*బైబిల్ లో ఉన్న బహుమతులు*
1. *అబ్రహం మెల్కీసెదెకుకు ఇచ్చిన బహుమతి (ఆది 14:20)*
A. *ఇచ్చిన బహుమతి:-* అబ్రాహాము తనకు కలిగియున్న అంతటిలో పదియవవంతు ఇచ్చెను.
B. *ఇచ్చుటకు కారణము:-* ఎరుషలేము యొక్క ప్రప్రథమ పాలకుని ఎడల గౌరవము చూపించుటకు
2. *యాకోబు ఏసావుకి ఇచ్చిన బహుమతి (ఆది 32:13-15)*
A. *ఇచ్చిన బహుమతి:-* 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడు గాడిదలు, 10 గాడిద పిల్లలు.
B. *ఇచ్చుటకు కారణము:-* అతడు చేసిన మోసమును కప్పిపుచ్చుకునేందుకు
3. *ఇశ్రాయేలీయులలో గల 12 గోత్ర ప్రధానులు ప్రత్యక్ష గుడారము యొక్క సేవకై ఇచ్చిన బహుమతులు (సంఖ్యా 7:12-89)*
A. *ఇచ్చిన బహుమతులు:-* ప్రతి గోత్రపు వారును పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల యెత్తుగల వెండి గిన్నె, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్ర, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండి, ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తి, దహన బలిగా ఒక చిన్న కోడె, ఒక చిన్న పొట్టేలు, ఏడాది గొర్రెపిల్ల, అపరాధ పరిహారార్ధబలిగా ఒక మేక పిల్ల, సమాధానబలిగా రెండు కోడెలు, ఐదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలు, తమ అర్పణముగా తెచ్చిరి.
B. *ఇచ్చుటకు కారణము:-* దేవుని సంతోషపరచుటకు
4. *షేబ దేశపు రాణి సొలోమోను మహారాజుకు ఇచ్చిన బహుమతులు (1 రాజులు 10:1,2,10)*
A. *ఇచ్చిన బహుమతులు:-* 240 మణుగుల బంగారము (సుమారు 15,75,00,000 విలువ) బహు విస్తారమైన గంధవర్గము, రత్నములు
B. *ఇచ్చుటకు కారణము:-* ఇశ్రాయేలు, షేబ దేశముల మధ్య మంచి సంబంధములు నెలకొల్పుటకు
5. *రాజగు బెల్షస్సరు దానియేలుకి ఇచ్చిన బహుమతి (అయితే దానియేలు ఈ బహుమతిని తీసుకొనుటకు నిరాకరించెను) (దాని 5:16-17)*
A. *ఇచ్చిన బహుమతులు:-* ఊదా రంగు వస్త్రము కట్టుకొని, మెడను సువర్ణ కంట భూషణం ధరించుకొని రాజ్యములో మూడవ అధిపతిగా నియామకం.
B. *ఇచ్చుటకు కారణం:-* గోడమీద దేవునిచే వ్రాయబడిన చేతివ్రాత చదివి దాని భావము తెలియజేయవలెను.
6. *సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఇచ్చిన బహుమతి (2 రాజులు 5:4-6)*
A. *ఇచ్చిన బహుమతులు:-* 20 మణుగుల వెండి (విలువ సుమారు తొమ్మిది లక్షలు) 1,20,000 రూపాయల విలువ గల బంగారం, పది దుస్తుల బట్టలు (విలువ సుమారు 27,00,000 రూపాయలు)
B. *ఇచ్చుటకు కారణము:-* అతని సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠురోగము బాగు చేయవలెను.
7. *తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తుకు ఇచ్చిన బహుమతులు (మత్తయి 2:11)*
A. *ఇచ్చిన బహుమతులు:-* బంగారము, సాంబ్రాణి, బోళము
B. *ఇచ్చుటకు కారణం:-* పరలోకపు రాజును స్తుతించి, పూజించుట
8. *బేతనియ మరియ ప్రభువైన క్రీస్తు ఇచ్చిన బహుమతి (యోహాను 12:2-8; మత్తయి 26:7-13)*
A. *ఇచ్చిన బహుమతి:-* మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర.
B. *ఇచ్చుటకు కారణం:-* రక్షకుని యెడల ఆమెకు గల ప్రేమను వ్యక్తపరచి, ఆయనను అభిషేకించుట
9. *పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుకు ఇచ్చిన బహుమతి (లూకా 7:37,38)*
A. *ఇచ్చిన బహుమతి:-* ఒక బుడ్డెడు అత్తరు
B. *ఇచ్చుటకు కారణము:-* ప్రభువైన యేసునుండి పాపక్షమాపణను అర్ధించుట కొరకు
10. *శ్రమలకాలములో దుష్టులైన అవిశ్వాసుల ఒకరికొకరు ఇచ్చుకొను బహుమతులు (ప్రకటన 11:10)*
A. *ఇచ్చుకునే బహుమతులు:-* బహుశా మధ్యము, మాదక ద్రవ్యాలు, అశ్లీల సాహిత్యము మొదలగునవి కావచ్చు.
B. *ఇచ్చుకొనుటకు కారణం:-* దేవుని యొక్క ఇద్దరు సాక్షులు చనిపోగా వారు సంతోషముగా ఉత్సహించుకొనుట కొరకు
11. *విశ్వాసి దేవునికి ఇచ్చే బహుమానం (రోమా 12:1-3)*
A. *ఇచ్చు బహుమతి:-* సజీవ యాగముగా తన శరీరమును సమర్పించుట
B. *ఇచ్చుటకు కారణము:-* తన జీవితములో విశ్వాసి దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుట కొరకు
12. *తండ్రి అయిన దేవుడు భూలోకమునకు ఇచ్చిన బహుమతి (యోహాను 3:16; 2 కోరింది 9:15)*
A. *ఇచ్చిన బహుమతి:-* ప్రభువైన యేసుక్రీస్తు
B. *ఇచ్చుటకు కారణము:-* తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకు.
13. *కుమారుడైన దేవుడు తన గొర్రెలకు ఇచ్చిన బహుమతి (యోహాను 10:11; 14:3)*
A. *ఇచ్చిన బహుమతి:-* మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును.
B. *ఇచ్చుటకు కారణము:-* నేను ఉండే స్థలంలో మీరును ఉండులాగున
14. *పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు ఇచ్చిన బహుమతులు (రోమా 12:6-8; 1 కోరింది 12:4-31; ఎఫేసి 4:7-16)*
A. *ఇచ్చిన బహుమతులు:-* కృపావరములు
B. *ఇచ్చుటకు కారణం:-* తండ్రియైన దేవుని మహిమ పరచుటకొరకు, సంఘము మరియు విశ్వాసి ఆత్మీయ వికాసము పొందుటకు....
Note:- ప్రియ దేవుని బిడ్డలారా పైన చెప్పబడిన సంగతులను బట్టి మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు... కొంతమంది వారికి నచ్చిన వారికి బహుమానాలు ఇచ్చారు... అలాగే మన పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి మనకు బహుమానంగా ఇచ్చాడు... కాబట్టి నీవు నేను దేవునికి ఏమి ఇస్తున్నాము అనే దానిని మనం గ్రహించాలి... ప్రభువు కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన సర్వస్వాన్ని ధార పోయాలి...ఆయన కొరకు మనం మనకు కలిగినది ఇచ్చినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి