ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(19 వ భాగము )

*దైవ మానవ స్వభావాలను పంచుకోవడం* 
(వాక్యము శరీరధారి ఆయెను - 2వ భాగము)

*5. స్వభావాలను పంచుకోవడం: (The Sharing of Attributes)*
యేసు యొక్క వ్యక్తిత్వంలో, దైవ స్వభావం మరియు మానవ స్వభావం ఐక్య పరచబడినవి. ఈ ఐక్యత కారణంగా, యేసులో, దైవ స్వభావం మరియు మానవ స్వభావం తమ లక్షణాలను పరస్పరం పంచుకున్నవని పరిశుద్ధ గ్రంధం చూపిస్తుంది. 

ఈ క్రింది వాక్య భాగాలలో యేసు యొక్క వ్యక్తిత్వం *దైవిక* మరియు *మానవ* స్వభావ లక్షణాలను కలిగి ఉన్నట్లు మనం చూడగలం:

రోమా 9:5  పితరులు వీరివారు; *శరీరమునుబట్టి* క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన *దేవుడై యుండి* నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌

1పేతురు 3:18  ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు *శరీరవిషయములో* చంపబడియు19  *ఆత్మ విషయములో* బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.

హెబ్రీ 13:8  యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును
 
ఈ క్రింది వాక్య భాగాలలో, ఆయన *దైవ స్వభావానికి* *మానవ లక్షణాలు* జత జేయబడినవి:

అపో 3:15  మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

1కొరి 2:8  అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.

రోమా 8:32  తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?

గల 2:20  నేను క్రీస్తుతోకూడ  సిలువ వేయబడియున్నాను;  ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించు చున్నాను.

అపో 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

ఈ క్రింది వాక్య భాగాలలో, ఆయన *మానవ స్వభావానికి దైవిక లక్షణాలు* జత చేయ బడ్డాయి:

యోహా 6:62  ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?

యోహా 8:58  యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

1కొరి 15:47  మొదటి మను ష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు.

*6. ఔన్నత్యమును పంచుకొనుట - The Sharing of Majesty:*
యేసునందు, దైవ స్వభావం మరియు మానవ స్వభావం రెండు కూడా ఒకే ఔన్నత్యమును అనగా మహత్వమును  భాగస్వామ్యంగా కలిగి ఉన్నవని పరిశుద్ధ గ్రంధం మనకు తెలియజేస్తుంది. అనగా దైవిక అధికారం, శక్తి మరియు ఘనత మానవ తస్వభావంకి ఇవ్వబడ్డాయి, ఎందుకంటే దైవ స్వభావం ఇప్పటికే ఈ విషయాలను కలిగి ఉంది.

👉 యేసు సర్వశక్తిని కలిగి ఉన్నాడని మనము చూస్తాము:

యోహా 5:19  కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును 21  తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును

మత్తయి 28:18  అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది

👉 యేసు సర్వం చూడగల శక్తిని కలిగి ఉన్నాడని మనము చూస్తాము:

మత్తయి 9:2  యేసు వారి విశ్వాసముచూచి

లూకా 5:22  యేసు వారి  ఆలోచన లెరిగి

యోహాను 2:24  అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన  వాడు  25  గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు

ఉదా: యేసు సమరయ స్త్రీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎరుగును.(యోహాను 4:16-19)  

👉 యేసు ప్రతిచోటా ఉన్నాడని మనము చూస్తున్నాము:

మత్తయి 18:20  ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని  చెప్పెను.

మత్తయి 28:20  ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను

ఎఫెస్సి 1:23  ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.

ఎఫెస్సి  4:10  దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.

👉 ఈ రెండు స్వభావాలు యేసు యొక్క వ్యక్తిత్వంలో ఏకమయ్యాయి, కాబట్టి క్రీస్తు యొక్క మానవ స్వభావం దైవ స్వభావం అంతటా వ్యాపించి యున్నది. మనం దీనిని తరచు ఆయన సేవా పరిచర్యలో చూడక పోయినా కొన్ని ఉదాహరణలను మనం చూడగలం.     

మత్తయి 14:25  రాత్రి నాలుగవ జామున ఆయన *సముద్రముమీద నడుచుచు* వారియొద్దకు వచ్చెను.

లూకా 4:30  అయితే ఆయన వారి *మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.*

యోహాను 8:59  కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని *యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.*

యోహాను 3:13  మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
(To be continued...)

దైవాశ్శీసులు!

From the desk of...
Pastor Jyothi Raju Vemula 
_(Soli Deo Gloria)_


కామెంట్‌లు