✳ *.....క్రిస్మస్.....* ✳
(ఎనిమిదవ భాగము)
♻ *ప్రభువైన యేసుక్రీస్తును ఘనపరచిన తల్లి*
మానవజాతికి సృష్టి కర్త మరియుప్రతిపరిస్థితిని
ఆధీనంలో ఉంచుకున్న
దేవుడు *తానెవరైనది* ప్రత్యుత్తరం ఇస్తూ ప్రకటించుకున్నాడు.
*మత్తయి మరియు లూకా సువార్త లోని మొదటి అధ్యాయాలలో* ప్రాంతములలో క్రీస్తు జనన వృత్తాంతములలో,ఈ
యొక్క వాస్తవం బయలు పరచబడినది.
దూత *యేసేపు* తో (మత్తయి1:18)
*జెకర్యా* తో
(లూకా 1:13) మరియు
*మరియ* తో
(లూకా1:2 8) చెప్పిన,ఊహించనటువంటి వర్తమానాలను మనము చదువుతున్నాము.
ఒక వృద్ధునికి ఒక కన్యకు తెలియపరచబడ్డ ఈ వర్తమానాలు, ఆత్రుతలకు, *"ఇది ఏలాగు జరుగును"* అను గొప్ప ప్రశ్నకు మార్గాన్ని ఏర్పరచింది. "ఆయన ఎవరైనది" మరియు "వెనుక ఎవరున్నది" అన్న వింతైన సంఘటనలలో
(మత్తయి 1:2 0) (లూకా1:20) దేవుని యొక్క ప్రత్యుత్తరము బయలుపరచబడినది.
*క్రీస్తు జన్మననుసరించి మత్తయి మరియు లూకా వివిధ దృక్పధాలతో అగుపరచారు.* దేవుని ప్రణాళిక మరియు మానవాళి పై ఆయనకుగల అత్యున్నతమైన ప్రేమను గురించి వారు మాట్లాడుతున్నారు. వారిద్దరూ రాసినది మనము జాగ్రత్తగా పరిశీలించిన యెడల వాటిలో గల బేదాలు ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించిన మరియపై కేంద్రీకరింపబడినట్లు మనము కనుగొనగలము.
🔺 *యేసుక్రీస్తు యొక్క వంశావళి మత్తయి సువార్త లో ఒక విధంగానూ లూకా సువార్తలో ఒక విధంగానూ ఇలా ఏందుకు వ్రాయబడి ఉన్నది ?*
✳ *యేసు యొక్క పితరుల పట్టిక* ✳
♻ *మత్తయి1:16-17 పితరుల జాబితా.* ♻
👉 *యకోబు మరియ భర్తయైన యోసేపును కనేను.* మత్తయి1:16
👉 *మత్తయి లో పితరుల జాబితాను "యోసేపు" సంబంధించినదిగా తీసుకొనవలెను*
👉పితరుల జాబితా ఒక క్లుప్త చరిత్రయే:
👉మత్తయి చరిత్ర ను పదునాలుగు తరమువలు గల మూడు గుంపులుగా విభజించుచూన్నాడు.వరుసగా అందరి పితరుల పేర్లు ఇచ్చట గుర్తించవలసిన బలవంతము లేదు.ఇదీ సంక్షేమ పద్ధతిలో ఇవ్వబడియున్నది.
*కనెను అను మూల పదము యెక్క అనువాదమ బట్టి పితరుడైయున్నాడు అని అనువదించవచ్చును.*
♻ *లూకా3:23-36* ♻
*యేసు యొక్క పితరుల జాబితా.*
👉లూకా3:24 యేసేపు హేలి కుమారుడు గా నుండటకు ఎక్కువ కారణమున్నది.
*ఈ వార్తలు మరియ ద్వార లూకా కు తెలిసియండవలేను.*
👉 స్త్రీలకు లూకా సువార్త ఎక్కువ ప్రాధాన్యత నిచ్చుచున్నాది.ఇందుకు మరియ యెక్క పారంపర్య పట్టిక ఒక ప్రత్యేక సాక్ష్యము.
👉 *లూకా లో పితరుల జాబితాను మరియకు సంబంధించినదిగా తీసుకొనవలెను.*
➡ *యోసేపు మరియులు దావీదు యొక్క వంశమునందు జన్మించినారు.*
రెండు సువార్తలు కూడా ప్రకృతికి అతీతమైన క్రీస్తు పుట్టుక గురించి అనగా ఒక కన్యకకు జన్మించడం, మరియు జ్ఞానులు క్రీస్తును దర్శించడం, దూతలు గొల్లలతో మాట్లాడడం ద్వారా సువార్త సర్వసామాన్యమైనదిగా సుచింపబడుచున్నది.
♻ *ప్రభువైన యేసుక్రీస్తును ఘనపరచిన తల్లి*
👉 *ఎలీసబెతును దర్శించిన మరియ*..
మరియమ్మబంధువురాలైనా ఎలీసబెతు, తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి యున్నట్లుగా దూత చెప్పిన మాటల ద్వారా మరియ గ్రహించింది.
మరియ సిద్ధపడి యూదా ప్రదేశములోని,కొండసీమలో ఉన్న గ్రామానికి వెళ్లి, జెకర్యా ఇంటిలో ప్రవేశించి *ఎలీసబెతుకు వందనం చేసింది మరియ యొక్క వందన వచనం వినగానే ఎలీసబెతు గర్భంలోని శిశువు గంతులువేశాడు*
అప్పుడు
ఎలీసబెతు పరిశుద్ధాత్మ తో నిండుకొనినదై ఇలా అంది
*స్త్రీలలో నీవు దీవెన పొందిన దానివి నీ గర్భఫలము ఆశీర్వదింపబడును*
నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకెలా ప్రాప్తించెను? ప్రభువు ఆమెకు తెలియ జేయించిన మాటలు నెరవేరు తీరుతుంది.
*నమ్మినఆమె ధన్యురాలు*
అప్పుడు, మరియ ప్రభువును,ఇలాస్తుతించడం ఆరంభించింది...
*నా ప్రాణం ప్రభువును ఘనపరచుచున్నది*.
*నా రక్షకుడైనదేవునిలో నా ఆత్మ ఆనందిస్తోంది*
*ఎందుకంటే రాబోయే తరం వాళ్ళు, స్త్రీలలో కెల్లా సంతోషవంతురాలని పిలిచేట్టు, దీనురాలి నైన నన్ను ఆయన సృష్టించాడు అని స్తుతి కీర్తన పాడింది*
🔺 *పుట్టబోయే బిడ్డకు తల్లి అయినను ఆయన రక్షకుడని, తనకూ రక్షకుడవసరమని మరియ గ్రహించింది.*
*ఆయనకు భయపడేవారి మీద, ఆయన కనికరము తరతరములకు ఉండునని*
*ఆయన తన చేతితో పరాక్రమ కార్యాలు చేస్తాడని*
*గర్విష్టుల హృదయ ఆలోచనలను బట్టి ఆయన వారిని చెదరగొట్టి వేస్తాడని*.
*బలవంతులను సింహాసనముల నుండి పడద్రోసి దీనులను హెచ్చిస్తాడని.*
*ఆకలి గొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి, ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాడు.*
*అబ్రహాము నకును అతనిసంతానమునకును చేసిన వాగ్దానం మేరకు తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు*
*నిందకు పాలైన పరిస్థితులలో ప్రభువును స్తుతించుటకన్యఅయిన మరియయొక్కగొప్ప విశ్వాసం*
తనకు తన స్వగ్రామంలో నున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు.
కానీ ఆమె తన బంధువు రాలైన ఎలీసబెతు ఇంటిలో *మూడు నెలలు* ఆమెతో కూడా ఉండి తిరిగి తన ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది (లూకా1: 56)
👉 *సామాన్యంగా స్త్రీల మైన మనము మనకు కలిగిన నిందలలో బాధలలో ప్రభువును స్తుతించలేము, అది మనకు అసంభవం, పైగా ప్రభువు మీద సణుగుతూ ఉంటాము.*
*మరియ వలె మనం ప్రతి పరిస్థితిలో ప్రభువును స్తుతించాలి ఆయనను ఘనపరచాలి*
ఇంకా ఎన్నో మంచి లక్షణాలు ఈ మరియలో మనకి కనిపిస్తాయి...
*పుట్టబోయే బిడ్డకు తల్లి అయినను ఆయన రక్షకుడని, తనకూ రక్షకుడవసరమని మరియ గ్రహించింది.*
చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను....
*మరియగారి గురించి మాట్లాడాలి అంటే నాకు చాలా భయం... ఎందుకంటే మరియను దేవతగా చేసి ఆరాధిస్తున్న బుద్ధిహీనులు ఉన్నారు. వారికీ అనుకూలముగా ఈ మాటలు ఉంటాయేమో అని భయం.*
గమనించండి... మరియ ఎంతో గొప్ప మనిషి, భక్తిపరురాలు గౌరవించతగిన స్త్రీ...
*కానీ పూజింపతగినది కాదు. దేవుడు ఆమెను తన సాధనముగా ఉపయిగించారు. ఆమె అందుకు సమ్మతించింది. అందుకు మనం మరియ గారిని గౌరవించాలి. అరాధించకూడదు.*
యెహోవా(యేసు) దేవునిని తప్ప మనం ఎవ్వరిని ఆరాధించినా... పూజించినా... వారికీ ప్రార్ధించినా... అది ముమ్మాటికి పాపంగా లెక్కింపబడుతుంది.
*మనం మరియ గారి నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి, అంతే కానీ అజ్ఞానంతో ఆమెను ఆరాధించి పాపం మీద వేసుకోకూడదు.*
*"నేను రోషంగల దేవుడను, నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాదు"* అని మన దేవుడు చెబుతున్నారు.
అలాంటప్పుడు దేవునిని కాకుండా మరొకరిని ఎలా మహిమపరచగలము.
*లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించిన పరిశుద్దురాలు.*
👉దానిలో ఎట్టిసందేహం లేదు.
*ఆమెను పరిశుద్దమైన స్త్రీగా మనము గౌరవించాలి.*
👉 తన జీవితాన్ని మన జీవితాలకు ఆదర్శప్రాయంగా మలచుకోవాలి.
కాని,
*ఆరాధించడానికి వీల్లేదు.*
👉కారణం?
*మనుష్యలు గాని, దేవదూతలు గాని ఆరాధనకు యోగ్యులుకారు. దేవుడొక్కడే ఆరాధనకు పాత్రుడు.*
*జ్ఞాలులు కుడా యేసును మాత్రమే ఆరాధించారుగాని, మరియను గాని, యోసేపును గాని కాదు.*
*"నేను రోషంగల దేవుడను, నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాదు"* అని మన దేవుడు చెబుతున్నారు.
అలాంటప్పుడు దేవునిని కాకుండా మరొకరిని ఎలా మహిమపరచగలము.
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి