ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు ఎవరు?

*ఎస్తేరు*

*ఎస్తేరు ఎవరు?* ఆమె ఒక యూదురాలు, పర్షియా రాజైన అహష్వేరోషు ఆమెను తన రాణిగా చేసుకున్నాడు.

*ఆమె ఏం చేసింది?* ఎస్తేరు రాణి తన అధికారాన్ని ఉపయోగించి తన ప్రజలైన యూదుల్ని కాపాడింది. పర్షియా సామ్రాజ్యంలోని యూదులందర్నీ ఫలానా రోజున చంపేయాలనే ఆజ్ఞ జారీ అయిందని ఆమెకు తెలిసింది. ఆ దుష్ట పన్నాగాన్ని, ప్రధాన అధిపతి అయిన హామాను పన్నాడు. (ఎస్తేరు 3:13-15;4:1, 5) వయసులో చాలా పెద్దవాడూ వరుసకు అన్న అయిన మొర్దెకై సహాయంతో, ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి మరీ ఆ కుట్ర గురించి తన భర్త అయిన అహష్వేరోషు రాజు ముందు బయటపెట్టింది. (ఎస్తేరు 4:10-16; 7:1-10) అప్పుడు ఎస్తేరు, మొర్దకైలు ఇంకో ఆజ్ఞ జారీ చేసేలా, అంటే యూదులు తమను తాము కాపాడుకునేలా ఆజ్ఞ జారీ చేయడానికి అహష్వేరోషు అనుమతి ఇచ్చాడు. అప్పుడు యూదులు తమ శత్రువుల్ని పూర్తిగా ఓడించారు.—ఎస్తేరు 8:5-12; 9:16, 17.

*ఎస్తేరు నుండి మనమేం నేర్చుకోవచ్చు?* ఎస్తేరు రాణి సాటిలేని ధైర్యాన్ని, వినయాన్ని, అణకువను చూపించింది. (కీర్తన 31:24; ఫిలిప్పీయులు 2:3) ఆమె అందగత్తె, రాణి అయినప్పటికీ ఇతరుల సలహాను, సహాయాన్ని తీసుకుంది. తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఒకపక్క ధైర్యాన్ని, మరోపక్క నేర్పును, గౌరవాన్ని చూపించింది. యూదులకు ప్రాణాపాయం ఉన్న సమయంలో, తాను కూడా యూదురాలినే అని ధైర్యంగా చెప్పింది.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...