✳ *.....క్రిస్మస్....* ✳
(పదిహేనవ భాగము)
♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻
(నాలుగవ భాగము)
🔺 *ఈయన ప్రభువైన క్రీస్తు* 🔺
లూకా 2:11 లో *దేవునిదూత గొర్రెలకాపరులతో దావీదు పట్టణమందు మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు!!* అని చెప్పడం జరిగింది.
*మొదటగా రక్షుకుడు,* తర్వాత *ప్రభువు!*
👉 *యేసు క్రీస్తు ను ప్రభువుగా లోకమునకు పరిచయం చేసింది దేవదూతలే!!!*
🔹ఆయన ఎలా ప్రభువు అయ్యారో ధ్యానం చేద్దాం!
🔹ఆయన ఎలా సృష్టికర్త అయ్యారో కూడా ధ్యానం చేద్దాం!
🔺 ప్రోటోటొకస్ కి మరో అర్ధం *ప్రభువు అనగా యేసుప్రభులవారిని ప్రభువు అనికూడా చెప్పబడింది.*
👉 క్రొత్తనిబంధనలో *యేసు క్రీస్తు ను* ప్రభువు అని కొన్నివందల సార్లు వ్రాయబడింది! వాటిలో కొన్నింటిని మాత్రం చూద్దాం!
1). లూకా 2:11 లో
*దేవునిదూత గొర్రెలకాపరులతో దావీదు పట్టణమందు మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు!! అని చెప్పడం జరిగింది. మొదటగా రక్షుకుడు, తర్వాత ప్రభువు! యేసయ్యను ప్రభువుగా లోకమునకు పరిచయం చేసింది దేవదూతలే!!!*
2). మత్తయిసువార్త 22:41-45 లో
*పరిసయ్యులతో యేసు క్రీస్తు మాట్లాడుతూ దావీదు: ప్రభువు నా ప్రభువుతో అంటున్నారు,* మీరు మెస్సయ్యను/ క్రీస్తుని దావీదు కుమారుడు అంటున్నారు కదా మరి యేసు క్రీస్తు దావీదు కుమారుడు ఎలా అవుతాడు? దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుంటే అన్నారు. కాబట్టి మెస్సయ్య అనగా *క్రీస్తు , అభిషక్తుడు ప్రభువు అని దావీదుగారు ముందే ప్రవచించారు!*
3) అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతుకోస్తు దినాన్న ఆది అపోస్తులులపై ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత పేతురుగారు ఆత్మావేశుడై అంటున్నారు ప్రజలతో: *మీరు సిలువవేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, రక్షకునిగాను, అభిషక్తునిగాను నియమించెను అంటున్నారు!!!* 2:36; ఇది తిరుగులేని మాట!!
4) ఇక మీద ఉదహరించినట్లు 1 కొరింథీ 8:6 ప్రకారం *ఒకే దేవుడు, ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త; ఒకే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు, ఆయన సృష్టికర్త!!!*
5) ఫిలిప్పీ 2:10-11 ప్రకారం *ప్రతీ నాలుక యేసు- ప్రభువని ఒప్పుకొనును.*
కాబట్టి *యేసుక్రీస్తు పభువు ఆయన. రక్షకుడు, అభిషక్తుడు! గ్రీకు భాషలో ప్రభువు అనేమాట కురియస్ అని కూడా ఉపయోగించారు.*
👉 పాతనిబంధన లో *యెహోవా దేవుణ్ణి ఇదే కురియస్ అనే మాటతో అభివర్ణించారు.*
👉 *క్రొత్తనిబంధనలో యెహోవా అనే మాటకు బదులుగా అదే అర్ధమిచ్చే ప్రభువు అనేమాట వాడారు!!*
ఇంకా యేసు- ప్రభువు అని ఎక్కడ రాసి ఉంది రిఫరెన్సులు కావాలంటే: మత్తయి 3:3; 23:27; యోహాను 8:24-25, 58; 10:11; 12:41; అపో 2:21; రోమా 10:9-10, 13; 1 కొరింథీ 1:31; 2:8; 10:4; ఎఫెసీ 4:10; ఫిలిప్పీ 2:10-11; తీతు 2:13; హెబ్రీ 1:10-12; యూదా 5; ప్రకటన 19:16.
*చివరికి బైబిల్ ప్రభువైన యేసు అనే వచనముతో ముగుస్తుంది!!!*
మరి ఆదికాండం మొదటి అధ్యాయం ప్రకారం, యెషయా 44, హెబ్రీ 11:3
*యెహోవా దేవుడు సృష్టికర్త!*
*యేసుప్రభులవారు సృష్టికర్త*
👉 *ఇద్దరు సృష్టికర్తలున్నారా? లేదు! ఒక్కరే! ఎందుకంటే ఇద్దరూ ఒక్కరే! తండ్రియైన యెహోవాదేవుడే కుమారుడైన యేసుప్రభువు!!!*
🔹 అది ఎలాగో, ఆయన ఎలా సృష్టికర్త అయ్యారో ధ్యానం చేద్దాం!
1). 1కోరింథీయులకు 8: 6
*ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.*
*తండ్రియైన దేవుడు= సృష్టికర్త*
*కుమారుడు= ప్రభువు= సృష్టికర్త*
కావున తండ్రియైన దేవుడు= సృష్టికర్త= యేసుక్రీస్తు.
2). హెబ్రీ 1:10-12 జాగ్రత్తగా ధ్యానం చేస్తే . .. దీని అర్ధం భూమికి *పునాదులు వేసింది యేసుప్రభులవారు అనగా సృష్టికర్త= తండ్రియైన దేవుడు.*
3) ఇక గతభాగం లో చూసుకున్న రెండు సమీకరణాలు చూస్తే:
*వాక్యము= దేవుడు/తండ్రి; వాక్యము శరీరధారియై భూలోకానికి వచ్చెను. అలా వచ్చినది ఎవరు? శరీరదారి= యేసుప్రభులవారు.*
👉 కావున వాక్యము= శరీరదారి= యేసుప్రభులవారు.
*కాబట్టి దేవుడు = యేసుప్రభులవారు!!!*
వాక్యము= దేవుడు = యేసుప్రభులవారు కలిగియున్నదేదియు ఆయనలేకుండా కలుగులేదు = సృష్టికర్త
వాక్యము= శరీరదారి= సృష్టికర్త= యేసుప్రభులవారు
4). ఇక ఎఫెసీ 3:9 ఈ వచనం కూడా తెలుగు భాషలో సరిగా తర్జుమా చేయబడలేదు. ఇంగ్లీష్లో “Ephesians 3: 9
*And to make all men see what is the fellowship of the mystery, which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ:*
*“ అనగా సమస్తమును యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడెను!! అనగా యేసుక్రీస్తు సృష్టికర్త!!*
5). ఇక ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్న కొలస్సీ 1:16-17 వచనాలలో యేసుక్రీస్తు సృష్టికర్త అని రూడిగా తెలియజేస్తున్నాయి!
ఇంకా చాలా రెఫెరెన్సులు ఉన్నాయి గాని ఇవి చాలు యేసుప్రభులవారు సృష్టికర్త అనియు, ఆయనే తండ్రి అనియు చెప్పడానికి!!!
కొలస్సీయులకు 1: 15
*ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.*
సర్వసృష్టికి ఆదిసంభూతుడు! ఆదిసంభూతుడు అనగా చాలా అర్ధాలున్నాయి:
*సృష్టిని చేసినవాడు/ సృష్టికర్త, ప్రముఖుడు, ప్రధముడు, అధిపతి . . .*
*ఆదిసంభూతుడు – ప్రముఖుడు*= ఇది ప్రోటోటొకస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి తెలుగులో అర్ధం *ప్రముఖత్వాన్ని, ఆధిపత్యాన్ని సూచిస్తుంది.*
👉 పాత నిబంధనలో మనకు కనబడే సృష్టికర్తయైన తండ్రియైన దేవుణ్ణి కూడా ఇదేమాటతో అభివర్ణించారు!
👉 *ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని లోకమంతటికి ప్రభువని, సృష్టికర్తయని, ప్రముఖుడు అని అంటున్నారు!* తర్వాత వచనాలు అనగా 16,17 చూసుకుంటే పౌలుగారు అదేభావంతో ఈ మాటను పలికినట్లు అర్ధం అవుతుంది. 16వ వచనం ప్రకారం
*ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయనకోసం ఈ సమస్తసృష్టి చేయబడింది అనగా సృష్టికర్త!!*
*చివరికి బైబిల్ ప్రభువైన యేసు అనే వచనముతో ముగుస్తుంది!!!*
👉 కాబట్టి యేసుప్రభుల వారు సృష్టికర్త, ప్రముఖుడు, ప్రభువు అని గుర్తెరిగి, ఆయనకు ఇవ్వాల్సిన ఘనత, గౌరవం ఇద్దాం!
ఆయన దైవత్వాన్ని గుర్తించి మనలో అవిశ్వాన్ని, సందేహాలను తొలగించుకొందాం!
*ప్రభువైన యేసూ! రమ్ము!*
ప్రకటన 22:20;
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి