📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
*అబీగయీలు*
👉. *అబీగయీలు ఎవరు?* ఆమె నాబాలు భార్య. అతను చాలా ధనవంతుడు, కానీ కఠినుడు. అయితే అబీగయీలు వివేచన, వినయం గల స్త్రీ. ఆమె చూడడానికి అందంగా ఉండేది, పైగా యెహోవాకు నచ్చే లక్షణాలు ఆమెలో ఉన్నాయి.—1 సమూయేలు 25:3.
👉. *ఆమె ఏం చేసింది?* అబీగయీలు రాబోతున్న ప్రమాదాన్ని తప్పించడానికి తెలివితో, వివేచనతో చర్య తీసుకుంది. ఇశ్రాయేలుకు రాజు కాబోతున్న దావీదు, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రాంతంలోనే అబీగయీలు, నాబాలు నివసించేవాళ్లు. దావీదు, ఆయన మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాబాలుకు చెందిన గొర్రెల్ని దొంగల బారినుండి కాపాడేవాళ్లు. కానీ దావీదు మనుషులు, ఆహారం అడగడానికి వచ్చినప్పుడు నాబాలు పొగరుగా ఇవ్వనన్నాడు. దావీదుకు విపరీతమైన కోపం వచ్చింది! దాంతో దావీదు, ఆయన మనుషులు నాబాలును, అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ చంపేయడానికి బయల్దేరారు.—1 సమూయేలు 25:10-12, 22.
👉. తన భర్త ఏం చేశాడో అబీగయీలుకు తెలిసినప్పుడు ఆమె వెంటనే చర్య తీసుకుంది. దావీదు కోసం, ఆయన మనుషుల కోసం కొంత ఆహారాన్ని తన సేవకులతో పంపించింది, కరుణ చూపించమని దావీదును వేడుకోవడానికి ఆమె కూడా వెనకాలే వెళ్లింది. (1 సమూయేలు 25:14-19, 24-31) దావీదు ఆమె పంపినవాటిని, ఆమె వినయాన్ని చూసినప్పుడు, ఆమె తెలివైన సలహా విన్నప్పుడు, ప్రమాదాన్ని ఆపడానికి దేవుడే ఆమెను పంపించాడని అర్థం చేసుకున్నాడు. (1 సమూయేలు 25:32, 33) ఆ తర్వాత కొన్ని రోజులకే నాబాలు చనిపోయాడు, అప్పుడు అబీగయీలు దావీదుకు భార్య అయింది.—1 సమూయేలు 25:37-41.
👉 *అబీగయీలు నుండి మనమేం నేర్చుకోవచ్చు?* అబీగయీలుకు ఎంతో అందం, ఆస్తి ఉన్నా తానే గొప్ప అని ఆమె అనుకోలేదు. శాంతిని కాపాడడం కోసం, తాను ఏ తప్పూ చేయకపోయినా క్షమాపణ అడిగింది. ఎంతో ఒత్తిడి కలిగించే పరిస్థితిలో ప్రశాంతంగా, యుక్తిగా, ధైర్యంగా, తెలివిగా వ్యవహరించింది

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి