే....*
దీనినెరవేర్పు అపో.కా 3:20-22లో వ్రాయబడినది.
*యేసు దేవుని కుమారునిగా బయలుపడును అని కీర్తనలు 2:7 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మత్తయి 3:16,17లో వ్రాయబడినది.
*యేసు గలలీయాకు వెలుగుగా ప్రకాశించును అని యెషయా 9:1,2, లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మత్తయి 4:13-16లో వ్రాయబడినది.
*యేసు అనేక ఉపమానాలు బోధించును అని యెషయా 6:9,10 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మత్తయి 13:10-15,34-35లో వ్రాయబడినది.
*యేసు నలిగిన హృదయములను స్వస్థపరచును అని యెషయా 61:1,2 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు లూకా 4:18-19లో వ్రాయబడినది.
*యేసు మేల్కిసెదెకు క్రమము చొప్పున యజకత్వము చేయును అని కీర్తనలు 110:4 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 5:5,6, లో వ్రాయబడినది.
*యేసు రాజుగా పిలువబడును అని జెకర్యా 11:12,13 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మత్తయి 27:37 లో వ్రాయబడినది.
*యేసు డబ్బుకు అమ్మబడును అని జెకర్యా 11:12,13 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మత్తయి 27:9-10 లో వ్రాయబడినది.
*యేసుపై అబద్ద సాక్షులు లేచును అని కీర్తనలు 35:11 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మార్కు 14:57-58 లో వ్రాయబడినది.
*యేసయ్య దోర్జన్యమునొంది బాధింపబడెను అని యెషయా 53:7 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మార్కు 15:4,5 లో వ్రాయబడినది.
*యేసయ్యను కొట్టువారికి తననుతాను అప్పగించుకొనును అని యెషయా 50:6లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మత్తయి 26:67 లో వ్రాయబడినది.
*యేసు అకారణముగా అనేకులకు అసహయముగా మారునని కీర్తనలు 35:19 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు యోహాను 15:24-25 లో వ్రాయబడినది.
*యేసు అక్రమార్కులలో ఒకనిగా ఎంచబడెను అని యెషయా 53:12 లో వ్రాయబడితే ....*
దీని నెరవేర్పు మార్కు 15:27-28 లో వ్రాయబడినది.
*యేసు అంగి కూడా పంచుకోనబడును అని కీర్తనలు 22:16 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు లూకా 23:34 లో వ్రాయబడినది.
*యేసు ఎముకలో ఒక్కటైనను విరుగదు అని కీర్తనలు 34:20 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు యోహాను 19:33-36 లో వ్రాయబడినది.
*యేసు ప్రక్కల బల్లెముతో చీల్చబడును అని జెకర్యా 12:10 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు యోహాను 19:34 లో వ్రాయబడినది.
*యేసు తనను హింసించువారికొరకు ప్రార్దించును అని కీర్తనలు 109:4 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు లూకా 23:34 లో వ్రాయబడినది.
*యేసు లోకపాపములనిమిత్తము బలిగా మారును* అని యెషయా 53:5-12లో
వ్రాయబడితే .
..
దీని నెరవేర్పు నాలుగు సువార్తలలోను వ్రాయబడినది.
*యేసు ధనవంతుల సమాధిలో ఉంచబడును అని యెషయా 53:9 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మత్తయి 27:57-60 లో వ్రాయబడినది.
*యేసు మరణమును జయించి పునరుద్ధానుడై లేచునని కీర్తనలు 16:10 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు నూతన నిబంధన అంతా కనిపిస్తుంది లో వ్రాయబడినది.
*అటుతరువాత యేసు పరమునకు చేర్చబడును అని కీర్తనలు 24:7-10 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు లూకా 24:51 లో వ్రాయబడినది.
*యేసు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగును అని కీర్తనలు 68:18 లో వ్రాయబడితే....*
దీని నెరవేర్పు మార్కు 16:19 లో వ్రాయబడినది.
👉ఇలా ఏన్నో లేఖనసత్యాలు ఉన్నాయి మీకోసం ఒక 33 మాత్రమే నేను ఇచ్చాను, మరిన్ని మీరు స్వయంగా గ్రహిస్తారని ఆశిస్తున్నాను.
నా ప్రియ స్నేహితులారా....
👉 క్రైస్తవ్యం పౌలు సృష్టి కాదు...
👉యేసు స్ధాపించినది కాదు.
👉క్రైస్తవ్యానిది పురాతనమైన పునాది. ఈ లేఖనాలే దీనికి ఆధారము.
🔺గమనించండి...
లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారు అక్షరము కూడా తప్పకుండా నేరవేర్చారు.
*యేసు 2017 సం!!రాల క్రితం వ్యక్తి మాత్రమే కాదు ఆయన ఆది అంతము లేని శక్తి.*
*యేసు ఘనులైన ప్రవక్తల ప్రవచనాలతో ఉవ్వెత్తున ఏగసిన అల....*
*ఆయన అనాదిలోనే నియమింపబడిన గొర్రెపిల్ల.*
👉ఇప్పటికేనా యేసుక్రీస్తు అను రక్షకుని అవసరతను... సువార్తకున్న విశ్వసనీయతను మీరు గ్రహిస్తారని నా ఆశ.
*క్రీస్తు అనే పేరులో ప్రజలందరికీ వాగ్దానం (Promise for Everyone) దాగి ఉంది.*
👉 అనగా ఇది
*“ప్రజలందరికిని మహా సంతోషకరమైన సువర్తమానము ”* (లూకా 2:10) అని అర్ధం.
*గత సంవత్సరము నుండి ఈ సంవత్సరము వరకు మనకు తోడైయుండి మనలను నడిపించిన ఇమ్మానుయేలు మనలో సంతోషానందాలను నింపిన క్రీస్తు ప్రభువు మన ప్రతీ పాపమును క్షమించి నిజమైన రక్షణ అనుభవంలోనికి నడిపించిన యేసయ్య ప్రతీ గుండె గుడిలో కొలువై యుండాలని, ఈ ప్రత్యేక క్రిస్మస్ ప్రతీ జీవితంలో నూతన వెలుగులు విరజిమ్మాలని ప్రార్థించుకుందాం,*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి