*పది ఆజ్ఞల రాతి పలకలు వాటి వివరాలు*
★(వీటి గురించి చాల తక్కువగా బయటి ప్రపంచానికి తెలుసు కాబట్టి ఈ విషయాన్ని అందరికి షేర్ చెయ్యండి)
మోషేకు సినాయ్ పర్వతం (ప్రస్తుత సౌదీ అరేబియా ) లో దేవుడు తన చే వ్రాతతో వ్రాసి ఇచ్చిన పది ఆజ్ఞలు గల రాతి పలకలను మోషే కాలం నుండి బహు జాగ్రత్తగా యూదులు కపాడుకొంటు వస్తున్నారు. అయితే ఇశ్రాయేలియులకు మిగితా జనంగాలకు చాలా సార్లు యుద్దాలు జరిగాయి. దాని వలన ఆ రాతి పలకలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా క్రీ.పూ.606, క్రీ.పూ.597 - 586 లో యూదులు పది ఆజ్ఞల రాతి పలకలను ఇశ్రాయేల్ నుండి బాబిలోనియా (ప్రస్తుత ఇరాక్) తీసుకెళ్లారు...
ఆ మధ్య ఆసియా దేశాల్లో ఇస్లాం ఆవిర్భావం ప్రారంభంలో మళ్ళీ ఇశ్రాయేలీయులు ఆ పలకలను మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు.
అయితే వాటి గురించి చాలా రోజుల తర్వాత బయటి ప్రపంచానికి తెలిసింది అవి ఎక్కడున్నాయనే సంగతి.
ఆ విషయం తెలుసుకున్న పురతత్వా శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించగా " పురాతత్వ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు, ఆ అధ్బుతమైన పదాలు చూసి
అంత చక్కని చెక్కడం పని , రాతి కళాకారులకు కూడా రాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు."
అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వచ్చిన ఎరిన్స్ మరియు ఇతర శాస్త్రవేత్తలు x- కిరణాలు మరియు కంప్యూటర్ విశ్లేషణలతో సహా పలు రకాల పరీక్షలు రాతి పలకలపై జరిపారు . "ఈ అక్షారాలు ఖచ్చితంగా అగ్నితో రాతిలో చొచ్చుకు పోయినట్టుగా ఉన్నాయి. ఇది లేజర్ తో అని చేయబడినది అని చెప్పలేను , ఇందులో అద్భత సాంకేతికత ను ఉపయోగించారు – ఇది పురాతన హెబ్రీయుల నైపుణ్యాలను మించినది అని మాత్రం చెప్పగలను". “అని బెర్లిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లుడ్విగ్ సేల్స్ అన్నారు.
ఆ రాతి పలకల పరిమాణం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడం కాయం వాటి బరువు కేవలం 913 గ్రాములు మాత్రమె
కాని మనం చుసిన చిత్రాల్లో (Photos/Videos) లో మోషే రెండు పెద్ద రాతి పలకలతో దర్శనం ఇవ్వడం గమనిస్తాం అది కేవలం మనకి అర్థం అయ్యేలా చూపడానికి మాత్రమె “ వాక్యదారాన్ని మనం తీస్కుంటే
నిర్గమ 32 :15. మోషే శాసనములుగల రెండు పలకలను “చేత” పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.
15. And Moses turned and went down from the mount, and the two tablets of the testimony were in his “hand”. The tablets were written on both their sides; on the one side and on the other were they written.
ఇక్కడ “చేత పట్టుకొని”(in his hand) ఏకవచనం గమనిస్తాం మరియు ఇరుప్రక్కల వ్రాయబడినవి గనుక ....... సో అవి చాల చిన్నవి అని తెలుస్తుంది.
పది ఆజ్ఞలు గల రాతి పలకలు చాలా దండయాత్రలు,యుద్దాలను ఎదుర్కొని దేవుని ఉనికికి గల ఆధారాలను సజీవ సాక్ష్యాలుగా నిలిపాయి...
ఇస్రాయెల్ దేశం పై ముస్లింల దండయాత్రల యుద్దాల ( Gulf War 2 August 1990 – 28 February 1991) ప్రభావ పుణ్యమా అని ఆ పలకలు మళ్ళీ ఇరాక్ (అప్పటి పర్శియ ) చేరుకున్నాయ్...
ఇరాక్ నుండి మళ్ళీ అమెరికా వారు తీసుకెళ్లారు...
ప్రస్తుతం భద్రత కారణాల దృష్ట్యా ఆ రాతి పలకలు అమెరికా లో శాస్త్రవేత్తల ప్రయోగాలకోసం భద్రపరిచారు...
●పది ఆఙ్ఞలు ఏవి?
పది ఆఙ్ఞలు అనేవి బైబిలులోని పది న్యాయసూత్రాలను దేవుడు ఇశ్రాయేలీయుల దేశపు ప్రజలకు వారు ఈజిప్టునుండి నిర్గమము చెందినపుడు త్వరితముగానే ఇచ్చినవి. ఈ పది ఆఙ్ఞలు పాతనిబంధనలోని న్యాయసూత్రములలో వున్న 613 ఆఙ్ఞల సారాంశమును సమకూర్చి ప్రాముఖ్యముగా విశ్లేషించినవి. మొదటి ఆఙ్ఞలు దేవునితో మనకున్న సంభంధ వ్యవహారాన్ని వివరిస్తున్నాయి. చివరి ఆరు ఆఙ్ఞలు ఒకరితో ఒకరికి ఉండవల్సిన సంభంధాన్ని వివరిస్తున్నాయి. పది ఆఙ్ఞలు నిర్గమకాండము 20:1-17 మరియు ద్వితియోపదేశకాండము 5:6-21 మరియు ఈ క్రిందనివ్వబడినవి:
1) “నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.” ఈ ఆఙ్ఞ ఈ సత్యమైన దేవునికి వ్యతిరేకముగా ఏ దేవుడిని ఆరాధించకూడదు, ఇతర దేవుళ్ళన్ని తప్పుడు దేవుళ్ళే.
2) “పైనున్న ఆకాశమందేగాని, క్రిందనున్న భూమియందే గాని భూమి క్రిందనున్న నీళ్ళయందేగాని, యుండు దేని పోలికైనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు: వాటిని పూజింపకూడదు. నీదేవుడైన యెహోవాయగు నేను రోషముగల దేవుడను: నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆఙ్ఞలను గైకొనువారి విషయములో వేయితరముల వరకు కరుణించువాడనై యున్నాను.” ఈ ఆఙ్ఞ ఒక విగ్రహమును చేయుట మరియు ఒక దృశ్యమైన దానిని దేవునికి ప్రత్యామ్నాయముగా కలిగియుండుటకు వ్యతిరేకమైనది. దేవునిని వర్ణించుటకు సరియైనది ఎటువంటిది ఖచ్చితమైన దానితో పోల్చలేము. దేవునికి బదులు ఒక విగ్రహాన్ని ఆరాధించుటకు పోల్చినట్లయితే అది తప్పుడు విగ్రహారధన అవుతుంది.
3) “నీదేవుడైన యెహోవా నామమును వ్యర్ధముగా ఉచ్చరించకూడదు: యెహోవా తన నామమును వ్యర్ధముగా ఉచ్చరించు వానిని నిర్ధోషిగా ఎంచడు.” ఈ ఆఙ్ఞ ప్రభువు నామమును వ్యర్ధముగా ఉచ్చరించుటకు వ్యతిరేకముగా చెప్పుతున్నది. మనము దేవుని నామమును చాల చులకనగా చూడకూడదు. దేవుని నామాన్ని కేవలము మర్యాదగాను మరియు గౌరవప్రదముగాను నుచ్చరించినట్లయితే మనము దేవునికి పూజ్యభావం చూపించినట్లవుతుంది.
4) “నీదేవుడైన యెహోవా నీ కాఙ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్దముగా ఆచరించుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీకుమార్తెయైనను నీదాసుడైనను నీదాసినైనను నీ యెద్దయైనను నీ గాడీదయైనను నీ పశువులలో ఏదైనను నీఇండ్లలోనున్న పరదేశీయైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్దపరచెను.” ఈ ఆఙ్ఞ సబ్బాతు దినమును ప్రత్యేకముగా ప్రక్కకు పెట్టి (శనివారము, వారము చివరి దినము) ప్రభువుకు ప్రతిష్టించవలెను.
5) “నీదేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీతల్లిని సన్మానించుము.” ఈ ఆఙ్ఞ ఎల్లప్పుడు ఒకరి తల్లిదండ్రులను ఘనతతోను మరియు గౌరవముతోను వ్యవహరించవలెనని చెప్పుతుంది.
6) “నీవు నరహత్య చేయకూడదు.” ఈ ఆఙ్ఞ మరొక తోటి మానవునిపై ముందుగా నిశ్చయించిన హత్యకు వ్యతిరేకముగా నున్నది.
7) “నీవు వ్యభిచరింపకూడదు.” ఈ ఆఙ్ఞ నీ సహచరిణితో తప్ప వేరొక వ్యక్తితో లైంగిక సంభంధముండకూడదు.
8) “నీవు దొంగిలించకూడదు.” ఒకని స్వంతముకానిదేదైన అదిఎవరికైతే చెందినదో ఆ వ్యక్తి అనుమతిలేకుండా తీసికొనుట ఈ ఆఙ్ఞకు వ్యతిరేకమైనది.
9) “నీ పొరుగువానిమీద అబద్ద సాక్ష్యము పలుకకూడదు.” మరొక వ్యక్తిపై తప్పుడు సాక్ష్యము నివ్వడం నిషేధించుట ఈ ఆఙ్ఞకు విరుద్దమైనది. ఈ ఆఙ్ఞ కేవలము అబద్ద మాడుటకు వ్యతిరేకము.
10) “నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అత్ని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.” ఒకని స్వంతముకానిదేదైన ఆశించుటకు వ్యతిరేకమైనది. అపేక్షించడం అనేది పైనున్న ఆఙ్ఞలలో ఒకదానిని అతిక్రమించినట్లే: హత్య, జారత్వము మరియు దొంగిలించడం. వాటిలో ఒకదానిని చేయుట ఎంత తప్పో, వాటిని ఆశించుట కూడా అంతే తప్పు.
చాలమంది ఈ పది ఆఙ్ఞలు అవి ఒక కట్టుబడితో కూడిన నిబంధనలు, వాటిని తప్పకుండ వెంబడించవలసిందే, మరణము తర్వాత పరొలోకములో ప్రవేశించుటకు తప్పనిసరి అని అభయమిస్తాయి. దానికి విరుద్దముగా, ఈ పది ఆఙ్ఞల ఉద్దేశ్యము ప్రజలను వారు ఖచ్చితముగా ఈ న్యాయనికి పూర్తిమత్వముతో విధేయత చూపించలేరని గ్రహించుటకు వారిని బలవంతపరుస్తుంది(రోమా 7:7-11), మరియు అందుచేత వారికి దేవుని యొక్క కృప మరియు దయ అవసరత చాలా ఉన్నది. మత్తయి 19:16 లోనున్న ధనికుడు యౌవనుడైన పరిపాలకుడు ఆరోపించినవాటికి విరుద్దముగా, ఏఒక్కరూ కూడా పూర్తిమత్వముతో ఈ పది ఆఙ్ఞలను విధేయత చూపించలేరు(ప్రసంగి 7:20). ఈ పది ఆఙ్ఞలను మనందరము పాపముచేసినవారమని తెలియపరుస్తున్నాయి(రోమా 3:23)మరియు అందుచేత వారికి దేవుని యొక్క కృప మరియు దయ అవసరత చాలా ఉన్నది, అది కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసముంచడము వలన దొరుకుతుంది.
సేకరణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి