🌹 *ఇదేనా...క్రిస్మస్* 🌹
యూరప్ ఖండంలో అది ఒక గొప్ప ధనిక కుటుంబం. క్రైస్తవులు అయినప్పటికీ ఆచార భక్తికి, ఆడంబరానికి అలవాటు పడినవారు.
ఆ భవంతిలో పుట్టిన *మొట్టమొదటి కుమారు నికి మొదటి పుట్టినరోజు ఘనంగా జరుపాలని తలంచి బంధువులను అందరినీ పిలిచారు.*
ఆ భవనమంతామిత్రులతో నిండిపోయింది. అక్కడ చేరుకున్న కారణం-
👉🏽 *కేంద్ర బిందువైన ఆ శిశువే*
ఎవరికి వారు మాటల్లో పడి సంతోషంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. కానీ....
*ఆ శిశువు గురించిన మాటే లేదు. ఊసేలేదు*
*పుట్టిన రోజు కేక్ కటింగ్ సమయం ఆసన్నమై నపుడు* అక్కడున్న 'పాస్టర్ గారు' వచ్చిన వారిని, ఆ కుటుంబాన్ని ఉద్దేశించి విచ్చేసిన మీ అందరికీ శుభములు.
చాలా సేపటి నుండి మీరు
*ఈ ఆనందంలో పండుగ వాతావరణంలో పడి అసలు శిశువు పుట్టిన రోజును మరిచిపోయేలా ఉన్నారు*
*ఇంతకీ శిశువు ఎక్కడ ఉన్నాడో! తీసుకుని రండి* అని అడుగగా.....
ఇంటివారు, ఇంటిలో వున్న పనివారు ఆ పసికందును వెదకిరి గాని ఎక్కడా కనబడలేదు.
ఈలోగా ఒక ఆమె నేను లోనికి వచ్చేటప్పుడు హాల్లో ఉన్న *మంచం మీద శిశువు పరుండి ఉండుట చూచితినని* అనగా అంతా అక్కడికి పరుగు తీశారు. మంచముపై అందరి కోట్లు,స్వెట్టర్లు,
పడి ఉన్నాయి.
ఇది చలికాలం కనుక అందరూ స్వెట్టర్లు, పొడుగు కోట్లు, వేసుకొని లోనికి వచ్చి, వచ్చినవారు వచ్చినట్లే ఆకోట్లు,స్వెట్టర్ విప్పి, ఆ మంచంపై పడవేసినారు.
పిల్లవాడుకనిపించకపోయే సరికి ఎవరికో అనుమానం వచ్చి ఆ కోట్లు ,స్వెట్టర్ లు తియ్యండి అని అంటుండగా......
*ఎవరి కోటు వారు తీస్తుండగా ఆ కోట్ల క్రింద నలిగి ఊపిరి ఆడక ప్రాణాలు పోగొట్టుకొన్న పసికందు బయట పడెనట.*
*అయ్యో! ఎంత ఘోరం చేశారు.*
*ఆ బాలుడి పుట్టిన రోజుకు వచ్చి ఆ బాలున్ని పట్టించుకోకుండా.... ఎవరికి వారు సంబరాల్లో పడి శిశువును పొట్టన పెట్టుకోవడం ఎంత దారుణం*
ఆనాడు ఆ శిశువును ఆ రీతిగా నిర్లక్ష పరచి పుట్టిన రోజునేపొట్టనబెట్టుకొంటే...
... ఈనాడు క్రిస్మస్ పేరు చెప్పి, *క్రిస్మస్ నకు కేంద్ర బిందువైన క్రీస్తును ఏ మాత్రం తలంచక*
*ఆయన ఎందుకు జన్మించాడో!, ఎవరికోసం జన్మించాడో!, అనే తలంపు కూడ లేకుండా సరదాలలో మునిగి తేలుతూ .......*
👉🏽 *క్రీస్తును మరచి క్రిస్మస్ విలువను విడిచి అన్యులు సహితం అసహ్యించుకునే విధంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అవమానకరం*
*క్రీస్తు జన్మను ఆయన దీన్నత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయనకు మనిషి పట్ల కలిగియున్న రక్షణ ప్రణాళికను పంచుకొంటూ ఆదరించాల్సిన*
*మనము క్రీస్తు లేకుండా,
క్రీస్తు కలిగిననూ..పరిశుద్ధత లేకుండా,
*క్రీస్తు కనపరిచిన* *ప్రేమ,కరుణ,కనికరము,ఇతరుల పట్ల చూపించ* *కుండా జరుపుకొనేది నిజమైన క్రిస్మసేనా ?*
*క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడం అలాగే మనకు చేతనైన రీతిలో సువార్త ప్రకటించడం ఇదే నిజమైన క్రిస్మస్*.
చలికి అల్లాడుతున్న వారికి దుప్పటి ఇచ్చి వారికి వెట్ట పుట్టించడం, కొత్తబట్టలు నోచుకోని పేదవారికి అనాధ బిడ్డకు చక్కని బట్టలు కొట్టించడం, వీటి ద్వారా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించినట్లే.
ఇదే... *ఏసయ్య కోరే నిజమైన క్రిస్మస్*
*దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నన్ను దర్శించ నా యొద్దకు వచ్చితిరనిచెప్పెను* (మత్తయి 25:36)
యీ *నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను.*(మత్తయి25:45)
ఈయన ప్రజాపతి గా మానవ ఆత్మల సంరక్షణార్థమై ఈ భువికి అరుదెంచిన పుణ్యమూర్తి.
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి