అపోస్తలుడు పౌలు రెండవ సువార్త ప్రయాణము వివరణ
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
జతపనివారు : సీల, తిమోతి, లూకా
తేదీలు :
🟫🟫🟫🟫🟫🟫
క్రీ.శ. 50-52 (సుమారు రెండున్నర సంవత్సరములనుండి మూడు సం||)
ప్రయాణము చేసిన దూరము :
🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥
2,700 మైళ్లు పైగా (1,290 మైళ్లు సముద్ర ప్రయాణము మరియు 1,410 మైళ్లు భూప్రయాణము)
పట్టణమునకు, పట్టణమునకు మధ్య దూరము (మైళ్లలో సుమారుగా) :
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. సిరియాలోగల అంతియొకయనుండి కిలికియ ద్వారముల వరకు: 140
2. కిలికియ ద్వారములనుండి దెర్బేవరకు : 100
3. దెర్బేనుండి లుస్తవరకు :30
4. లుస్రనుండి ఈకొనియవరకు :30
5. ఈకొనియనుండి పిసిదియలోగల అంతియొకయవరకు: 85
6. పుగియ మరియు గలతీయ : 200
7. త్రోయవరకు : 200 +
8. త్రోయనుండి సూత్రాకేవరకు :70
9. సమొత్రాకేనుండి నెయపొలివరకు 70 :
10. నెయపొలినుండి ఫిలిప్పీవరకు :10
11. ఫిలిప్పీనుండి అంఫిపొలివరకు 30
12. అంఫిపొలినుండి అపొలోనియవరకు :35
13. అపొల్లోనియనుండి థెస్సలొనీకవరకు :40
14. థెస్సలొనీకనుండి బెరయవరకు: 50
15. బెరయనుండి సముద్రతీరమువరకు 20 :
16. ఏథెన్సువరకు : 250
17.ఏథెన్సునుండి కొరింథువరకు: 50
18. కొరింథునుండి కెంకేయవరకు: 8
19. కెండ్రేయనుండి ఎఫెసువరకు : 250
20. ఎఫెసునుండి కైసరయవరకు: 650 +
21. కైసరయనుండి యెరూషలేమువరకు :65
22. యెరూషలేమునుండి సిరియాలోగల అంతియొకయవరకు : 320 +
మొత్తం...............2,703
రెండవ ప్రయాణము : అపొస్తలుల కార్యములు 15-18 అధ్యాయములు
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. సిరియాలోగల అంతియొకయ (15:36-40)
🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫
మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవు విషయములో పౌలు మరియు బర్నబాలు ఏకాభిప్రాయములేనివారై తీవ్రమైన వాదము జరిగిన తరువాత వారు ఒకనిని విడిచి ఒకరు వేరై, బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లగా, పౌలు సీలను ఏర్పరచుకొనెను.
2. సిరియ మరియు కిలికియ (15:41)
🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥
ఈ దేశములలో పౌలు సంఘములను స్థిరపరచెను.
3. దెర్బే (16:1)
🟦🟦🟦🟦🟦🟦🟦
పౌలు దెర్బేకు వచ్చెను.
4. లుప్త (16:1-3)
🟨🟨🟨🟨🟨🟨🟨🟨
ఇచ్చటగల శిష్యుడైన తిమోతిని పౌలు సున్నతి చేయించి, తనతో వెంటబెట్టుకొని బయలుదేరెను.
5. ఆ యా పట్టణములకు (16:4, 5)
🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩
పేర్లు వ్రాయబడనప్పటికీ నిస్సందేహముగా పౌలు ఈకొనియ మరియు పిసిదియాలోగల అంతియొకయ, అదేవిధముగా దెర్బే మరియు లుస్త్ర మొదలగు పట్టణములు ప్రయాణించుచు యెరూషలేము పెద్దల సమావేశము నిర్ణయించిన ఉపదేశములను సంఘములకు బోధించెను.
6. ప్రగియ మరియు గలతీయ (16:6)
🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧
పౌలు, సీల మరియు తిమోతిలు ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రగియ మరియు గలతీయ ప్రదేశములలో వాక్యమును బోధించిరి.
7. ముసియ (16:7, 8)
🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪
ఇచ్చట పౌలు మరియు అతని జతపనివారు బితూనియకు వెళ్లుటకు ప్రయ త్నము చేసిరి గాని, యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
8. త్రోయ (16:8-10)
🌄🌄🌄🌄🌄🌄🌄🌄
అంతట వారు ముసియను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి – “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమ"ని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను.
9. సమోత్రాకే (16:11)
🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆
పౌలు మరియు అతని జతపనివారు త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సూమోత్రాకేకు వచ్చి, అక్కడ ఆ రాత్రి గడిపిరి. అదే సమయములో అనగా త్రోయలో లూకా వచ్చి వారితో కలిసెను. మరునాడు వారంతా నెయపొలికి వెళ్లిరి. (అపొ.కా. 16:10 లో "మేము" అని ఉన్నది గమనించండి),
10. నెయపొలి (16:11)
⬛⬛⬛⬛⬛⬛⬛⬛⬛
వారు సూత్రాకే నుండి నెయపొలి ఓడ రేవుకు, అక్కడనుండి ఫిలిప్పీకి వెళ్లిరి.
11. ఫిలిప్పీ (16:12-40)
💟💟💟💟💟💟💟💟💟
పౌలును అతని జతపనివారును ఫిలిప్పీకి వచ్చి, అచ్చట “కొన్ని దినములు” గడిపిరి. వారచ్చట ఉన్న సమయములోనే లూదియ క్రీస్తును విశ్వసించినది. మరియు ఈ పట్టణములో పౌలు పుతోను అను దయ్యము పట్టిన సోదె చెప్పు చిన్నదాని దయ్యమును వదలగొట్టెను. తత్ఫలితముగా పౌలును అతని జతపనివారును చెరసాలపాలైరి. తదుపరి పౌలును మరియు సీలయు ఆశ్చర్యకరంగా చెరసాలనుండి విడుదల పొందిరి. మరియు ఫిలిప్పీ చెరసాల అధికారికూడ క్రీస్తును అంగీకరించెను.
12. థెస్సలొనీక (17:1-9)
💛💛💛💛💛💛💛💛💛💛
వారు అంఫిబౌలి, అపొల్లోనియ పట్టణములమీదుగా వెళ్లి థెస్సలొనీక పట్టణము వచ్చిరి. యూదుల సమాజమందిరములలో మూడు విశ్రాంతి దినములు పౌలు బోధించగా యూదులలో కొందరును, గ్రీసు దేశస్థులలో చాలామంది విశ్వసించిరి. అయితే కొందరు యూదులు మత్సరపడి అల్లరి చేయగా రాత్రివేళ పౌలును సీలయు బెరయకు పారిపోయిరి.
13. బెరయ (17:10-14)
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
పౌలు బెరయలోని యూదుల సమాజమందిరములో బోధించగా అనేకమంది యూదులు మరియు గ్రీసుదేశస్థులు విశ్వసించిరి. అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. వెంటనే “సహోదరులు” పౌలును సముద్రమువరకు సాగనంపిరి. అయితే సీలయు, తిమోతియు అచ్చటనే నిలిచిపోయిరి.
14. ఏథెన్సు (17:15-34)
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
బెరయనుండి పౌలు ఓడలో ప్రయాణించి ఏథెన్సుకు చేరుకొని, సీల మరియు తిమోతిలకొరకు ఎదురుచూచుచు, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేక సమాజమందిరములలోను, యూదులతోను తర్కించి, ఎపికూరీయులలోను పోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులతో వాదించి ప్రభువైన క్రీస్తు పునరుత్థానమునుగూర్చి బోధించుచు వచ్చెను. చాలా కొద్దిమంది ఏథెన్సు నివాసులు విశ్వసించిరి. వారిలో అరేయొపగతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు కలరు.
15. కొరింథు (18:1-17)
💚💚💚💚💚💚💚💚💚
పౌలు కొరింథులో అకుల మరియు ప్రిస్కిల్లలను కలిసి, వారితో డేరాలు కుట్టు పనివాడుగా పనిచేసెను. యూదులతనిని వ్యతిరేకించువరకు సమాజమందిరములలో బోధించెను. అప్పుడు పౌలు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను. పౌలుద్వారా సమాజ మందిరపు అధికారియైన క్రిస్పును, అతని ఇంటివారును ప్రభువును విశ్వసించిరి. సీలయు మరియు తిమోతియు కొరింథులో పౌలుతోకూడ కలిసిరి. అప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొని వచ్చినప్పుడు అకయకు అధిపతిగా ఉన్న గల్లియోను న్యాయ విమర్శచేయుటకు అంగీకరించలేదు. పౌలు కొరింథులో సుమారు 18 నెలలపాటు నివసించెను.
16. కెండ్రేయ (18:18)
🍁🍁🍁🍁🍁🍁🍁
మ్రొక్కుబడియున్నందున పౌలు కెంకేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొనెను.
17. ఎఫెసు (18:19-21)
💐💐💐💐💐💐💐💐
అకుల మరియు ప్రిస్కిల్లలు పౌలుతోకూడ కెంకేయనుండి ఎఫెసుకు సముద్ర ప్రయాణము చేసిరి. ఎఫెసులోని సమాజమందిరములో పౌలు దేవుని వాక్యమును బోధించెను. వారింకను కొంతకాలముండుమని పౌలును వేడుకొనగా, అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మరల వత్తునని వారికి వాగ్దానము చేసెను.
18. కైసరయ (18:22)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అకుల ప్రిస్కిల్లలు ఎఫెసులో ఉండిపోగా, పౌలు కైసరయ రేవున దిగి యెరూషలేముకు వెళ్లి ఆ సంఘమువారిని కుశలమడిగెను.
19. సిరియాలోగల అంతియొకయ (18:22)
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
తరువాత పౌలు అంతియొకయ వెళ్లి, అచ్చటి సంఘమునకు తన సువార్త ప్రయాణమునుగురించి వివరించెను.
సేకరణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి