ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్.....* ✳

(ఏడవ భాగము)

*యేసు తల్లియైన మరియ*

లూకా 1: 42
*స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును*

ప్రత్యేకముగా స్త్రీల గురించి ఆలోచించినప్పుడు.
హన్నా... ఎస్తేరు... దేబోరా... రుతు... రిబ్క... ప్రిస్కిల్ల... సమరయ స్త్రీ... మగ్ధలేను మరియా... సరేపతు విధవరాలు... రహబు వేశ్య... లుదియా... అని చాలా మంది గుర్తొస్తుంటారు.

 కానీ... *నూతన నిబంధనకు ప్రారంభంమయిన ఒక స్త్రీని మనం ఈ క్రిస్టమస్ రోజులలో తప్ప ఇంకా ఎప్పుడూ గుర్తుచేసుకోము. ఆమె పేరు "మరియ" వాక్యం లో ఇలా వ్రాయబడియుంటుంది...*

 *"ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను"* అని...

మన ప్రభువైన యేసుక్రీస్తువారు శరీరధారిగా జన్మించిన క్రమములో ఆయనను నవమాసాలు మోసి జన్మనిచ్చింది ఈమె. *నూతన నిబంధన చరిత్ర అంతయు ఈ మరియ గారి నుండే ప్రారంభమవుతుంది.*

గమనించండి...
*పాతనిబందనలో మనకి కనిపించే మొదటి స్త్రీ "హవ్వ"... అంటే... "జీవముగలప్రతివానికి తల్లి" అని అర్ధం.*

*నూతన నిబంధనలో మనకి కనిపించే మొదటి స్త్రీ "మరియ"... ఈమె "నిత్యజీవమైన యేసుకి తల్లి"*

ఒకరు మనిషి మీద ఏలుబడిచేసే పాపానికి జన్మనిస్తే... మరొకరు ఆ పాపం నుండి మనిషిని విమోచించే రక్షకునిని జన్మనిచ్చారు.

ఒకరు పాత నిబంధనకు ప్రారంభం... మరొకరు నూతన నిబంధనకు ప్రారంభం.

అంతే కాదు అండి....
ఇంకా ఎన్నో మంచి లక్షణాలు ఈ మరియలో మనకి కనిపిస్తాయి...


 *ఘనపరచిన మరియ*

*మిరియాము*
అను పదమునకు (హెబ్రీ) *మరియ*(అనునది గ్రీకు పదము) అనగా అర్థం *హెచ్చింపబడుట*

 తన్ను ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు. మరియ ఏవిధంగా దేవుని ఘనపరచి ఆయనకు సమర్పించుకున్నదో చూద్దాం.

 1⃣ *ధన్యురాలైన మరియ*  

లూకా 1: 42
స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును

ధన్యురాలుగా దీవింప బడిన మరియ  ఈ యొక్క అంశములో *మరియ* వివిధ  దృక్పథములతో వ్యవహరించబడ్డది. 

*దేవుని యెడల ఆమెకు గల వినయ విధేయతలను కేంద్రీకరిస్తూ..మరియ అల్పురాలైన యూదా బాలిక అయినను దేవుడు,తన కృపా కనికరములచే, లోకరక్షకుని ఈ లోకానికి తెచ్చుటలో ఏర్పరచబడిన పాత్రగా వాడుకున్నాడు.*

 *స్తుతింపదగిన వ్యాఖ్యానము*
 (లూకా 1:39 - 45) 
మెస్సీయ యెక్క తల్లిగా నుండుట మరియకు ఎంతగొప్ప ఘనత!  

*స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు*

 అనగా అర్థము నీవు *స్త్రీలందరిలోఅధికంగా ఆశీర్వదింపబడిన దానవు అను మాటలను వినుట ఎంతో గొప్ప దన్యత*
 మరియు *"నా ప్రభువు యొక్క తల్లి"* అని చెప్పు అని చెప్పుటలో  ఎలీసబెతు దీనిని దృడ పరిచింది. తద్వారా *ప్రభువైన యేసు యొక్క ఉన్నతమైన దైవత్వాన్ని కేంద్రీకరించింది*
ఎవరైతే ఆయనకి చిత్తానికి సమర్పించుకోవడానికి సిద్ధపడి యున్నారో, వారిపై   ఇది దేవుని యొక్క విశ్వాస్యతనుప్రతిబింబింప జేస్తుంది. 


2⃣  *అసాధారణమైన ఎంపిక*
లూకా 1:28—34
ఒక ప్రత్యేక ఉద్దేశము కలిగి, ఒక ప్రత్యేకమైన స్థలానికి, ప్రత్యేక గ్రామానికి, ఒక ఇంటికి దేవుని దూత పంపబడినది.ఒకప్రత్యేకమైన కార్యము నిమిత్తము ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకొనుటకు *ఏసుక్రీస్తుతల్లిగాకన్యయైన మరియను ఎన్నుకొనుటలో దేవుని యొక్క శ్రేష్టమైన ఎంపిక ఎంతో అద్భుతమై నది* మరియ ఎవరు ఎరుగని నిరహంకారియైన పల్లెటూరి బాలిక. ఆమె పలుకుబడి గల వ్యక్తి కాదు. *దేవుడు తన ఉద్దేశాలనునెరవేర్చుట లోమనయొక్కనేపథ్యాన్ని త్రోసిపుచ్చుతాడు. కానీ మనము దేవునితో అనుదినము నడుచుట లో మన సంపూర్ణ విధేయత,  ఆయనకు కావాలి*

3⃣ *మరియ విశ్వాసము*

(లూకా 1:35 —38)
 ఆమె ద్వారా లోక రక్షకుడు రాబోతున్నాడని దూత తెలియ పరచినప్పుడు ఆమె భయపడింది. ఆమె హృదయంలోకలవరపడింది. ఊహించలేనటువంటి దేవుని ప్రణాళిక ఆమెకు అర్థం కాలేదు. ఆమె లేదు దేవునియందు అపనమ్మక ము ఉంచలేదు. ఇంకను హెచ్చరించ వలసినదిగా  ఆమె తన కోరికను వ్యక్తపరచింది.   అవిశ్వాసంతో దీనికి నిమిత్తము లేదు. *దేవుడు తన మార్గముల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా) తన సాక్షం ద్వారా  దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు తన ప్రణాళికను నిర్వహిస్తాడు* 

మనము మరియొక తలంపును గాని, వ్యతిరేక తలంపులను గాని కలిగియుండకుండునట్లు *దేవుడుతనవాగ్దానాలను వ్యక్తిగతంగా దృఢపరుస్తాడు*

 4⃣ *ఉత్తమమైన నిబద్ధత*
(లూకా 1: 38) 
ఎప్పుడైతే దేవుడు మన సందేహాలను తీరుస్తాడో, మనము ఎన్నుకోవలసినది ఒకటే ఆయనకు మనలను మనము సమర్పించు కొనుట. మనము ఇది చేయుటకు ఎప్పుడైతే తీర్మానించుకొంటామో అప్పుడు అది మన జీవితాలలో గొప్పసమర్పణ చేకూరుస్తుంది. 
*కన్య యైన మరియ సమాజములో విమర్శను ఎదుర్కొనవలసి వస్తుంది. దేవునికి ఇది తెలుసు.  కానీ మరియ తన దృష్టిని దేవుని మీద కేంద్రీకరించింది*  
అందుకే ఆమెచెప్పగలిగింది 
*నీ మాటచొప్పున నాకు జరుగును గాక* అని (లూకా1:38) దేవునిపై మనకు గల భక్తి మరియు ఆయన వాక్యానుసారంగా క్రమబద్దమైన నడక, నడి మార్గంలో మనం నిలుచున్నప్పుడు, తక్షణమే తీర్మానాలను తీసుకొనుటలో దోహదపడుతుంది.  చివరికి మనము తీర్మానాలను చేసినప్పుడు అవి మనకు తృప్తిని కలిగిస్తాయి. 


 5⃣ *మరియ... ఎంతో గొప్ప దైవభక్తిగల స్త్రీ....*

గమనించండి...  దేవదూత వచ్చి మరియకు ఒక వార్త చెప్పాడు. లోకనుసారముగా చూస్తే అది తనకు అవమానమును కలిగించేది... తన సిలంపై మచ్చవేసేదిగా ఉంది.
ఇంకా వివాహం కానీ కన్య... ఇంక కొన్ని రోజులలో పెళ్లి ఉంది... ఇప్పుడు తను గర్భవతి అని తెలిస్తే అది సమాజం ముందు ఎంతటి అవమానం. జరగనున్న వివాహం నిలబడుతుందా ? 
" ఇది విషయం " అని నిజం చెప్పినా ఎవరేనా నమ్ముతారా...? ఇన్ని అనుమానాలమధ్య మరియ ఒక్కటే మాట చెప్పింది 
*"ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అని....*

👉 *మరియ జరగనున్న వైపరిత్యాలు అన్ని వదిలేసి దేవుని చిత్తం పూర్తిగా తనలో నేరవేరుటకు అనుమతించింది. దేవుని పై పూర్తిగా విశ్వాసముంచింది.* అంతే కాదు అండి... వాక్యంలో వ్రాయబడిఉంది... *"పరిశుద్ధాత్మ ఆమెను కమ్మెను"* అని... పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తను వెళ్ళిపోయింది. ఎంతో మందికి పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వెళ్ళటం చేతకాదు. దానికన్నా ముందు ఇష్టతచూపించారు.

యోబు గారు అంటారు... *"నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా"* అని... ( యోబు 4:6 ).
*అదే మరియ ధైర్యం...* రానున్న నిందలు ఆమెను భయపెట్టలేదు,

 *తన వివాహబంధం ఏమవుతుందో అనే భయం లేదు. తనని ఇంకా ఏ మాటలుకూడా కలవారపెట్టలేకపోయాయి.*

దేవుని చిత్తం తనలో నేరవేరాలి ఇది ఒక్కటే ఆమెలో పనిచేస్తూఉంది. పెద్దపెద్ద భక్తులలో కనిపించే మొదటి లక్షణం ఇదే.
మరియ... ఎంతో గొప్ప దైవభక్తిగల స్త్రీ.

 6⃣ *మరియ... ఎంతో గొప్ప భార్య ....*

గమనించండి... *లోకంలో నేడు జరుగుతున్న విడాకులకు కారణం భార్యాభర్తలు ఒకరిని ఒకరు సహించుకోలేకపోవటం వల్లనే జరుగుతున్నాయి, ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోలేకపోవటం వల్లనే జరుగుతున్నాయి, ఒకరి లోపాలు మరొకరు అర్ధం చేసుకోలేకపోవటం వల్లనే జరుగుతున్నాయి.*

భార్యను అడిగితే భర్త మీద ఎన్ని పిర్యాదులు ఇస్తుందో....
భర్తను అడిగితే భార్య మీద ఎన్ని పిర్యాదులు ఇస్తాడో.... ఆ పిర్యాదుల పట్టికకు అంతం ఉండదు.
ప్రేమ లేని బ్రతుకులు అవి.... ప్రేమ అంటే అర్ధం తెలియని జీవితాలు అవి....

కానీ, *మరియ అలాంటిది కాదు. భర్తను అర్ధం చేసుకేనే మనస్సు ఆమెకు ఉంది.* అది కష్టం అయినా... నష్టం అయినా... ప్రాణాపాయంలో అయినా... *మరియ భర్త గురించి ఈ చెడు మాట్లాడలేదు.*

చూడండి... లూకా సువార్త 2వ అధ్యయము....
ప్రజాసంఖ్య వ్రాయబడుటకు ఆజ్ఞ ఇవ్వబడింది... ప్రతివాళ్ళు కూడా తమ పేరులు నమోదు చేసుకొనుటకు బేత్లెహేముకు వస్తుంటారు... బేత్లెహేములో విస్తారమైన జనం ఉంటుందని ఎవ్వరేనా ఉహించగలరు...   *ఉండేందుకు స్థలం దొరకకపోవచ్చుఅని కూడా అందరు ఉహించగలరు. కానీ యోసేపు ముందస్తు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేకపోయాడు. మరియ నిండు గర్భవతి కనుక తనకి అనుకూలముగా ఏర్పాట్లు చేయాల్సింది, కానీ అలా ఏమి ముదస్తూ ఏర్పాట్లు చేయలేదు.* 

యోసేపు ఉండేందుకు
స్థలం కోసం  బేత్లెహేములో అటుఇటు తిప్పుతున్నాడు.
మరియ ప్రసవించే రోజులు అవి...
అయినా... తన భర్తతో గాడిదమీద వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది,
బేత్లెహేములో విడిది కోసం విధివిధి అలానే తిరిగింది,
తల దాచునే చోటులేక అప్పుడే పుట్టిన తన బిడ్డను పశువులు ఉండే చోట ఉంచవలసి వచ్చింది.
*అయినా.... అయినా... ఎప్పుడు కూడా, ఏవిషయంలో కూడా మరియ యోసేపును ఏదైనా మాట అన్నట్లు మనం వాక్యంలో చూడం.*

👉 ఈ సంబర్భంలో మరియ మౌనంగా ఉండటంమే మనం చూస్తాము. 
*యోసేపు వల్ల అన్ని కష్టాలు పడుతున్న సద్దుకుపోయింది, అన్నివిషయాలలో తన భర్తను అర్ధం చేసుకుంది.*

👉ముందస్తు విడిది చూడనందుకు ఉల్లిక్కిపడలేదు...
పశువుల పాకలో ఉంచినందుకు అవమానంగా భావించి ఎగిరిపడలేదు.
*అన్నిటా, అంతటా, తన భర్తను వెంబడిస్తూ, పరిస్థితులను అర్ధంచేసుకుంటూ మెలిగింది.మరియ... ఎంతో గొప్ప భార్య.*

      *క్రీస్తు పుట్టుకను ఆయన చిత్తానికి మరియ సమర్పణను మనము జ్ఞాపకం చేసు ఉన్నప్పుడు మనలను మనము దేవునికి సమర్పించు కుందాం. దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనము ఎటువంటి భయాన్నైనా ఎదుర్కొనవచ్చు*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...