ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండం వివరణ

✳ *లేవీయకాండం* ✳
 (యాజి ధర్మవిధులు)

*పరిచయం*

 *పేరు:*

👉యూదులు ఈ పుస్తకాన్ని మొదటి పదాలయిన
*“ఆయన పిలిచాడు”* అనే పేరుతో పిలిచేవారు (హీబ్రూలో మొదటి పదం అదే).
👉పాత తెలుగు బైబిలు(పరిశుద్ధ గ్రంథం)లో ఉన్న పేరు గ్రీకు తర్జుమాలో ఉన్న పేరు తర్జుమా. ఆ పేరు దేవుని ప్రేరేపణతో వచ్చినది కాదు.
*ఆదికాండం పరిచయం చూడండి.*
👉 ఈ పుస్తకాన్ని లేవీయకాండం అనేదానికంటే *“యాజి ధర్మవిధులు”* అంటేనే బాగుంటుందనిపిస్తుంది.

♻ *రచయిత:*

*మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం.*

👉ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19, 24-26; యెహో 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి.

👉అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46-47; 7:19 చూడండి.

♻ *వ్రాసిన కాలం:*

బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో.

*ముఖ్యాంశాలు:*

👉ఒక ముఖ్యాంశం జీవితంలోని ప్రతి భాగంలో పరిశుభ్రత, పవిత్రత ఉండవలసిన అవసరం.

 *దేవుడు పవిత్రుడు. అలాగే ఆయన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి.*
 11:45; 19:2; 20:7 చూడండి.

👉 మరో ముఖ్యాంశం బలిద్వారానే దేవుణ్ణి సమీపించడం సాధ్యంగా ఉన్నది. 16:1-17 చూడండి. *మనిషి పాపి గనుక ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అవసరం.*

👉ఈ పుస్తకమంతా సాదృశ్యాలతో, చిహ్నాలతో, సూచనలతో నిండి ఉన్నది.

*ఈ సాదృశ్యాలు క్రీస్తువైపు చూపిస్తూ మనుషులకు ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నవి.*

*కొన్ని ముఖ్యమైన పదాలు:*
 *“బలి”*
 *“అర్పణ అర్పించడం”* (నామవాచకం, క్రియాపదాలు దాదాపు 300 సార్లు ఉపయోగించడం జరిగింది).

 *“శుద్ధ” “అశుద్ధ”* (130 సార్లకంటే ఎక్కువసార్లు వాడబడ్డాయి),

 *“పవిత్ర”* (70 సార్లు వాడినది),

*“యాజి” లేక “యాజులు”* (170 సార్ల కంటే ఎక్కువ వాడినది).
👉యాజులు అంటే ప్రజల పక్షంగా, దేవుని సన్నిధిలో ప్రతినిధులుగా ఉన్నవారు, బలులు అర్పించేవారు, ఆరాధన గుడారంలోనూ ఆలయంలోనూ ఆరాధన విధులు నిర్వహించేవారు.

*విషయసూచిక*

అయిదు ముఖ్యమైన బలులు లేక అర్పణలు 1:1—7:38

హోమబలి 1:1-17

నైవేద్యం 2:1-16

శాంతి బలి 3:1-17

పాపాలకోసం బలి 4:1—5:13

అపరాధ బలి 5:14—6:7

నిత్యహోమ బలి 6:8-13

వివిధ బలులను గురించి మరిన్ని ఆదేశాలు 6:14—7:38

యాజుల ప్రతిష్ఠ 8:1-36

యాజులు తమ పనిని ఆరంభించడం 9:1-24

నాదాబు, అబీహుల మరణం 10:1-7

యాజులకు ఆదేశాలు 10:8-20

శుద్ధమైనవి, అశుద్ధమైనవి 11:1—15:33

శుద్ధమైన, అశుద్ధమైన ఆహారాలు 11:1-47

పిల్లలను కన్న తరువాత శుద్ధపరచడం 12:1-8

వ్యాధులను గురించిన ఆదేశాలు 13:1-46

బూజును గురించిన ఆదేశాలు 13:47-59

చర్మ వ్యాధులనుండి శుద్ధపరచడం 14:1-32

బూజునుండి శుద్ధపరచడం 14:33-57

శరీర స్రావానికి సంబంధించిన ఆదేశాలు 15:1-33

మహా ప్రాయశ్చిత్త దినం 16:1-34

బలులు అర్పించే స్థలం 17:1-9

రక్తాన్ని తినడం నిషేధం 17:10-14

దేవుడు నిషేధించిన లైంగిక సంబంధాలు 18:1-30

వేరు వేరు శాసనాలు, చట్టాలు 19:1—20:27

యాజుల పవిత్రత, వారి బాధ్యతలు 21:1—22:23

దేవుడు నియమించిన పవిత్ర కాలాలు లేక పండుగలు 23:1-44

విశ్రాంతి దినం 23:3

పస్కాపండుగ, పొంగని రొట్టెల పండుగ 23:4-8

మొదటి పంటలు 23:9-14

పెంతెకొస్తు పండుగ 23:15-22

బూరలూదే పండుగ 23:23-25

ప్రాయశ్చిత్తం 23:26-32

పర్ణశాలలు 23:33-44

రొట్టెలు, ఆలీవ్ నూనె నిత్యమూ దేవుని సన్నిధిలో ఉండాలి 24:1-9

దేవదూషణకు శిక్ష 24:10-23

విశ్రాంతి సంవత్సరం 25:1-7

మహోత్సవ సంవత్సరం (యాభైయో సంవత్సరం) 25:8-55

విధేయతకు ఆశీర్వచనాలు 26:1-12

అవిధేయతకు శాపాలు 26:13-46

వ్యక్తిగతమైన మరిన్ని ఆదేశాలు 27:1-34

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...