*అపోస్తలుడు పౌలు రోమా ప్రయాణము*
,🎯🎯🎯🎯🎯🎯🎯
*జతపనివారు : లూకా, అరిస్తర్కు*
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
తేదీలు :
🎆🎆🎆🎆🎆
క్రీ.శ. 59-62 (సుమారు రెండున్నర సంవత్సరములు)
ప్రయాణము చేసిన దూరము :
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
2,130 మైళ్లు పైగా (1,920 మైళ్లు సముద్ర ప్రయాణము మరియు 210 మైళ్లు భూప్రయాణము)
పట్టణమునకు, పట్టణమునకు మధ్య దూరము (మైళ్లలో సుమారుగా) :
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
1. యెరూషలేమునుండి కైసరయవరకు: 65
2. కైసరయనుండి సీదోనుకు 70
3. సీదోనునుండి మూరవరకు : 500
4. మూరనుండి కీదువరకు : 130
5. క్నీదు నుండి సల్మోనేవరకు : 130
6. సల్మో నేనుండి మంచిరేవులు అను స్థలమువరకు 80 :
7. మంచిరేవులునుండి ఫీనిక్సువరకు 40 :
8. ఫీనిక్సునుండి కౌద ద్వీపమువరకు 50 :
9. కౌదనుండి మెలితేవరకు : 550
10. మెలితేనుండి సురకూ సైవరకు : 85
11. సురకూ సైనుండి రేగియువరకు : 85
12. రేగియునుండి పొతియొలీవరకు : 200
13. పొతియొలీ నుండి అప్పీయా సంతపేటవరకు : 100
14. అప్పియా సంతపేటనుండి త్రిసత్రములవరకు: 10
15. త్రిసత్రములనుండి రోమావరకు :35
...................,..........................................
2,130 +
రోమా ప్రయాణము : అపొస్తలుల కార్యములు 27, 28 అధ్యాయములు
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
1. యెరూషలేము (21:27 - 23:22)
🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩
గ్రీసు దేశస్థులను (త్రోఫిమును) దేవాలయములోనికి తీసికొనివచ్చి ఆ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయమునుండి అతనిని వెలుపటికి ఈడ్చి బంధించిరి.పౌలు జనసమూహముల ముందు తన పక్షమున తానే వాదించుకొనెను. మరునాడు సన్నైట్రెను సభయెదుట కూడ తన పక్షమున తానే వాదించుకొనెను. పౌలును అల్లరిజనసమూహము చంపవలెనని యత్నించుచుండగా పౌలు మేనల్లుడు రోమా అధిపతియైన శైదియ లుసియకు తెలియజేసెను. అంతట కౌదియ లుసియ పౌలును కాపాడవలెనన్న ఆలోచనతో కైసరయలోనున్న ఫొలిక్సునొద్దకు పంపెను.
2. కైసరయ (23:23 - 27:2)
🟥🟥🟥🟥🟥🟥🟥🟥
పౌలు విచారణ నిమిత్తము మొదట ఫేలిక్సు ఎదుటను, ఆ తరువాత ఫేసు ఎదుటను ఉంచబడెను. రాజైన అగ్రిప్పకూడ పౌలు విచారణనుగూర్చి వినెను. పౌలు యెరూషలేముకు తిరిగివెళ్లి యూదులముందు విచారింపబడుటకంటె, కైసరుకు తన వాదమును విన్నవించుకొనుట మంచిదని తలంచెను. అందుచే పౌలు రెండు సంవత్సరములపాటు కైసరయలోని చెరసాలలో ఉంచబడెను. తరువాత పౌలు కైసరయను వదలి లూకా, అరిస్తర్కు యూలి అను శతాధిపతితోపాటు రోమాకు బయలుదేరెను.
3. సీదోను (27:3)
🟪🟪🟪🟪🟪🟪
సీదోనులో పౌలు తన స్నేహితులను కలిసికొనుటకు యూలి అనుమతించెను.
4. మూర (27:4-6)
🟧🟧🟧🟧🟧🟧🟧
సీదోనునుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున ఓడను ఉత్తరమువైపుగానున్న కుప్రచాటున నడిపించి, తరువాత కిలికియకును, పంఫూలి యకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరిరి. మూరకు చేరిన తరువాత పౌలును అతనితో కూడ ఉన్న జతపనివారును ఓడ మారిరి.
5. క్నీదు (27:7)
🟨🟨🟨🟨🟨🟨
ఓడ అనేక దినములు నెమ్మదిగా ప్రయాణించి ఎంతో కష్టపడి క్నీదుకు చేరినది.
6. సల్మోనే (27:7)
✳️✳️✳️✳️✳️✳️
వీరంతా ఎంతో కష్టపడి క్నీదుకు చేరిన తరువాత, ఎదురుగాలులవలన వారు దక్షిణమువైపున ఉన్న క్రేతు చాటున సల్మోనే దరికి ఓడను నడిపించిరి.
7. మంచిరేవులు (27:8-15)
🎇🎇🎇🎇🎇🎇🎇
క్రేతుకు దక్షిణ తీరమున ఓడ ప్రయాణము బహు నెమ్మదిగా సాగెను. ఓడను లసైయ పట్టణమునకు సమీపమున లంగరు వేసిరి. శతాధిపతియైన యూలి
మరియు సువార్త ప్రయాణములు పౌలు చెప్పినది నమ్మక నావికుడును, ఓడ యజమానుడును చెప్పినది నమ్మి శీతకాలమును గడుపుటకు ఫీనిక్సునకు చేరిరి. అది నైఋతి వాయవ్యదిక్కుల తట్టునున్న క్రేతు రేవైయున్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతుదరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతుమీదనుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక కొట్టుకొనిపోయినది.
8.కౌద (27:16-44)
🟫🟫🟫🟫🟫🟫🟫🟫
ఓడ గాలికి కొట్టుకొనిపోయి క్రేతులోగల కౌద అను చిన్న ద్వీపమునకు చేరినది. ఓడ బద్దలు కాకుండా నావికులు త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడను బిగించి కట్టిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు వారు ఓడలోని సరుకులను పారవేసిరి. 14 రాత్రింబవళ్ళు ఓడ గాలికి కొట్టుకొనిపోయినది. చివరికి ఓడ మెలితేయొద్ద కూరుకొనిపోయినది గాని, అందులో ప్రయాణించుచున్న 276 మంది సురక్షితముగా దరికి చేరిరి.
9. మెలితే (28:1-11)
⬛⬛⬛⬛⬛⬛⬛⬛
అనాగరికులగు ఆ మెలితే ద్వీపవాసులు వారికి గొప్ప ఉపచారము చేసిరి. అక్కడ పౌలు చలికాచుకొనుచుండగా ఒక సర్పము అతని చేతిని పట్టినది కాని అతనికే హానియు జరుగలేదు. ఆ ద్వీపములో ముఖ్యుడైన పొప్లి స్నేహభావముతో వారికి మూడు దినములు ఆతిథ్యమిచ్చెను. పొప్లి తండ్రి జ్వరముతోను, రక్తభేది తోను బాధపడుచుండగా పౌలు ప్రార్థనచేసి అతనిని స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులుకూడ వచ్చి స్వస్థత పొందిరి. పౌలును అతని జతపనివారును శీతకాలమంతయు మూడు నెలలపాటు మెలితేలో గడిపిన తరువాత అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి సురకూసైకి చేరిరి.
10. సురకూసై (28:12)
🟦🟦🟦🟦🟦🟦🟦🟦
సురకూ సైలో ఓడ మూడు దినములు నిలిచినది.
11. రేగియు (28:13)
12. పొతియొలీ (28:13, 14)
💟💟💟💟💟💟💟💟
పౌలును అతని జతపనివారిని ఈ పట్టణపు సహోదరులు ఏడు దినములుండ వలెనని వేడుకొనిరి.
13. అప్పియా సంతపేట (28:15)
💛💛💛💛💛💛💛💛💛💛
రోమానుండి కొందరు సహోదరులు వచ్చి ఈ పట్టణములో ఉన్న పౌలును కలిసికొనిరి.
14. త్రిసత్రములు (28:15)
🧡🧡🧡🧡🧡🧡🧡🧡
ఈ పట్టణములోను రోమానుండి కొందరు సహోదరులు వచ్చి పౌలును కలిసికొనిరి.
15. రోమా (28:16-31)
💚💚💚💚💚💚💚💚
పౌలు రోమాలో “గృహనిర్బంధము”నందు రెండు సంవత్సరములుంచబడెను. ఇచ్చట పౌలు యూదుల అధికారులతో సంభాషించెను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి