ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(24 వ భాగము )

*దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో సేవచేసిన అన్నా*
(అన్నా ప్రవక్తి - రెండవ భాగం)


(లూకా 2:37  దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను)

*4. అన్నా ఒక ప్రవక్తి ఉన్నది:* (లూకా 2:36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను.) 

ప్రవక్తలనగా దైవసత్యాలను దేవుని యొద్ద నుండి తెలిసికొని ప్రజలకు అందించువారు. 

(యేహెజ్కేలు 33:7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి యున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను).

దేవాలయంలో ఉన్న పరిసయ్యులు గాని యాజకులు గాని, శాస్త్రులు గాని ఆ బాలుడే మెస్సియా అని గ్రహించలేక పోయారు. కాని అన్నా దేవుని ఆత్మ ద్వారా గ్రహించగలిగింది కారణం *ఆమె ప్రవక్తి.* 

సమయానుకూలంగా నడిపించువాడు సమస్తం సమకూర్చువాడు ఆయనే. సరైన సమయానికి అన్నా పరిశుద్ధాత్మ దేవుని ద్వార దేవాలయంలోనికి నడిపించ బడినది.

రోమా 8:28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. 

దేవుడు తన పరిచర్యలో అనేక మంది పురుషులనే గాక స్త్రీలను కూడా ప్రవక్తలగా వాడుకున్నాడు. కారణం ఆయన పక్షపాతం లేని దేవుడు. 

మిర్యాము, హుల్దా, డెబొరా, ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలు దేవునికొరకు ప్రవక్తలగా అద్భుతమైన సేవ చేశారు.

*5. దేవాలయమును విడువని అన్నా:* దేవాలయమును విడువక అనగా దేవుని ఆలయంలో అన్నా అన్నివిధాల సేవలను అందిస్తోంది. 

దేవుణ్ణి సేవించాలంటే బలంగా, చురుకుగా ఉండడం, లేదా అన్ని చోట్లా శుభవార్త ప్రకటించాలనీ ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ ఉండడం తప్పనిసరి కాదు. వయస్సులో పెద్దవారగు వారికి ఇది ఎంతో ఆశీర్వాదకరమైన పరిచర్య. మందిరంలో ఏదోఒక పరిచర్య అందుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. అన్నా ఆరాధన మనకు ఎంతో మాదిరికరం. అందుకే అన్నా ప్రభు దర్శనం పొందగలిగింది. దావీదు కూడా చిరకాలం యెహోవా మందిరంలో నివసించాలని కోరుకున్నాడు. (కీర్తన 23:6 చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.)

*6. అన్నా ఆరాధన "ఉపవాసంతో కూడినది:* యూదులకు, సర్వసాధారణమైన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆమె ఉపవాస ప్రార్ధనలు కొనసాగేవి.   తన ఆధ్యాత్మిక జీవనం కోసం, శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు, దేవుణ్ణి వెతికేందుకు, స్వచ్ఛందంగా ఉపవాసం ఉండడం అని దీని అర్థం. 

(యోవేలు 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. కీర్తన 35:13 వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని; యెషయా 58:6,7 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము.) 

ఆధ్యాత్మిక జీవనానికి సహాయకరమైన సాధనాన్ని సరిగ్గా వాడకపోతే సహాయం చెయ్యడానికి అసలు ఆధ్యాత్మిక జీవనమే లేదని అది బయటపెట్టవచ్చు. మనుషుల మెప్పుకోసం ఉపవాసం ఉండడం విపరీతం, ఘోరం అని బైబిల్ సెలవిస్తున్నది. (మత్తయి 6:17 ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ     ముఖము కడుగుకొనుము.)

యేసు కూడా ఉపవాసం మంచిదనీ, తగిన పని అని భావించాడు. ఒకప్పుడు ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు (మత్తయి 4:1 అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా), 

తరువాత ఆయన శిష్యులు కూడా ఉపవాసం ఉంటారని చెప్పాడు(మత్తయి 9:15  పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు).   

ఏ రకం ఉపవాసానికైనా దేవుడు ఫలితం ఇవ్వడు గానీ సరైన ఉద్దేశంతో చేసినదానికే ఇస్తాడు. నిజమైన ఉపవాసం శిష్యునికి దేవునితో ఉన్న రహస్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఏం జరుగుతున్నదీ ఇతరులకు కనీసం ఊహించడానికైనా సాధ్యం కాకుండా ఉండాలి. 

*7.అన్నా ఆరాధన ప్రార్థనతో కూడినది:*  దేవుడు ప్రార్ధన ఎడతెగక చేయమన్నాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమి చేసారో నేడు ఈ శతాబ్దపు క్రైస్తవులైన మనము అదే చేయాలి. 

అనగా వాళ్ళు ప్రార్ధన చేశారు కనుక మనం కూడా ప్రార్ధన చేయాలి. దేవుడు మనలను ఎడ తెగక ప్రార్ధన చేయమన్నాడు అంటే అన్ని పనులు మానేసి కేవలం మోకాళ్ళు వంగి ప్రార్ధన చేయమని కాదు. సమయం ప్రకారం ప్రార్ధన చేయాలి ప్రతి పనిని ప్రార్ధనతో ప్రారంభించాలి. 

దేవుడు భక్తుల ప్రార్ధనలు మాత్రమే ఆలకిస్తాడు. ఆయన పాపుల ప్రార్ధనలు ఆలకించడు. (యోహాను 9:31- దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడై యుండి అయన చిత్తము చొప్పున జరిగించిన యెడల అయన వాని మనవి ఆలకించును.) 

ప్రార్ధన చేయమన్న దేవుడు పాపుల మనవి ఆలకించను అని అంటున్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకించను అని అన్నాడు అంటే పాపుల కూడా ప్రార్ధన చేస్తారని అర్థమవుతుంది. దేవుడు ఒక వ్యక్తి యొక్క మనవి ఆలకించాలంటే అతడు దైవ భక్తుడై ఉండాలి.  

మనం కూడా అన్నావలె మనము కూడా దేవాలయం కొరకు దేవుని పని చేసి ఉపవాస ప్రార్ధనలతో దేవునిని ఆనందపరచుటకు ప్రభువు కృప మనకు తోడై యుండునుగాక!

(అన్నాను గురించిన మరి కొన్ని విషయాలు రేపు చూద్దాం. To be continued...) 

 దైవాశ్శీసులు

From the desk of...
Pastor Jyothi Raju Vemula 
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU, Guntur dt.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...