ఆదాము అవ్వ పాపము చేయక పొతే మనమందరము ఏదెను వనములోనే ఉండే వారమా?
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
దేవుడు కలిగించిన సృష్టిలో మానవుడు చాలా గొప్పవాడు. అలాంటి ఈ సృష్టిలో మానవునితో పాటు అనేక జంతువులను సృష్టించాడు. మానవుని కంటే జంతువులే ముందుగా కలిగించే నాటి అన్నిటి కంటే వెనుక పుట్టిన మానవుడిని మాత్రము అన్నింటికీ రారాజుగా దేవుడు నియమించారు. ఏదో వనము అనేది మొట్ట మొదటి నివాసముగా మనిషికి దేవుడు ఏర్పాటు చేసాడు. ఏదెను వనము ఒక అద్భుతమైన అందమైన వనము. దానికి దేవుని తోట అనే పేరు ఉండేది. ఇక ఈ తోటలో జంతువులూ మనిషి కలిసే నివసించేవాడు. అది మనము పాఠ్య పుస్తకాలలో చదువుకున్న ఆది మానవుడు కథ కాదు. మానవుడు పాపమును ఎరుగక దేవునితో సహవాసము కలిగి ఉండేవారు. దేవుడు సమస్తాన్ని కలిగించే అన్నింటిని తినమని చెప్పాడు. కానీ ఒకేఒక్క చెట్టు ఫలమును మాత్రము తిన వద్దని చెప్పాడు.కానీ మనిషిని అపవాది మోసము చేసి తినకూడదని చెప్పిన పండును తిని పాపము చేసేలా ప్రోత్సహించబడింది. తరువాత వారు పాపములో పడి దేవునికి దూరమై పోయారు. అయితే ఈ పాపము చేయకపోతే తరువాత పుట్టిన మనము అందరమూ ఏదెనులోనే ఉండేవారమా? అని ఆలోచిస్తే .... ఇక్కడ ఒక వాక్యము చూడాలి.
ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నింపినది లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
దేవుని ఉద్దేశ్యము ఒక్కటే మనుస్యులందరు ఈ భూమిని నిండించాలి. అలా నిండిన భూమిపై దేవుని ఆశలను తీర్చేవారుగా పిల్లలు ఉండాలి. వారు పరిశుద్ధులును నిర్దోషులుగా బ్రతికి తిరిగి రావాలన్నది దేవుని ఆశ. అలా ఆశించిన దేవుని ఆశను అపవాది నాశనము చేసాడు. ఒక వేళ పాపము చేయకుండా మనిషి బ్రతికి ఉంటె ఈ ప్రపంచం అంతా కూడా ఏదైనా వనములాగే ఉండేది. మనిషికి దేవునికి దూరము లేకుండా కలిసి అయనతో ప్రతి చల్ల పూట వేళ మనమంతా ఆనందించేవారము. దేవుని నివాసము మనుస్యులతో కూడా ఉండేది. మనుష్యులు ఎక్కువగా ఉండేవారు కారు. ఎందుకంటే మనుస్యులకు కామ వాంఛ ఉండేది కాదు. కేవలము దేవుని కొరకు మాత్రమే పిల్లలను కనే వారు. కానీ నేడు కామముతో కని పారేసేవారు ఎక్కువయ్యారు. దేవుని కోసం కానవలసిన మనిషి, తనకోసం కంటున్నాడు. వృద్దాప్యములో తోడుకోసం కంటున్నాడు. తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి కంటున్నాడు. దేవుడు కోసం పిల్లలను కనాలని ఆయన ఆశ. అందుకే మనిషికి క్రీస్తు వారి ద్వారా మరో ఛాన్స్ ఇచ్చారు. క్రీస్తు వారి ద్వారా తనకు పిల్లలు కావాలనుకున్నాడు. క్రీస్తు మరణం ద్వార మనలను మరో జన్మ ద్వారా కన్నాడు. మనలను దత్తపుత్రులుగా వివాహం చేసుకున్నాడు. ఆయనయందు విశ్వాసముంచిన వారికి నిత్యజీవము నిస్తానని చెప్పాడు. మనమందరము ఆ జీవమును పొందుకునే వారి లెక్కలో ఉన్నాము కూడా. ఇక మానవుని ఆయుస్సు మినిమం 1000 సంవత్సరాలు ఉండేది. బాలుడు అంటే 100 సంవత్సరాల వయస్సు కలిగిన వానిగా ఉంటాడు. 1 అచ్చము 1000 యేండ్ల పాలనలో ఉండేది. మనిషికి భౌతిక మరణం ఉండకుండా హనోకు ఏలియాలవలె ఆరోహణము అయ్యే విధముగా మనిషికి ముగింపు ఉండేది. ఇవన్నీ జరగాల్సింది, కానీ జరుగలేదు. వెయ్యేండ్ల పాలనలో ఇవి జరుగబోతున్నాయి. దేవునికి స్తోత్రము. ఇక మానవుని ఆయుస్సు మినిమం 1000 సంవత్సరాలు ఉండేది. బాలుడు అంటే 100 సంవత్సరాల వయస్సు కలిగిన వానిగా ఉంటాడు. అచ్చము 1000 యేండ్ల పాలనలో ఉండేది. మనిషికి భౌతిక మరణం ఉండకుండా హనోకు ఏలియాలవలె ఆరోహణము అయ్యే విధముగా మనిషికి ముగింపు ఉండేది. ఇవన్నీ జరగాల్సింది, కానీ జరుగలేదు. వెయ్యేండ్ల పాలనలో ఇవి జరుగబోతున్నాయి. దేవునికి స్తోత్రము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి