ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తులు చేసిన తీర్మానాలు

*భక్తులు చేసిన తీర్మానాలు*
💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠


*1️⃣.రూతు తీర్మానం - (రూతు 1:16)* 

👉 (నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానించుకుంది ఓ మోయాబీయురాలు. అందుకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏమిటది? మెస్సీయాకు ఆమె పితరురాలు అయ్యింది. ఎంత గొప్పభాగ్యమో కదా!)


*2️⃣.సమూయేలు తీర్మానం - (1 సమూ 12:23)*

👉 (ప్రార్థన చేయుదును- లేనియెడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించుకున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల చరిత్రలో తనదైన శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మీరు చదివారా?) 


*3️⃣.యెహోషువ తీర్మానం - (యెహో 24:15)* 

👉 (ఇశ్రాయేలీయులు అసలే అస్థిరులు, స్థిరబుద్ధి గలవారు కారు, మూర్ఖపు ప్రవర్తన గలవారు. అలాంటివారి మధ్యలో - మీరెవరిని సేవింప కోరుకున్నను, నేనును నా యింటివారును యెహోవానే సేవిస్తాము అంటూ  తీర్మానించాడు. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ అవిధేయులూ, తిరుగుబోతులూ.. వాళ్ల మధ్యలో నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను అంటున్నావా? యెహోషువను చూడు)


*4️⃣.ఎస్తేరు తీర్మానం - (ఎస్తేరు 4:16)*

👉 (హామాను ద్వారా నాశనం అయ్యే పరిస్థితి రాగా ఆలస్యం చేయకుండా, అత్యవసరమైన పరిస్థితుల్లో నడుం కట్టి - నేనును నా పనికత్తెలును ఉపవాసముందుము అంటూ యూదులందరినీ తన ప్రార్థనలచే రక్షించుకున్న ధీరురాలైన వీరవనిత!) 


 *5️⃣.దావీదు తీర్మానం - (కీర్తన 132:4,5)*

👉 (ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దావీదు చేసిన తీర్మానం. యెహోవాకు నేనొక స్థలం చూచువరకు నా కన్నులకు నిదుర రానియ్యను. ఇదీ ఆయన చేసిన రోషం గల తీర్మానం. నీవు వెళ్లే మందిరంలో ఏముందో, ఏమి లేదో తెలుసుకొని దానికై ప్రయాస పడ్తున్నావా? లేక ప్రక్కకు తప్పుకుంటున్నావా?) 

👉 మరి ఒక విశ్వాసిగా నీ తీర్మానం ఏమిటి? ఈరోజు దేవునిలో బలమైన తీర్మానం తీసుకోలేకపోతే దేవుడు వచ్చినప్పుడు పశ్చాత్తాపపడిన ఉపయోగం ఉండదు. అందుకే సమయం ఉండగానే ఒక తీర్మానం తీసుకో. ప్రభువులో బలమైన సాధనంగా కట్టబడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక......

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...