ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(పంతొమ్మిదవ  భాగము)

♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻
(ఎనిమిదవ భాగము)

♻ *యేసు ఎప్పుడైనా దేవుడని అన్నారా?....✍*

🔺అపోస్తలు 20:28 
*"దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ...”.*


ఈ మధ్య facebook లో ఎక్కువుగా ఈ ప్రశ్న చూస్తున్నాను. 

👉ముస్లిం సోదరులు యేసు దేవుడని చూపించు, నా ఆస్థి మొత్తం రాసిస్తా అన్నారు అంట. ఎక్కువ మంది అడిగారు నన్ను ఈ ప్రశ్న. అల్పుడనైనను కొంత ప్రయత్నించాను. 
👉 ఈ అంశం Share చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కువ మంది తెలుసుకోవడానికి వీలు అవుతుంది.

👉బైబిల్ లో ఎక్కడా 
*“నేనే దేవుడను”* అని ఖచ్చితమైన పదాలతో యేసు గురించి తెలుపలేదు. 
👉ఏమయినప్పటికీ, ఆయన దేవుడని తెలుపలేదని కాదు. ఉదాహరణకి యోహాను 10:30 లో *“నేనుయు మరియు తండ్రి ఒకరై ఉన్నాము.”* 
👉మొదట చూడగానే,
*ఇది దేవుడని చెప్పినట్లు లేదు.*
 ఏమయినప్పటికీ, (యోహాను 10:33) అతని ప్రవచనానికి యూదుల ప్రతిస్పందనను చూస్తే,
 *“నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని, మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి”.*
👉 యూదులు యేసు దేవుడన్న ప్రవచనాన్ని అర్ధం చేసుకున్నారు. తరువాత వాక్యాలలో యూదులు *“నేను దేవుడను కాను”* అన్న దాన్ని వ్యతిరేకించలేదు.

 *దీనివల్ల మనకు యేసు ఆయన వాస్తవంగా దేవుడని* (యోహాను 10:33) లో 
*“నేనుయు మరియు తండ్రి ఒకరై ఉన్నాము.”*అని ప్రకటించారు. యోహాను 8:58 మరియొక ఉదాహరణ. *"అబ్రహాము పుట్టుక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!"* మరల యూదులు యేసు పై రాళ్ళు ఎత్తినపుడు బదులు పలికెను (యోహాను 8:59). 

*వారు దైవదూషణ అని నమ్మేటట్లు నేను దేవుడను అని చెప్పడం వంటిది కాకపోతే యూదులు యేసుపై ఎందుకు రాళ్ళు రువ్వాలనుకున్నారు?* 

🔺యోహాను 1:1 చెబుతుంది *“వాక్యము దేవుడై యుండెను.”*

 🔺యోహాను 1:14 ప్రకారం *“ఆ వాక్యము శరీర ధారియై యుండెను.”*
👉 ఇది శరీరంలో యేసు దేవుడైయున్నాడని సూచిస్తుంది. 

🔺అపోస్తలు 20:28 మనకు తెలుపుతోంది, 
*"దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ...”.*
👉 తన స్వరక్త ముతో ఎవరు సంఘాన్ని కొన్నారు? 
యేసు క్రీస్తు. అపోస్తలు 20:28 

*దేవుడు తన స్వరక్తముతో సంఘాన్ని కొన్నారు. కాబట్టి యేసే దేవుడు!* 

👉యేసు గురించి శిష్యుడు, *“నా ప్రభువా నా దేవా”* అనెను (యోహాను 20:28). 
🔺యేసు అతనిని సరిచేయలేదు.

 🔺 తీతుకు లో 2:13
*మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూడండి*అని ప్రోత్సహిస్తుంది- . యేసు క్రీస్తు (2 పేతురు 1:1 కూడా చూడండి). 

🔺హెబ్రీ 1:8 లో, యేసు తండ్రి గురించి చెబుతారు, 
*"తన కుమారుని గూర్చి అయితే, "దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది, మరియు నీ రాజ దండము న్యాయార్ధమయినది."*

👉 ప్రకటనలలో, ఒక దేవదూత యోహానును దేవునికి మాత్రమే నమస్కారము చేయుడని సూచించెను (ప్రకటనలు 19:10).

👉లేఖనాలలో చాలా చోట్ల యేసు పూజలను అందుకున్నారు (మత్తయ2:11; 14:33; 28:9,17; లూకా 24:52; యోహాను 9:38).
👉తనని పూజింజిన వారిని ఎప్పుడూ గద్దించలేదు. 
👉యేసు దేవుడు కాని ఎడల, ప్రకటనలలో దైవదూతలు తెలిపిన విధంగా, ఆయనను పూజించవద్దని ప్రజలను వారించెడివాడు. 
👉యేసు దేవుడనే వాదలకు లేఖనానలలోని పదబంధాలు మరియు సారాంశాలు ఇంకా చాలా ఉన్నాయి. 

*ఆయన దేవుడు కాకుండా యేసు దేవుడు కావటానికి ముఖ్య కారణము సర్వ లోక పాపములను చెల్లించుటకు ఆయన మరణము సరిపోయెడిదికాదు*
 (1 యోహాను 2:2). 

*అటువంటి అనంతమైన శిక్షను దేవుడు మాత్రమే చెల్లించగలడు.*
 దేవుడు మాత్రమే సర్వలోక పాపములను తీసుకుని, (2 కొరింథి 5:21), 
*మరణించి- పాపము మరియు మరణమును జయించి మరియు పునరుద్ధానమయ్యెను.*

👉మనిషికి పుట్టినవాడు మనిషి అయినప్పుడు..
👉దేవుని కుమారుడు దేవుడు కాడా??

దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేయబోవు పనుల గూర్చి బైబిల్ మొత్తంలో 330 లేఖనాలు పైగా ఉన్నాయి. వాటిని నెరవేర్చినట్టు ఆయనే స్వయంగా తెలిపారు.
ఆయన కన్నా ముందు వచ్చిన దూతని గురీంచి కూడా లేఖనాలలో వ్రాయబడి యున్నది.

👉లూకా సువార్త 7 : 48 - 
*నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.*

🔺అంటే పాపములు క్షమించు అధికారం దేవునికి కాక ఇంకెవరికి ఉంది.

👉మత్తయి సువార్త 1 : 21 - *తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...