ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నిర్గమకాండం వివరణ

✳ *....నిర్గమకాండం.....* ✳

(దాస్యవిముక్తి)

*పరిచయం*
*పేరు*
👉 పాత తెలుగు బైబిలు(అంటే పరిశుద్ధగ్రంథం)లోని పుస్తకాల పేర్లన్నీ ఇతర భాషల్లోని బైబిళ్ళనుంచి తర్జుమా చేశారేగాని మూలభాష అయిన హీబ్రూ నుంచి కాదు.

👉ఇక్కడ *“నిర్గమకాండం”* అనేకంటే
🔹దాస్యవిముక్తి అనడమే బాగుంటుందనిపిస్తుంది.

👉మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు.

👉తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత ఒడంబడిక గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు.

ఈ తర్జుమాను *“సెప్టుయజింట్”* అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి.

ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది.
👉అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు

*రచయిత:*

*మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం.*

👉ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19, 24-26; యెహో 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి.

👉అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46-47; 7:19 చూడండి.

*వ్రాసిన కాలం:*

బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో.

*ముఖ్యాంశం:*

*ఇశ్రాయేల్‌ ప్రజలకు దాసత్వంనుంచి విడుదల కలగడం అనేది మొదటి భాగం యొక్క ముఖ్యాంశం.*

🔺 దేవుని ప్రజలు ఎలా బ్రతకాలి?
🔺 ఎలా ఆరాధించాలి? అన్నది రెండవ భాగం ముఖ్యాంశం.

👉 ఈ పుస్తకమంతా ఆధ్యాత్మికమైన, సాదృశ్యమైన అర్థాలతో కూడి ఉండి నేటి విశ్వాసులకోసం కూడా మంచి ఉపదేశాలతో పాఠాలతో నిండివున్నది.

*విషయసూచిక:-*

( ఏ అధ్యయం లో దేనిగురించి  హ్రయబడినది)

🔹ఈజిప్ట్‌లోని దాసత్వం 1:1-22

మోషే పుట్టుక, బాల్యం 2:1-10

మోషే మిద్యానుకు పలాయనం, 40 సంవత్సరాలపాటు అక్కడే ఉండిపోవడం 2:11-24

మండుతున్న పొద దగ్గర దేవుడు మోషేను పిలిచి
అతన్ని ఈజిప్ట్‌కు పంపడం 3:1—4:17

మోషే అభ్యంతరాలు 3:11-13

దేవుడు తన పేరును ప్రకటించడం 3:14-15

మోషే మళ్ళీ అభ్యంతరం చెప్పడం, దేవుడు
అతనికి అద్భుతమైన శక్తులు ఇవ్వడం 4:1-9

మోషే మూడవ అభ్యంతరం 4:10-12

ఇంకెవరినైనా పంపమని మోషే దేవుణ్ణి అడగడం 4:13-17

మోషే ఈజిప్ట్‌కు తిరిగి రావడం 4:18-31

అహరోను, మోషే ఫరో దగ్గరకు వెళ్ళడం 5:1-21

దాస్య విముక్తి కలిగిస్తానని దేవుని వాగ్దానం 5:22—6:18

అహరోను చేతికర్ర పాముగా మారడం 7:9-13

ఈజిప్ట్‌పై దేవుడు పంపిన విపత్తులు 7:14—12:30

నీరు రక్తంగా మారడం 7:14-24

కప్పలు 7:25—8:15

దోమలు 8:16-19

ఈగలు 8:20-32

పశువుల చావు 9:1-7

కురుపులు 9:8-12

వడగండ్లు 9:13-35

మిడతలు 10:1-20

చీకటి 10:21-24

మొదట పుట్టిన సంతానం చావడం 11:1—12:30

పస్కా పండుగ 12:1-28

ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌ను విడిచి వెళ్ళడం 12:31-42

పస్కా పండుగ గురించి ఆదేశాలు 12:43-50

మొదటి సంతానాన్ని గురించి ఆదేశాలు 13:1-16

మేఘం, అగ్ని స్థంభాలు 13:20-22

ఇస్రాయేల్‌ప్రజలు ఎర్ర సముద్రం దాటడం, ఫరో సైన్యాలు అందులో మునిగిపోవడం 14:1-31

విముక్తి పాట 15:1-21

మారా ఏలీంల నీళ్ళు 15:22-27

దేవుడు మన్నాను, పూరేడు పిట్టలను ఆహారంగా ఇవ్వడం 16:1-36

దేవుడు బండరాయి నుంచి నీరు ఇవ్వడం 17:1-7

అమాలేకుతో యుద్ధం 17:8-15

మోషే మామగారు 18:1-27

సీనాయి పర్వతం మీద దేవుడు, ఇస్రాయేల్ ప్రజలు 19:1-25

ధర్మశాస్త్రంతో కూడిన ఒడంబడిక 19:5-8

పది ఆజ్ఞలు 20:1-17

మరిన్ని చట్టాలు, ఆదేశాలు 20:22—23:13

ఏటేటా జరిగే మూడు పండుగలు 23:14-17

ఇస్రాయేల్ ప్రజలకు దారి చూపడానికి దేవుని దూత 23:20-23

ఒడంబడికను స్థిరపరచడం 24:1-18

దేవుడు ఆరాధన గుడారం గురించి ఆదేశాలివ్వడం 25:1—31:18

పెట్టె 25:10-22

బల్ల 25:23-30

దీపస్తంభం 25:31-40

గుడారం 26:1-37

బలిపీఠం 27:1-8

ఆవరణం 27:9-19

నూనె 27:20-21

యాజుల వస్త్రాలు 28:1-43

యాజుల ప్రతిష్ఠ 29:1-45

ధూపవేదిక 30:1-10

ప్రాయశ్చిత్తం కోసం వెండి 30:11-16

కడగడానికి కంచు గంగాళం 30:17-21

అభిషేక తైలం 30:22-33

ధూపద్రవ్యం 30:34-38

కట్టేవాళ్ళు 31:1-11

విశ్రాంతి దినం 31:12-18

బంగారు దూడ 32:1-29

మోషే దేవునితో ప్రాధేయపడడం 32:30-34

సన్నిధి గుడారం 33:7-11

దేవుని మహిమను చూడాలనే మోషే విన్నపం 33:12-23

మోషే దేవుని మహిమను చూడడం, దేవుడు తన పేరును ప్రకటించడం 34:1-7

దేవుడు మరిన్ని ఆదేశాలు ఇవ్వడం 34:10-28

మోషే ముఖం ప్రకాశించడం 34:29-35

ఆరాధన గుడారం కట్టడానికి ప్రజలు తేవలసిన కానుకలు 35:4—36:7

ఆరాధన గుడారం నిర్మాణం 36:8—40:33

ఆరాధన గుడారం దేవుని మహిమతో నిండడం 40:34-38

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...