ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అపోస్తులుడైన పౌలు మూడవ సువార్త ప్రయాణము

అపోస్తులుడైన పౌలు మూడవ సువార్త ప్రయాణము
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
జతపనివారు : 
🟡🟡🟡🟡🟡🟡🟡
లూకా, సోపత్రు, అరిస్తర్కు, సెకుందు, గాయి, తిమోతి, తుకికు, త్రోఫిము. 

తేదీలు : 
🟠🟠🟠🟠🟠
క్రీ. శ. 53-57 (సుమారు నాలుగు సంవత్సరముల కాలము) 

ప్రయాణము చేసిన దూరము : 
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
2,500 మైళ్లు పైగా (1,190 మైళ్లు సముద్ర ప్రయాణము మరియు 1,325 మైళ్లు భూప్రయాణము) 

పట్టణమునకు, పట్టణమునకు మధ్య దూరము (మైళ్లలో సుమారుగా) :
🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
1. సిరియాలోగల అంతియొకయనుండి కిలికియ ద్వారములవరకు: 140 

2. కిలికియ ద్వారములనుండి దెర్బేవరకు : 100 

3. దెర్బేనుండి లుస్తవరకు :30 

4. లుస్త్రనుండి ఈకొనియవరకు :30 

5. ఈకొనియనుండి పిసిదియలోగల అంతియొకయవరకు : 85 

6. గలతీయ మరియు ఫ్రగియ : 200 

7. పిసిదియలోగల అంతియొకయనుండి ఎఫెసువరకు : 225 

8. ఎఫెసునుండి త్రోయవరకు :150 

9. త్రోయనుండి మాసిదోనియవరకు :150 

10. గ్రీసునుండి ఫిలిప్పీవరకు : 150 + 

11. మాసిదోనియనుండి గ్రీసువరకు : 150 

12. ఫిలిప్పీనుండి త్రోయవరకు : 140 

13. త్రోయనుండి అస్సువరకు :20 

14. అస్సునుండి మితులేనేవరకు :40 

15. మితులే నేనుండి కోసువరకు: 70 

16.కీయొసునుండి సమొసువరకు :70 

17. సమొసునుండి మిలేతువరకు : 50 

18.మిలేతునుండి కోసువరకు :40 

19. కోసునుండి రొదువరకు 85 : 

20. రొదునుండి పతరవరకు : 70 

21. పతరనుండి తూరువరకు : 400 

22. తూరునుండి తొలెమాయివరకు : 25 

23. తొలెమాయినుండి కైసరయవరకు: 30 

24. కైసరయనుండి యెరూషలేమువరకు :65 
..............................................2,515 + 

మూడవ ప్రయాణము : అపొస్తలుల కార్యములు 18-21 అధ్యాయములు 
🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍
1. సిరియాలోగల అంతియొకయ (18:23)
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అంతియొకయలో పౌలు కొంతకాలము ఉండెను. 

2. గలతీయ మరియు ప్రగియ (18:23)
🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎
అంతియొకయనుండి బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ప్రగియ యందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను. 

3. ఎఫెసు (19:1-41)
💚💚💚💚💚💚💚💚💚
పై ప్రదేశములలో సంచరించి పౌలు ఎఫెసుకు వచ్చిన తరువాత కొందరు శిష్యులకు పరిశుద్ధాత్మనుగూర్చి బోధించి, బాప్తిస్మమిచ్చు యోహానుద్వారా మాత్రమే బాపిస్మము పొందినవారికి ప్రభువైన యేసు నామమున బాప్తిస్మమిచ్చెను. తరువాత పౌలు సమాజమందిరములలో మూడు నెలలపాటు బోధించెను. మరియు అతడు తురన్ను అను ఒకని పాఠశాలలో 2 సంవత్సరములపాటు తర్కించుచు ఉండెను. ఈ పట్టణములో దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను. పౌలు చేసిన సూచకక్రియలను చూచి మాంత్రిక విద్యనభ్యసించిన ఈ పట్టణస్థులు కొందరు అందరి ఎదుట తమ పుస్తకములను తెచ్చి కాల్చివేసిరి. అంతేగాక, పౌలు వాక్యపరిచర్యవలన అర్తెమిదేవికి వెండిగుళ్లను చేయు కంసాలి పనివారి వ్యాపారము నకు ఆటంకము కలిగినందున అక్కడ కలహము జరిగెను. 

4. మాసిదోనియ (20:1, 2)
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
పౌలు మాసిదోనియకు వెళ్లి ఆ ప్రదేశములయందు సంచరించుచు అనేక బోధల ద్వారా వారిని హెచ్చరించెను. 

5. గ్రీసు (20:2, 3)
💛💛💛💛💛💛💛💛
పౌలు గ్రీసులో మూడు నెలలు గడిపి అచ్చటినుండి సిరియకు వెళ్లవలెనని యుండెను. 

6. మాసిదోనియ (20:4)
💟💟💟💟💟💟💟💟
అయితే, పౌలు విషయమై యూదులు కుట్రచేయుచున్నందున మాసిదోనియ మీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను. పౌలుతో కూడా లూకా, సోపత్రు, అరిస్తర్కు ,సెకుందు, గాయి, తిమోతి, తుకికు, త్రోఫిము ఉండిరి. 

