ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(16 వ భాగము )

*ఎవరీ శిశువు – సమాధానకర్తయగు అధిపతి*

(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను  -  *సమాధానకర్తయగు అధిపతి*.)

మనిషికి నిత్యజీవమే గాక దేవునితోనూ, తోటి మానవునితోనూ సమాధానం కూడా అవసరం. అయితే సాతాను వలన భూమి మీద సమాధానమే లేని పరిస్థితి ఉన్నది.

*A. సమాధానం లేని స్థితి:* పుట్టిన శిశువుకు సమాధానకర్తయగు అధిపతి అని ఎందుకు పేరు పెట్టబడెను? పరిశీలన చేద్దాం. 

నేటి ప్రపంచం సమాధానం కోసం అర్రులు చాస్తున్నది. Peace is what the world is most desperate for today. కుటుంబాల్లో, సమాజంలో, దేశాలలో ఎక్కడ చూసిన ప్రజలంతా సమాధానం లేక అల్లాడి పోవుచున్నారు. ఎక్కడ చూసిన ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు మరియు తుపాకి కాల్పుల శబ్దాలు వినబడుచున్నాయి. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నారు. ఇదే పరిస్థితి ఆనాటి యెషయా కాలములో కూడా ఉన్నది. యూదా దేశంలో ఎక్కడ కూడా సమాధానంలేని పరిస్థితులు ఏర్పడినాయి. కారణం శత్రువులు యుద్ధపంక్తులు తీరి యూదా దేశాన్ని చుట్టుముట్టారు. 

(యెషయా 9:5  యుద్ధపు సందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.) 

అదేవిధంగా సాతాను ప్రభావంవలన ప్రపంచమంతా నేరాలతో పాపాలతో నిండిపోయింది. ఆదాము కుమారుడు కయూను హంతకునిగా మారినప్పటి నుండి మానవజాతి లెక్కలేనన్ని హత్యలను చూసింది. తప్పుచేయడానికి మొగ్గుచూపే మానవులు ఒకరితో ఒకరు సమాధానంగా లేరు, దేవునితోనూ సమాధానంగా లేరు. యుద్ధమేఘాలు అలుముకుని ప్రపంచంలో కూడా ఎక్కడ సమాధానం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితులలో తిరిగి ఈ లోకంలో సమాధానం స్థాపించుట కొరకు కుమారుడైన యేసు సమాధానకర్తయగు అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు.

*B. దేవుని సమాధానం భూమి మీదకు వచ్చు విధానం:* ఆ కుమారుని బలియాగం ద్వార ఈ లోకంలో సమాధానం స్థాపించాలని దేవుని సంకల్పం. (కొలస్సయి 1:20 ఆయన సిలువరక్తము చేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి  భూలోకమందున్నవైనను  పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో *సమాధానపరచు కొనవలెననియు* తండ్రి అభీష్టమాయెను.) 

పుట్టిన శిశువు పాప క్షమాపణను సాధ్యం చేస్తూ మానవజాతి కోసం తన జీవాన్ని అర్పించాడు. ఎందుకంటె, మన సమాధానం రావడం కోసం ఆయన తనపై శిక్షను వేసుకున్నాడు. (యెషయా 53:5  మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన *సమాధానార్థమైన శిక్ష* అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.) 

తన యొక్క శిలువ మరణం ద్వారా ఈ లోకంలో సమాధానం స్థాపించాడు.  దేవునికీ, మనుషులకూ మధ్య మహా ఘనుడైన శాంతి దూత క్రీస్తు. (ఎఫెసు 2:14 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.)

*C. యేసు ద్వారా మాత్రమే నిజమైన శాంతి:* మనసులో, హృదయంలో శాంతిని ఇచ్చేవాడు ఆయనే. (యోహాను 14:27 శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించు చున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.) 

అందుకే యేసు “సమాధానకర్తయగు అధిపతి” అని పిలువబడతాడని యెషయా ప్రవచించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సమాధానం, పాపాలకు క్షమాపణ సాధ్యమవుతాయి. కానీ అలాంటి ఆశీర్వాదాలు వాటంతటవే రావు. దేవుని యొద్దకు రావాలి. (కొలస్సి 1:22  తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును *సమాధానపరచెను.*

*D. ప్రభువు ఇచ్చు సమాధానం ఈ క్రింది విధానాల ద్వారా మనం పొందుకొనగలము.*

👉 *1. సువార్త ద్వారా సమాధానం:* దేవుని సువార్త వాక్యం మనకు సమాధానం ఇవ్వగలదు. అపొ కా 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు *సమాధానకరమైన సువార్తను* ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఎఫెస్సి 2:17  మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

👉 *2. ప్రభువుకు ఇష్టులైన వారికి సమాధానం:* మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండుట వలన ఆయన సమాధానం పొందుకొనగలం. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద *సమాధానమును* కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను;

👉 *3. విశ్వాసం ద్వారా సమాధానం:* రోమ 5:1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.

👉 *4. ఏకమనస్సు వలన సమాధానం:* 2కొరి 13:11  తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సు గలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధాన ములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

👉 *5. పరిశుద్దాత్మతో కూడిన మనస్సు వలన సమాధానం:* ఆత్మ ఫలములో సమాధానము కూడా ఉన్నది కాబట్టి ఆత్మ ద్వార సమాధానం కలుగును. శరీరానుసారమైన మనసు మరణమైతే ఆత్మానుసారమైన మనస్సు సమాధానమని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు. రోమా 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును *సమాధానమునై* యున్నది.

👉 *6. నీతి వలన సమాధానం:* యెషయా 32:17  నీతి సమాధానము కలుగజేయును. కీర్తన 85:10 నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.

👉 *7. దేవుని సహవాసం వలన సమాధానం:* యోబు 22:21 ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును.

*E. కుమారుని సమాధానం శాశ్వతమైనది:* “ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును.” (యెషయా 9:7) 

ప్రపంచానికి శాంతి ప్రబోధం కొరకు ఐక్యరాజ్యసమితి  ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. కుమారుడు భూమిపై ప్రపంచవ్యాప్త, సుస్థాపిత, *శాశ్వత సమాధానాన్ని* నెలకొల్పుటకే ఈలోకానికి వచ్చాడు.  కేవలం కుమారుని ద్వారా అనగా ఆయన ఇచ్చిన సువార్త ద్వారా మాత్రమే ప్రపంచానికి నిజమైన శాంతి సమాధానం దొరుకును. 

ఒక్కసారి దేవుని సమాధానం పొందుకున్నామంటే, యుద్ధాలు చేయు కత్తులతో గాని ఈటెలతో గాని ఇక పని లేదు అనగా యుద్ధం అనేది ఇక రాదు. యుద్ధాలకు ఉపయోగించు కత్తులను, ఈటెలను వ్యవసాయ పనిముట్లు నాగటి నక్కులు గాను మచ్చుకత్తులు గాను మార్చబడును. 

(యెషయా 2:4  వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.) 

దేవుని సమాధానం కలిగినవారు రాజకీయ, ప్రాంతీయ, జాతిపరమైన లేక ఆర్థికపరమైన తేడాల మూలంగా ద్వేషాన్ని పెంచుకోవడం అనేది ఇక జరుగదు. వారు సంఘం లోపలా వెలుపలా తమ పొరుగువారితో సమాధానకరమైన సంబంధాలు కలిగివుండడానికి కృషి చేస్తారు.   

ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి *పేరు* పెట్టబడును. ఈ ఐదు లక్షణాలుఒకే కుమారునిలో ఉన్నావి గనుక ఇదంతా ఒకే పేరుగా ఉన్నది.

పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు పాదాల యొద్ద ప్రార్ధించి సమాధానం పొందుకున్నట్లుగా ఈ క్రిస్మస్ పర్వ దినాలలో కుమారునికి ప్రార్ధన చేద్దాం సమాధానం కలిగి ఉందాం. సమస్త జ్ఞానమునకు మించిన  *దేవుని సమాధానము* యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలి యుండును గాక! ఆమెన్!

దైవాశ్శీసులు!

From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...