ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పౌలు జీవిత చరిత్ర:-

పౌలు జీవిత చరిత్ర:- 

కిలికియాలోని తార్సు పట్టణంలో పౌలు జన్మించాడు.  

 తార్సు:- 

తార్సు పట్టణమును అపోస్తులుడైన పౌలు గొప్ప పట్టణముగా పిలిచేను. అపో 22: 3 మరియు 11:25 పరీక్షలిస్తే, ఇది చిన్న ఆసియాదేశములోని కిలికియా అను రాష్ర్టములో ఈ తార్సు పట్టణము కలదు. కిలికియా రాష్ట్రానికి తార్సు పట్టణము రాజధానిగా ఉండేది. పౌలు నాటి కాలములో ఈ పట్టణ జనాభా సుమారు 5 లక్షల మంది అని పండితులు అంచనా వేసిరి.  

ఈ పట్టణము గొప్ప పట్టణముగా ప్రసిద్ధి చెందడానికి కారణములు :- 

(ఎ) ఇది వ్యాపారమునకు ప్రసిద్ధి చెందినది 
(బి) కలపడం, మేక, వెంట్రుకలు, వ్యాపారము, ఎక్కువగా జరిగేది. 
(సి) తార్సు పట్టణమునకు సమీపములో సిడ్నిస్ అనే నది కలదు. 
(డి) ఈ నది తీరమున ఒక గొప్ప ఉండుట వలన దీని గుండా తూర్పు పడమటి దేశములకు వ్యాపారము నిత్యము పోవుచుందిరి, 
అతి తక్కువకాలములో ఈ పట్టణము అభివృద్దిచెందడానికి ఇది మెుదటి కారణము.  

(2) ఇది థనవంతులతో నిండిన పట్టణము 
 ఈ పట్టణము అభివృద్ది చెందడానికి విశేష వర్తక వ్యాపారము వలన ఈ పట్టణము ధనవంతులతో నిండియున్నది. ఈ పట్టణములో పుట్టినవాడైన పౌలు కూడా గొప్ప థనవంతుడుగా ఉండెను.  

(3) ఇది వేదాంత విద్యకు అనువైన ప్రాంతము :- వేదాంత విద్యకు కూడా ఇది గొప్ప కేంద్రము ఆనాటి దినములలో తూర్పు దేశాలలో గల 3 గొప్ప కళాశాలలో ఒకటి తార్సులో ఉంది. 
మిగిలిన రెండు కళాశాలలు అలెగ్జాండ్రియాలోను, ఏధేన్స్ లోను ఉన్నది. విద్యార్ధులు అనేక దేశములలో నుండి ఇచ్చుటకు వచ్చి వివిధ విద్యలలో శిక్షణ పొందుచుండెడివారు, 
అందుచేతనే పౌలు కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడనని ఆ గొప్ప ఓడరేవు పట్టణపు పౌరుడనని సగౌరముగా ఈ పట్టణమును గూర్చి చెప్పుకొనెను. ఒకప్పుడు ఈ పట్టణము రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూ వారి యెక్క ఆదిపత్యములో ఉండేది. కొంతకాలము వరకు మార్కు యాంటోని అను చక్రవర్తి దీనిని స్వాతంత్ర్య దేశముగా చేసి పన్ను కట్టనవసరము లేకుండా చేసెను.  

పౌలు అనుమాటకు చిన్న వాడు అని అర్థము .
క్రీ.శ 30 సం.ప్రభువైన యేసు మరణం - ఆరోహణం - ఆదరణ కర్తయైన పరిశుద్దాత్మ భూలోకానికి పంపబడడం భూటకమని భావించాడు .
 పౌలు నూటికి తొంబది పాళ్ళు క్రీస్తు అని క్రిసోష్టమ్ అని పలికెను.మతోద్దారణ చరిత్ర మార్టిన్ లూథర్ లోను, హిందుదేశ స్వాతంత్ర్య తము, గాంథీజీతోను కలిసి ఉన్న క్రైస్తవ సంఘచరిత్ర క్రైస్తవ సిద్దాంతముల ప్రారంభము పౌలు అను పేరుతో పెనవేసుకొని యున్నది.  

ఈ మేథావి తనకు గల సర్వశక్తులను థారబోసి 14 సంవత్సరముల కాలములోని నాలుగు రాష్ర్ట ములలో చిన్న ఆసియా, గలలియా, మకదోనియా & అకయ అను రాష్ట్రములలో సంఘములను స్థాపించడానికి స్దిరపరచగలిగాడు. ఈ పండిత శ్రేష్టుడు సంఘములకు వ్రాసిన పత్రికలు హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథములో ఒక భాగమై నేటికిని సర్వలోకమునకు అనుదినము దైవసందేశము ఇచ్చుచున్నది.  

ఈ భక్తునికి ఉన్న పేర్లను మనం గమనించినెడల: పరిశుద్ధుడు, పండితొత్తముడు, వీరుడు, త్యాగి, అపోస్తులుడు, ప్రవక్త, వేదాంతి వంటి పేర్లు ఈ భక్తునికి కలవు. అపోస్తులుడైన పౌలు జీవితం థ్యానించుట మనకు చాలా మంచిది.  

యవ్వనమైన పౌలు : 

తాను ఒక నిష్టగల పరిశుద్దుడు గాను , ఇస్రాయేలీయుడుగాను ధర్మశాస్త్రం (ఓల్డ నిబంధన) ప్రకారం అనింద్యుడిగాను జీవించి గమాలియేలు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించి క్రైస్తవాన్ని రూపుమాపడం కోసం క్రైస్తవులను హింసిస్తున్నట్లుగా విశ్వసించాడు ."నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీలు పాదముల యొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము దాటింది 
స్తేఫేను ను రాళ్ళతో కొట్టి చంపాడు (అపో.కా 7:60) ఈ తలంపుతోనే దమస్కుకు వెళ్తూ మార్గంలో ప్రభువైన యేసు దర్శనాన్ని చూసి క్రీ.శ 32 న రక్షణ పొందాడు . 

అరేబియాలో మూడేండ్లు గడిపి ప్రభువు హృదయాన్ని తెలుసుకున్నాడు .సౌలు పౌలుగా మారాడు తర్వాత తార్సుకెల్లి చాలా కాలం సిరియా, కిలికియా దేశాల్లో క్రీస్తు సువర్తను ప్రకటించాడు 
పరిచర్యలో పౌలు: క్రీ.శ 46 లో అంతియోకయు సంఘంలో క్రీస్తు సువార్తకు అప్పగించబడ్డాడు. 
క్రీ.శ 46-49 లోమొదటి సువార్త యాత్ర
50-53 లో రెండవ సువార్త యాత్ర మరియు 
54-57 లో మూడవ సువార్త యాత్ర చేసారు . 

ఆ తర్వాత యేరుషలేములో బంధించబడి రెండేళ్లు కైసరయలోని కావలిలో గడిపారు .క్రీ.శ 60 లో రోమునకు ప్రయాణం రోములో రెండేళ్ళు మొదటి చెర 61-62 కొద్ది కాలం విడిచిపెట్టబడినారు .
63-64 అనేక ప్రాంతాలు తిరిగి సువర్త ప్రకటించాడు. పిమ్మట రెండవ మారు (65-66) లో రోము చెరలో ఉన్నడు మరియు 67 లో నీరో చక్రవర్తి ద్వారా శిరచ్చేదనచేయబడి హతసాక్షి అయ్యాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...