బైబిల్ చివరి పేజీల్లోని మొదటి మ్యాపు అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశాలు ఏవి? అనే వివరాలను నేడు ఆ ప్రదేశాల యొక్క ఉనికిని మనము తెలుసుకుందాం...*💠
📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
💠 *బైబిల్ చివరి పేజీల్లోని మొదటి మ్యాపు అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశాలు ఏవి? అనే వివరాలను నేడు ఆ ప్రదేశాల యొక్క ఉనికిని మనము తెలుసుకుందాం...*💠
■ *ఊరు/ur:) - (ప్రస్తుత పేరు -గ్రేట్ జిగ్గురత్ ఆఫ్ ఉర్ )*
అబ్రహాము పుట్టిన ప్రదేశము, అబ్రహాము శారాయి పెండ్లి చేసుకొనిన తరువాత ఉరు అను గ్రామములో కాపురం ఉండెను(ఆది . 11:28-31). నేడు ఈ గ్రామం ఇరాక్ దేశపు దక్షిణ భాగములో నసిరియ(Nasiriyah)అను ప్రాంతములో ఉంది. ఇది ఇరాక్ రాజధాని బాగ్దాద్ నుండి దక్షిణం వైపు ౩౦౦ కి.మీ దూరంలో కువైట్ నుండి ఉత్తరం వైపు 150 కి.మీ దూరంలో ఉంది.
■ *హరాను/haran :) –(ప్రస్తుత పేరు –హర్రాన్)* (ఊరు నుండి 1200 కి మీ)
అబ్రహాము తండ్రియైన తెరహు మృతినొందింది ఇక్కడే (ఆది . 11: 31).
ఈ ప్రాంతం టర్కీ దేశoలోని దక్షిణ అనటోలియ భూభాగానికి చెందినది. ఇది టర్కి సిరియా సరిహద్దు రేఖ ప్రాంతములో అలెప్పో నగరానికి తూర్పున 180 కి.మీ దూరంలో ఉంది.
■ *షేకేము/shechem:) –(ప్రస్తుత పేరు – నాబ్లస్)* (హారను నుండి 878 కి మీ )
★*అబ్రహాము కు యెహోవా ప్రత్యక్షమైనపుడు బలిపీటాన్ని కట్టినది ఇక్కడే (ఆది 12 :6 )*. ఈ ప్రాంతం పాలస్తీనా దేశపు వెస్ట్ బ్యాంక్ భుబాగానికి చెందినది. ఇది మధ్యదర సముద్రానికి 30 కి.మీ దూరంలో జెరూసలేం నుండి ఉత్తరాన 50 కి.మీ మరియు నజరేతు నుండి దక్షిణాన 50 కి.మీ దూరం లో ఉంది.
■ *బెతేలు/bethel :) –(ప్రస్తుత పేరు – బైటిన్ )* (శేకేము నుండి ౩౦ కి మీ )
■ *హాయి /ai :) –(ప్రస్తుత పేరు –డయిర్ బిబ్విన్ )* (బెతేలు నుండి ౩ కి మీ )
ఈ రెండు ప్రాంతాల మధ్యలో అబ్రహాము గుడారము వేసి బలిపీటము కట్టాడు(ఆది 12 :8). ఈ ప్రాంతాలు పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ కి సంబందించినవి. జెరూసలేం నుండి ఉత్తరాన 15-18 కి మీ. దూరం లో ఉంటాయి.
■ *ఐగుప్తు/Egypt :) _(ప్రస్తుత పేరు – ఈజిప్ట్ )* (హాయి నుండి పడమటి వైపు ౩౦౦+కి.మీ )
బెతేలు –హాయి ప్రాంతము నుండి దక్షిణము వైపు ప్రయాణించాడు అక్కడ వచ్చిన కరువు కారణంగా, ఐగుప్తునకు అబ్రహాము వెళ్ళవలసివచ్చింది. అక్కడే శారయిని తన చెల్లి అని చెప్పడం ఫరో ఆగ్రహానికి గురై దేశ బహిష్కరణ కావడం జరిగింది(ఆది 12:10 -20). ఇక్కడ అబ్రహాము సరిగ్గా ఈజిప్ట్ లో ఏ ప్రదేశానికి వెళ్ళాడని తెలియదు కాని, ఈజిప్ట్ దేశములో ఎడారి పూర్తి అవ్వగానే పడమటిన వచ్చే చేదు సరస్సు తూర్పు భాగం లో సస్యస్యామలమైన మైదాన భూభాగాలు ఉంటాయి(నైలు నది పరివాహక ప్రాంతాలు). ఇక్కడినుండే నాడు ఫారో పరిపాలన జరిగేది గనుక, ఆది.కా.12:10 -20 బట్టి ఈ ప్రాంతం లోనే అబ్రహాము నివసించినట్టు గమనించవచ్చు.
■ *నేగేబు/negeb :) –(ప్రస్తుత పేరు– నేగెవ్)* (తిరుగు ప్రయాణం 200 కి మీ)
అబ్రహాము ఐగుప్తు నుండి వచ్చి ధనవంతుడిగా కొనసాగింది ఇక్కడే (ఆది.కా. 13:1), ఇది ఇశ్రాయేలు దేశానికి దక్షిణ భాగములో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గాజా పిరమిడ్ శ్రేణి కి 100 కి.మీ దూరంలో ఉంది. అక్కడినుండి మళ్ళీ 200 కి.మీ ఈశాన్యం వైపు ప్రయాణం చేసి బెతేలు – హాయి కి చేరుకున్నారు.
■ *సోదోమ/sodom-గోమోర్ర/Gomorrah :) –(ప్రస్తుత పేరు –ఈ ప్రాంతం సగం వరకు మృతసముద్ర నీటిలో మునిగి ఉండుట వలన నివాసం మరియు ఉనికి కలిగిలేదు)* (బెతేలు –హాయి నుండి 80 కి.మీ )
లోతు యోర్దాను ప్రాంతము తట్టు చూచి అటు వైపు ప్రయాణం చేయుచు సోదోమ గోమోర్ర తట్టు ప్రయాణం చేసెను (ఆది 13 :10).
★ప్రస్తుతం సోదోమ ఇశ్రాయేలు దేశం లోను , గోమోర్రః జోర్డాన్ దేశం లోను ఉన్నవి. ఈ రెండు ప్రదేశాల మధ్య నుండి జోర్డాన్ ఇస్రాయెల్ సరిహద్దు రేఖ ఉంటుంది.ఈ ప్రాంతం హేబ్రోను నుండి ఆగ్నేయంవైపు 50 కి.మీ దూరంలో ఉంటుంది.
■ *కనాను/Canaan :) –(ప్రస్తుత పేరు –ఫర్ మనహెం/kfar manahem)* ( బెతేలు-హాయి నుండి 45 కి మీ)
అబ్రహామును లోతు విడిపోయిన తరువాత అబ్రహాము నివసించిన ప్రదేశం ఇది. దేవుడు వాగ్దానం చేసిన కానను (వాగ్దన భూమి ) ఇక్కడి నుండి ఇరు వైపులా తూర్పు పడమరల వైపు వ్యాపించి ఉంటుంది.ఇది ఇశ్రాయేలు దేశపు ఉత్తర భాగం లో మధ్యధర సముద్ర తీరానికి 25 కి.మీ దూరంలో ఉంది.(గమనిక – ఇది పూర్తి కానను కాదు ).
■ *హేబ్రోను/Hebron :) –(ప్రస్తుత పేరు –హేబ్రోన్)* (కానాను నుండి 25 కి.మీ )
అబ్రహాము దేవుని మాట మేరకు హేబ్రోను లోని మమ్రే దగ్గర నివాసం ఏర్పరచుకున్నాడు(ఆది 13:18 ).ప్రస్తుతం హేబ్రోను ఇశ్రాయేలు దేశంలో బెత్లేహెం నుండి దక్షిణం వైపు 20 కి.మీ దూరంలో ఉంది. మమ్రే దగ్గర అబ్రహాం నివాసం యెద్ద నేడు హేబ్రోన్ యునివర్సిటిని మనం ప్రపంచ పటములో గమనించవచ్చు.
■ *దాను/Dan :)- (ప్రస్తుత పేరు –దాను)* ( హేబ్రోన్ నుండి 200 కి.మీ )
లోతు చెరపట్టబడెను అని తెలిసి అబ్రహాము తన మూడు వందల పన్నెండు మంది యోదులతో కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులతో యుద్ధం చేసి దాను వరకు వారిని తరిమాడు (ఆది 14:14).ఈ ప్రాంతం ఇశ్రాయేలు దేశ ఉత్తర సిరియా మరియు లేబనోను దేశాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. హీర్మోన్ కొండకు దక్షిణం వైపు 26 కి మీ దూరం లో ఉంది.
■ *హోబా/hobah :) –(ప్రస్తుత పేరు – బిజిన/bizina )* (దాను నుండి 81 కి మీ )
దాను వరకు ఆగకుండా సిరియా దేశంలోని దమస్కు పట్టణం దాటి ఆ రాజులను తరుముతూ ఈ హోబా వరకు వారిని పంపడం జరిగింది(ఆది 14:15).ఈ ప్రాంతం దమస్కు పట్టణానికి తూర్పున 20 కి.మీ దూరం లో ఉంది.
■ *శావే లోయ/vally of shaveh:) –(ప్రస్తుత నామం –డోమ్ ఆఫ్ ది రాక్/dom of the rock )* (హోబా నుండి 230 కి మీ)
రాజులను జయించి తిరిగి వచ్చుచున్నప్పుడు సోదోమ రాజు అబ్రహాంను ఎదుర్కొన్నది ఈ ప్రాంతం లోనే (ఆది 14 :17). ఈ ప్రాంతం ఇశ్రాయేలు దేశంలో జెరూసలేంకి కేవలం 1 కి.మీ దూరం లో ఉంటుంది.
■ *గేరారు/geror :) –(ప్రస్తుత పేరు- స్డాట్ నేగేవ్ రిజినల్ కౌన్సిల్/ Sdot Negev Regional Council)* (శావే లోయ నుండి 75 కి.మీ )
గేరారు ఇశ్రాయేలు దేశం లోని ఈ ప్రాంతoలో అబిమేలేకు రాజు పరిపాలించే దినములలో అబ్రాహాము కాపురం ఉన్నాడు (ఆది 20:1 ). ఈ ప్రాంతం గాజా శ్రేణికి 15 కి.మీ దక్షిణము వైపున ఉంటుంది.మధ్యధర సముద్రానికి అతి సమీపములో ఉన్న అబ్రహాము ప్రయాణ దేశాల్లో ఇది మొదటిది.
■ *బెయేర్షేబా/bersheba :)- (ప్రస్తుత నామం –బెర్ షేవ/Be’er sheva)* (గేరారు నుండి 30 కి.మీ )
అబ్రహాము బావి తవ్వి తన సాక్ష్యర్ధమై అభిమేలేకుకి 7 గొర్రెలను ఇచ్చి ప్రమాణము చేసికొనినది ఇక్కడే(ఆది 21:32). ఇశ్రాయేలు దేశపు మధ్య భాగంలో గాజా శ్రేణికి తూర్పున 40 కి.మీ దూరంలో ఉంటుంది.
■ *మోరియ/MORIAH :) –(ప్రస్తుత పేరు – టెంపుల్ మౌంట్ /డోమ్ ఆఫ్ ది రాక్ )* (బెయేర్షేబ నుండి 70 కి.మీ )
అబ్రహాము హేబ్రోనుకు తిరిగి వెళ్లకముందు నివసించిన చివరి ప్రాంతం. ఇక్కడే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చుటకు బలిపీటము సిద్దము చేసినది.ఈ ప్రదేశం గేత్సేమనే ప్రాంతానికి కేవలం అరకిలోమీటరు దూరం లోను, జెరూసలేంనకు తూర్పున 2 కి.మీ దూరంలోను ఉంటుంది.
*అబ్రాహాము ప్రయాణము చేసిన ప్రదేశముల వివరాలు మరియు ప్రస్తుతం ఆ ప్రదేశాల ఉనికిని బైబిల్ చివరి పేజీలోని పటాన్ని ఆధారంగా తీస్కొని వివరించడం జరిగింది...*
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*
📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి