ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అపోస్తులుడైన పౌలు యొక్క మొదటి ప్రయాణం

అపోస్తులుడైన పౌలు యొక్క మొదటి ప్రయాణం

జతపనివారు :: 

బర్నబా యోహాను మార్కు  

తేదీలు ::: క్రీ; శ 47-49 (2 సం.)  

ప్రయాణము చేసిన దూరము :: 1200 మైళ్లు  

పట్టణమునకు, పట్టణము వరకు మధ్యదూరము (మైళ్లలో) 

1.అంతియెకయనుండి సెలూకయ వరకు :15 మైళ్లు 
2.సెలూకయ నుండి సలమీ వరకు ::::: 100 మైళ్లు 
3.సలమీనుండి పాఫు వరకు ::::::: 113 మైళ్లు 
4.పాఫునుండి పెర్గే వరకు ::::::::: 175 
5.పెర్గేనుండి పిసిదియలో అంతియెకయ 100 
6.పిసిదియ నుండి ఈకొనియ వరకు: 85 మైళ్లు 
7.ఈకొనియనుండి లుస్త్రవరకు ::::::: 30 
8. లుస్ర్తనుండి దెర్బేవరకు :::: 30 
9.దర్బెనుండి లుస్త్రవరకు :::: 30 మైళ్లు 
10.లుస్త్రనుండి ఈకొనియవరకు 30 
11.ఈకొనియ పిసిదియలో అంతి: 85 మైళ్లు 
12.అంతియెకయనుండి పెర్గేవరకు :::::100 మైళ్లు 
13.పెర్గేనుండి అత్తాలియవరకు :: 20 మైళ్లు 
14.అత్తాలియనుండి సెలూకయవరకు :: 320 
15.సెలూకయనుండి అంతియెకయకు :: 15 మైళ్లు 
 మొత్తం ::: 1235 మైళ్లు  

అపో; కార్యములలో 

1.13,14 అద్యాయాలు 
2.అపో; కా 13: 4 
3.అపో: కా 13: 5 
4.అపో; కా 13: 6-12 
5.అపో; కా 13:13 
6.అపో; కా 13: 14-52 
7.అపో; కా 14: 1-5 
8.అపో; కా 14: 6-20 
9.అపో; కా 14: 20,21 
10.అపో; కా 14: 21-23 
11.అపో; కా 14: 21-23 
12.అపో; కా 14: 21-23 
13.అపో; కా 14: 24,25 
14.అపో; కా 14: 26 
15.అపో; కా 14: 26-28 

మొదటి ప్రయాణము : అపొస్తలుల కార్యములు 13, 14 అధ్యాయములు

1.సిరియాలోగల అంతియొకయ (13:1-3)

ఇచ్చట బోధకులుగా ఉన్న బర్నబా, సుమెయోను, లూకీయ, మనయేను.సౌలు అను ఐదుగురు ప్రవక్తలు ప్రభువును సేవించుచు ఉపవాసము   చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేక పరుచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి బర్నాబా,సౌలుల మీద చేతులుంచి వారిని పంపిరి. 

2. సెలూకయ (అపొస్తలుల కార్యములు 13:4)

కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి. 

3. సలమీ (13:5)

వీరు ఇచ్చట యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యమును ప్రచురించిరి. యోహాను మార్కు వీరికి ఉపచారము చేసెను. 

4.పాఫు (13:6-12)

పౌలును, అతనితోకూడ ఉన్నవారును పాఫు చేరువరకు బోధించుచు వచ్చిరి.ఇచ్చట గారడీవాడును, అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను యూదుడు వీరి పరిచర్యను విమర్శించి వీరిని వ్యతిరేకించెను. అందుచే పౌలు ఇతనిని కొంత
కాలముపాటు గ్రుడ్డివానిగా చేసెను.జరిగిన దానిని చూచి సెర్గి పౌలు అను అధిపతి ఆశ్చర్య పడి విశ్వసించెను. సౌలు పౌలుగా పిలువబడుట ప్రారంభమయ్యెను. 

5. పంఫూలియాలోనున్న పెర్లే (18:13)

ఇచ్చట యోహాను మార్కు వీరిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగివెళ్లెను. 

6. పిసిదియలోగల అంతియొకయ (13:14-52)

వీరు ఇచ్చట యూదుల సమాజమందిరములలో రెండు విశ్రాంతి దినములు బోధించగా, అనేకమంది విశ్వసించిరి. అయితే యూదులు వీరిని వ్యతిరేకించి
హింస కలుగజేసి ఆ పట్టణమునుండిబలవంతముగా వెళ్లగొట్టిరి. పౌలు యూదులను విడచి అన్యజనులకు సువార్తను బోధింప మొదలు పెట్టెను. 

7. ఈకొనియ (14:1-5)

పౌలు, బర్నబా ఈకొనియకు వచ్చి పరిచర్య చేయుచు ఇచ్చట   బహుకాలము గడిపిరి.  కొంతకాలము  తరువాత యూదులలోను అన్యజనులలోను కొందరు తమ అధికారులతో కలిసి వీరిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని
ప్రయత్నించగా వారాసంగతి తెలిసికొని లుకయోనియలోని లుస్త్రకు పారిపోయిరి. 

8. లుకయొనియలోని లుస్త్ర (14:6-20)

ఇచ్చట పౌలు పుట్టినది మొదలుకొని కుంటివానిగాయున్న వ్యక్తిని స్వస్థపరచేను.
ఇది చూచిన లుస్త్ర ప్రజలు పౌలును, బర్నబాను గ్రీకు దేవతలైన హెర్మే, ద్యుపతియని పౌలు జీవితము మరియు సువార్త ప్రయాణములు ఆరాధించ ప్రయత్నించిరి. ఈకొనియనుండి వచ్చిన యూదులు లుస్తవారితో ఏకమై పౌలును చంపవలెననుకొని, రాళ్లు రువ్వి అతనిని పట్టణము వెలుపలికి ఈడ్చుకొని పోయిరి. కొంత సమయమైన తరువాత పౌలు లేచి తిరిగి ఆ పట్టణమునకు వచ్చెను. మరునాడు వారు దెర్బేకు వెళ్లిరి. 

9. లుకయొనియలోని దెర్బే (అపొస్తలుల
కార్యములు 14:20, 21)

వీరు ఈ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసికొనిరి. 

10. లుస్త్ర (14:21-23)

పౌలు మరియు బర్నబాలు మరియొకసారి ఈ పట్టణమునకు తిరిగివచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి, ఈ సంఘములో వారికి పెద్దలను ఏర్పరచిరి. 

11.ఈకొనియ (14:21-23)

పౌలు మరియు బర్నబాలు మరియొకసారి ఈ పట్టణమునకు తిరిగివచ్చి.శిష్యుల మనస్సులను దృఢపరచి, ఈ సంఘములో వారికి పెద్దలను ఏర్పరచిరి. 

12. పిసిదియలోగల అంతియొకయ (14:21-23)

పౌలు మరియు బర్నబాలు మరియొకసారి ఈ పట్టణమునకు తిరిగివచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి, ఈ సంఘములో వారికి పెద్దలను ఏర్పరచిరి. 

13. పెర్లే (14:24, 25)

ఇచ్చట పౌలు మరియు బర్నబాలు “వాక్యమును బోధించి” అత్తాలియకు దిగి వెళ్లిరి. 

14. అత్తాలియ (14:26)

ఇక్కడనుండి పౌలు మరియు బర్నబాలు ఓడయెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై మొదట బయలుదేరిన సిరియాలోగల అంతియొకయకు తిరిగి వచ్చిరి. 

15. సిరియాలోగల అంతియొకయ (14:26-28)

ఇచ్చటికి వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించి చెప్పి, అచ్చట శిష్యులయొద్ద “బహుకాలము” గడిపిరి.
సేకరణ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...