*బైబిల్ లో ప్రస్తావించబడిన కొన్ని మైదానములు అక్కడ జరిగిన సంఘటనలు*
1️⃣ మోరే మైదానము - ఇచ్చట అబ్రాహాము దేవునికి తన మొట్టమొదటి బలిపీఠమును కట్టెను (ఆది 12:6)
2️⃣ మమ్రే దగ్గరున్న మైదానము - ఇచ్చట దేవుడు అబ్రాహామునకు కనపడెను (ఆది 18:1)
3️⃣ షీనారు దేశమందు గల మైదానము - ఇచ్చట బాబేలు గోపురం నిర్మించబడెను (ఆది 11:2)
4️⃣ యోర్దాను మైదానము - సోదోమ పట్టణము ఇచ్చట ఉండెను (ఆది 13:11,12)
5️⃣ మోయాబు మైదానము - ఇశ్రాయేలీయులు యోర్దానును దాటుటకు చివరిగా సన్నద్ధమైన ప్రదేశం (సంఖ్యా 26:3,63; 31:12; ద్వితీ 34:1,8)
6️⃣ యెరికో మైదానం - యెహోషువ ఇచ్చట క్రీస్తును కలిసెను మరియు పట్టణము జయించుటకు ఇశ్రాయేలీయులను సిద్ధపరచెను మరియు ఇదే మైదానమందు యూదా రాజ్యమునకు ఆఖరి రాజయిన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నేజరు చెరపట్టెను (యెహో 5:10; 2 రాజులు 25:5)
7️⃣ బబులోను దేశములోని దూరాయను మైదానము - ఈ మైదానమందు నెబుకద్నేజరు తాను చేయించిన బంగారు ప్రతిమను నిలబెట్టించెను (దానియేలు 3:1)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి