ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాత నిబంధన యొక్క లేఖనముల మూలప్రతులు ఏ భాషలో వ్రాయబడినవి?

పాత నిబంధన యొక్క లేఖనముల మూలప్రతులు ఏ భాషలో వ్రాయబడినవి?
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
 క్రీస్తు పూర్వము చేపట్టిన లేఖనములు సేకరణలో లభించిన పురాతన లేఖనములు హెబ్రీ భాషలో ఉన్నవి.అందులోని కొన్ని అతి కొద్ది భాగములు మాత్రము ఆరాము (సిరియా) భాషలో ఉన్నవి.
ఈ పురాతన ప్రతుల్లోని భాషే మూలప్రదేశాలలో భాషగా ఉన్న పాతనిబంధన లేఖనాల మూలప్రతులన్నీ హెబ్రీ భాషలో వ్రాయ బడినట్లు భావించవలసియున్నది. 

పాత నిబంధన లేఖనముల మూలప్రతులను హెబ్రీ భాషలో వ్రాశారని విశ్వసించుటకు కొన్ని కారణములు సైతము కలవు.పంచకాండముల గ్రంథకర్త మోషేగారు అని క్రీస్తు పూర్వము కొన్ని శతాబ్ధముల కాలము నుండి యూదుల్లో అచంచలమైన నమ్మకము ఉన్నది.అలాంటి మోషే గారు గ్రీకు మార్పు నేర్చినప్పటికీ స్వతహాగా హెబ్రీయుడు.అందువలన ఆయన హెబ్రీ భాషలోనే పంచగ్రంథములను రచించినట్లు విశ్వసించు చున్నారు.యూదు లేఖనముల్లో అతిపురాతన మైనవి క్రీస్తు పూర్వము 1300 సంవత్సరముల కాలము నాటివి.ఇది మోషేగారి కాలము తరువాత సుమారు ఒకటిన్నర శతాబ్ధ కాలము. దీనిని బట్టి పాతనిబంధన లేఖనముల్లో పంచ కాండముల మూల ప్రతులు హెబ్రీ భాషలోనే వ్రాసియున్నారనిగట్టిగా విశ్వసిస్తున్నారు.అలాగే మిగిలిన గ్రంథములను కూడ హెబ్రీ భాషలోని వ్రాసియున్నారని, క్రీస్తు పూర్వము నందు సేకరించిన యూదు లేఖనములన్నీ మూలప్రతులకు తిరగరాయబడిన ప్రతులను విశ్వసిస్తున్నారు. 

పాత నిబంధన లేఖనముల్లో ఆరాము భాషా పాత నిబంధన లేఖనముల మూల ప్రతుల్లో కొన్ని భాగములు ఆరాము భాషలో కనిపించవు.
ఎజ్రా, యిర్మీయా మరియు దానియేలు గ్రంథములందు కొన్ని అధ్యాయములు ఆరాము భాషలో ఉన్నవి. 

ఎజ్రా 4: 8 నుండి 6:18 వరకు, 7: 12 - 26,
 యిర్మీయా గ్రంథమందు 10:11 మరియు దానియేలు గ్రంథమందు 2: 4 నుండి 7: 28 వరకు ఆరాము భాషలో వ్రాయబడి యున్నవి. 

తర్జుమా సమయములో ఈ భాగములను సైతము అనువదించిన తెలుగు భాష బైబిలు యందు ఆ భాగములను సులువుగా గుర్తించగలము.
అయితే ఆయా వచనములను క్షుణ్ణముగా పరిశీలించుట ద్వారా అక్కడ ఆరాము భాష వచనములు ఉన్నవనే విషయమును గ్రహించుట.
"అర్తహశస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారు పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి.ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము పొందినది" 

ఎజ్రా 4: 7
పైల లేఖనములో ఉన్నది దీనినే కల్దీయుల భాష అని కూడా అందురు.
ఎజ్రా 4: 8 నుండి వ్రాయబడిన భాష మాట్లాడే విషయమును దాని ముందు వచనము స్పష్టము చేయుచున్నది. అలా వ్రాయబడిన ఉత్తరములోని విషయము 
ఎజ్రా 6: 18 వరకు కొనసాగుతుంది.*.
"రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను" 

ఎజ్రా 7: 12 ఎజ్రా 4: 7 యందు అర్తహషస్తకు వ్రాసి పంపబడిన ఉత్తరము సిరియా (ఆరాము) భాషయందు వ్రాయబడియున్నది. 

అనగా అర్తహషస్త ఆరాము భాషవాడనే విషయము గ్రహించగలము.
ఎజ్రా 7: 12 నందు ఎజ్రాకు అర్తహషస్త పంపిన తాకీదులలో కూడ ఆరాము భాషయే ఉండునని గ్రహించగలము.ఆ తాకీదులోని విషయము 26 వ వచనము వరకు కొనసాగుతుంది. 

* "కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి -" దానియేలు 2: 4 పై వచనము ఆధారముగా సిరియా (ఆరాము) భాషలో ఒక విషయం చెప్పబడుచున్నది అనే సూచనను గ్రహించగలము.
దానియేలు 2: 4 యందు ఆరాము భాషలో అలా మొదలైన లేఖన భాగములు
దానియేలు 7: 28 వరకు కొనసాగును. 

ఆ విధముగా పాతనిబంధన లేఖనముల్లో ఎజ్రా, యిర్మీయా మరియు దానియేలు గ్రంథములయందు కొన్ని భాగములు ఆరాము భాషయందు కనిపించవు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...