ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆదికాండం వివరణ మొదటి భాగం

✳ *....ఆదికాండం...* ✳

 *పరిచయం*

  *పేరు:*

👉మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు.

👉 హీబ్రూలో ఆదికాండంలోని మొదటి పదం *“ఆదిలో”* అని అర్థమిచ్చే పదం కాబట్టి యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు.
👉తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత ఒడంబడిక గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు.

ఈ తర్జుమాను *“సెప్టుయజింట్”* అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి.

ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది.
👉అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు

*రచయిత:*

*మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం.*

👉ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19, 24-26; యెహో 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి.

👉అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46-47; 7:19 చూడండి.

*వ్రాసిన కాలం:*

బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో.

*ముఖ్యాంశం:*

ఆరంభాలు.
👉ఇక్కడ ఉన్నది దేవుడు తనను తాను వెల్లడి చేసుకోవడం గురించిన ఆరంభం,
👉ప్రపంచ ప్రారంభం,
👉 మానవజాతి,
👉పాపం,
👉పాప విమోచనకోసం దేవుని పద్ధతి,
👉వివిధ జాతుల ఆరంభాలు,
👉 దేవుడు తన వాక్కును అందించిన ఇస్రాయేల్ ప్రజల ఆరంభం.

*విషయసూచిక:*

🔹ఆకాశాలు భూమిని సృజించడం 1:1-31
సృష్టిని గురించిన మరింత సమాచారం 2:1-25
మనిషి పాపంలో పడడం, దాని ఫలితం 3:1-24
కయీను, హేబెలు 4:1-18
కయీను సంతతివాళ్ళ గుణము 4:19-24
మొదటి ప్రజల వంశావళి 5:1-32
నోవహు, ఓడ, జలప్రళయం 6:1—8:22
నోవహుతో దేవుని ఒడంబడిక 9:1-17
వివిధ దేశాల ప్రారంభం 9:18—10:32
బాబెలు గోపురం 11:1-9
మరిన్ని వంశావళులు 11:10-32

అబ్రాహాము దేవుని పిలుపును శిరసావహించడం 12:1-9
ఈజిప్ట్‌లో అబ్రాహాము 12:10-20
లోత్, అబ్రాహాము విడిపోవడం 13:1-18
అబ్రాహాము, లోత్‌ను రక్షించడం 14:1-17
అబ్రాహాము, మెల్కీసెదెకు 14:18-20
అబ్రాహాముకు దేవుని వాగ్దానాలు 15:1-19
ఇష్మాయేల్ పుట్టుక 16:1-15
సున్నతి సంస్కారం గురించిన ఆజ్ఞ 17:1-14
ఇస్సాకును గురించిన వాగ్దానం 17:15-19
అబ్రాహాము ముగ్గురు అతిధులు 18:1-15
అబ్రాహాము సొదొమ గురించి ప్రార్థించడం 18:16-33
సొదొమ నాశనం 19:1-29
లోత్, అతని కుమార్తెలు 19:30-38
అబ్రాహాము, అబీమెలెకు 20:1-18
ఇస్సాకు పుట్టుక, ఇష్మాయేల్ వీడ్కోలు 21:1-21
ఇస్సాకు గురించి దేవుడు అబ్రాహామును పరీక్షించడం 22:1-19
శారా మరణం, భూస్థాపన 23:1-20
ఇస్సాకుకోసం పెండ్లి కూతురు 24:1-67
అబ్రాహాము చనిపోవడం 25:1-11

ఇష్మాయేల్ సంతానం 25:12-18
యాకోబు, ఏశావుల పుట్టుక 25:19-26
ఏశావు తనజన్మహక్కును యాకోబుకు అమ్మడం 25:27-34
ఇస్సాకు, అబీమెలెకు 26:1-33
యాకోబు ఇస్సాకును మోసంచేసి అతని దీవెనలు పొందడం 27:1-29
ఏశావుకు నష్టం, అతని కోపం 27:30-45

యాకోబు లాబాను దగ్గరకు పారిపోవడం 28:1-22
యాకోబుకు వచ్చిన నిచ్చెన కల 28:10-22
యాకోబు భార్యలూ, పిల్లలూ 29:1—30:24
యాకోబు, లాబాను – ఇద్దరు మోసగాళ్ళు 30:25-43
యాకోబు పలాయనం, లాబాను వెంటబడడం 31:1-55
యాకోబు ఏశావును కలుసుకోవడానికి సిద్ధపడడం 32:1-21
యాకోబు దేవదూతతో పెనుగులాడడం 32:22-32
యాకోబు ఏశావుల కలయిక 33:1-17
షెకెంలో యాకోబు 34:1-31
బేతేల్‌లో యాకోబు 35:1-15
ఇస్సాకు, రాహేలుల మరణం 35:16-29
ఏశావు వంశావళి 36:1-43

యోసేపు కలలు 37:1-11
యోసేపు సోదరులు, అతణ్ణి అమ్మడం 37:12-36
యూదా, తామారు 38:1-30
ఈజిప్ట్‌లో యోసేపు – ఫోతీఫరు భార్య 39:1-19
చెరసాలలో యోసేపు, కలలభావం చెప్పడం 39:20—40:23
ఫరో కలలకు యోసేపు భావం చెప్పడం 41:1-38
యోసేపు ఈజిప్ట్ ప్రధానమంత్రి 41:39-57
యోసేపు, అతని సోదరులు 42:1—44:34
యోసేపు తనను తాను తెలియపర్చుకోవడం 45:1-15
యోసేపు సోదరులు యాకోబును ఈజిప్ట్‌కు తీసుకురావడం 45:16—46:34
యాకోబు ఫరోను కలుసుకోవడం 47:1-12
ప్రధానమంత్రిగా యోసేపు చర్యలు 47:13-31
యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించడం 48:1-22
యాకోబు తన స్వంత కుమారులను ఆశీర్వదించడం 49:1-28
యాకోబు మరణం 49:29-33
ఈజిప్ట్‌లో యోసేపు చివరి రోజులు 50:1-26

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...