7. ఫిలిప్పీ (20: 5, 6)
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
పౌలుతోకూడ ఉన్న ఏడుగురు జతపనివారు ముందుగా త్రోయకు వెళ్లిరి. పౌలు మరియు లూకా (5వ వచనములో “మాకొరకు” అని, 6వ వచనములో “మేము" అని యున్నది గమనించండి) ఫిలిప్పీనుండి సముద్రప్రయాణముద్వారా 5 రోజుల తరువాత వారిని త్రోయలో కలిసిరి. 

8. త్రోయ (20:6-12)
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
అచ్చట వారందరు 7 దినములు గడిపిరి. ఆదివారమునాడు రొట్టె విరుచుటకు కూడియున్నప్పుడు పౌలు మరునాడు వెళ్లనైయుండి అర్ధరాత్రివరకు ప్రసంగించుచు విస్తరించుచు మాట్లాడెను. అట్లు పౌలు చాలా సేపు ప్రసంగించుచుండగా ఐతుకు అను యౌవనస్థుడు నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి మరణించెను. అయితే పౌలు అతనిని మరణమునుండి బ్రతికించెను. 

9. అస్సు (20:13)
⬛⬛⬛⬛⬛⬛⬛⬛⬛
పౌలు త్రోయనుండి అస్సువరకు కాలి నడకన వెళ్లి, అక్కడ ఓడ ఎక్కెను. 

10. మితులేనే (20:14)
🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆
పౌలును, అతనితోకూడ ఉన్నవారును అస్సునుండి మితులేనేవరకు ఓడలో వచ్చిరి. 

11.కీయొసు (20:15)
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
ఆ మరునాడు వారు మితులే నేనుండి కీయొసుకు వచ్చిరి. 

12.సమొసు (20:15)
🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪
ఆ తరువాత దినమున వారు కీయొసునుండి సమొసుకు వచ్చిరి.
13. మిలేతు (20:15-38)
🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧
సమొసునుండి వీరందరు మిలేతుకు చేరి, సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచు, ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని, మిలేతునుండి ఎఫెసుకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారితో మాట్లాడిన తరువాత వారియొద్దనుండి సెలవు పుచ్చుకొనెను. 

14. కోసు (21:1) 

15. రొదు (21:1) 

16. పతర (21:1-3)
🟩🟩🟩🟩🟩🟩🟩🟩
పౌలును అతని సహచరులును పతరలో ఓడలు మారిరి. వారు అక్కడనుండి బయలుదేరి దక్షిణ సముద్రతీరమందు ప్రయాణించి కుప్రకు ఎదురుగా వచ్చి, అక్కడనుండి తూరుకు వచ్చిరి. 

17. తూరు (21:3-6)
🟨🟨🟨🟨🟨🟨🟨🟨
సామానులు దించుటకు తూరులో ఓడ వారము రోజులు ఆగగా, ఆ వారము రోజులు పౌలును అతని జతపనివారును తూరు సంఘ సభ్యులతో గడిపిరి. 

18. తొలెమాయి (21:7)
🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦
వీరందరు తొలెమాయికి వచ్చి అచ్చటి సహోదరులను కుశలమడిగి వారియొద్ద ఒక దినము గడిపిరి. 

19. కైసరయ (21:8-14)
🟥🟥🟥🟥🟥🟥🟥🟥
పౌలును అతని జతపనివారును కొన్ని దినములు ఏడుగురు పరిచారకులలో ఒకడైన ఫిలిప్పు ఇంటిలో ఉండిరి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవక్తిలు. వారనేక దినములు అక్కడ ఉండగా, అగబు అను ప్రవక్త యూదయనుండి వచ్చి యెరూషలేములో పౌలు బంధింపబడుటను గూర్చి ప్రవచించెను. అయితే, పౌలు భయపడక తన పరిచర్యను సంపూర్తి చేయుటకు నిశ్చయించుకొనెను. 

20. యెరూషలేము (21:15-26)
🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫
కైసరయలోనున్న కొందరు శిష్యులు పౌలు బృందముతో కలిసి యెరూషలేముకు వెళ్లిరి. వారు ముందుగా మొదటినుండి శిష్యుడిగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట దిగిరి. పౌలు యాకోబుకు మరియు యెరూషలేము సంఘ పెద్దలకు తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా చెప్పెను. యాకోబును మరియు ఇతర పెద్దలును విన్నవించిన ప్రకారము పౌలును అతనితో కూడ ఉన్నవారును “శుద్ధి చేసికొనిరి”. ఆ తరువాత ఏడు దినములకు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో పౌలును చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని పట్టుకొని - ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును, ధర్మశాస్త్రమునకును, ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే అనిరి. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తి కొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయమునుండి అతనిని వెలుపటికి ఈడ్చిరి. వెంటనే దేవాలయపు తలుపులు మూయబడెను.
సేకరణ....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...