*పతనమైన దేవదూతలను గూర్చిన 20 సత్యములు*
🎯🎯🎯🎯🎯🎯🎯
1. పతనమైన దేవదూతలు పేర్లు కలిగియుండెదరు. లూకా 8:30; ప్రక.9:11
2. వీరు మాట్లాడెదరు,
లూకా 4:34,41; 8:28;మత్తయి 8:29; మార్కు5:12; అపో19:15;మార్కు 3:11
3. వీరికి యేసు ఎవరో తెలియును.
లూకా 4:34
4. వీరికి భవిష్యత్తులో జరగబోవు
నాశనమునుగూర్చి తెలియును.
మత్తయి 8:29
5. వీరికి రక్షింపబడనివారి మధ్యగల
రక్షింపబడినవారు తెలియును.
ప్రకటన 9:4
6. వీరు సాతానును ఘనపరచుచు
క్రమబద్ధమైన మతధర్మశాస్త్రమును
రూపొందించు సామర్థ్యము గలవారు.
1 తిమోతి 4:1
7. వీరు గొప్ప బలము, శక్తి
కలిగియుండెదరు.నిర్గమ. 8:7; 7:11, 12;
దానియేలు 10:13;మార్కు:2-4; 9:17-26;
అపొ. 19:16; 2 కొరి.10:4,5; ప్రక. 9:15-19
8. వీరు భయపడెదరు.
లూకా 8:28;యాకోబు 2:19
9. వీరు ఏవగించుకొనెదరు.
అపొ.కా. 16:15
10. వీరిలో కొందరు బంధింపబడనివారు కలరు.
ప్రస్తుతము జరుగుచున్న కాలములో వీరికి
కొంత స్వేచ్చ గలదు.
ఎఫెసీయులకు 6:12;కీర్తనలు 78:49,
ప్రకటన 12:7-9
11.వీరిలో కొందరు బంధింపబడినవారు కలరు.
ప్రస్తుతము జరుగుచున్న కాలములో వీరికి
స్వేచ్ఛ లేదు.
2 పేతురు 2:4
12. ఈ ప్రపంచములోని రాజ్యములను యేలు
కొన్ని దయ్యపు దూతలు గలవు.
దానియేలు 10:13
13. "సేన” అను దుష్టుడైన దేవదూత ఒకడు
అనేక అపవిత్రాత్మలకు నాయకుడై గెరాసేనుల
దేశమందు ఒక మనుష్యునికి పట్టెను.
మార్కు5:9
14. పాతాళము అబద్దాను (హెబ్రీ భాషలో)
(గ్రీకు భాషలో 'అపొల్లుయోను') అను పతనమైన
దూత చెప్పుచేతలలో ఉండును.
ప్రకటన 9:11
15. నలుగురు పతనమైన సైనిక దూతలు నరకాత్మ
కులైన 20 కోట్ల మంది సైన్యములను శ్రమల
కాలము కొంత గతించిన తరువాత మనుష్యులలో
మూడవ భాగమును చంపుటకు నడిపించెదరు.
ప్రకటన 9:16
16. ఈ నలుగురు దూతలు ప్రస్తుతము యూఫ్రటీసు
మహానది యొద్ద బంధింపబడియుండిరి.
ప్రకటన9 :14
17.మరికొందరు దూతలు పాతాళలోకమందలి
కటిక చీకటిగల బిలములలో బంధింపబడి
యుండిరి.
2 పేతురు 2:4;యూదా 6
18. హార్మెట్టోను యుద్ధమునకు దారితీయు
పరిస్థితులను మరియు సంఘటనలను మూడు
అపవిత్రాత్మలు నడిపించును.
ప్రకటన 16:13, 14
19. పతనమైన దేవదూతలకు ప్రభువైన క్రీస్తు
మరియు అయనయొక్క సంఘము తీర్పుతీర్చును. 1 కొరింథీ. 6:3
20. చివరికి వీరిని దేవుడు నిత్యనరకాగ్నిలో
పడద్రోయును
యూదా 6; 2 పేతురు 2:4,మత్తయి 25:41
హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి