ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?

*బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?*

*బైబిలు ఇచ్చే జవాబు*

బైబిల్ని అర్థం చేసుకోవడానికి మీరేమి చేయాలో బైబిలే చెప్తోంది. మీరు ఎవరైనా సరే, బైబిల్లోని సందేశం మీరు అర్థం చేసుకోలేనంత “కఠినమైనది కాదు, దూరమైనది కాదు.”—ద్వితీయోపదేశకాండము 30:11.

*బైబిల్ని అర్థం చేసుకోవాలంటే …*

సరైన వైఖరి ఉండాలి. బైబిలు, దేవుని వాక్యమని అంగీకరించండి. గర్విష్ఠులను దేవుడు వ్యతిరేకిస్తాడు, కాబట్టి వినయంగా ఉండండి. (1 థెస్సలొనీకయులు 2:13; యాకోబు 4:6) అలాగని ప్రతీదాన్ని గుడ్డిగా నమ్మేయకండి. మీరు మీ ‘ఆలోచనా సామర్థ్యాల్ని’ ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు.—రోమీయులు 12:1, 2, NW.

జ్ఞానం కోసం ప్రార్థించాలి. సామెతలు 3:5లో “నీ స్వబుద్ధిని ఆధారము” చేసుకోవద్దు అని బైబిలు చెప్తోంది. కానీ, బైబిల్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం కోసం ‘దేవుణ్ణి అడుగుతూ’ ఉండమని అది చెప్తోంది.—యాకోబు 1:5, NW.

రోజూ చదవాలి. మీరు బైబిల్ని అప్పుడప్పుడూ కాకుండా రోజూ స్టడీ చేస్తే మరింత ప్రయోజనం పొందుతారు.—యెహోషువ 1:8.

అంశాల వారీగా స్టడీ చేయాలి. ప్రత్యేకించి ఒక అంశాన్ని తీసుకుని, దాని గురించి బైబిలు చెప్తున్న విషయాలను పరిశీలించండి. లేఖనాలు బోధించే విషయాన్ని నేర్చుకోవడానికి అది ఒక చక్కని మార్గం. ముందు, ప్రాథమిక పాఠాలు అంటే సులువైన అంశాలు స్టడీ చేయండి, తర్వాత మెల్లమెల్లగా పెద్ద విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి. (హెబ్రీయులు 6:1, 2) ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చవచ్చని మీరు తెలుసుకుంటారు. అంతేగాక బైబిల్లోని కొన్ని భాగాలు, “గ్రహించుటకు కష్టమైన” భాగాలతో సహా, ఇతర భాగాలను కూడా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని మీరు తెలుసుకుంటారు.—2 పేతురు 3:16.

ఇతరుల సహాయం తీసుకోవాలి. బైబిల్ని అర్థం చేసుకున్నవాళ్ల సహాయం తీసుకోమని బైబిలు ప్రోత్సహిస్తోంది. (అపొస్తలుల కార్యములు 8:30, 31) యెహోవాసాక్షులు బైబిల్లోని విషయాలను ఉచితంగా నేర్పిస్తారు. వాళ్లు మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లా లేఖనాలను ఉపయోగించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తారు.—అపొస్తలుల కార్యములు 17:2, 3.

*మీకు అవసరం లేనివి*

గొప్ప తెలివితేటలు, పెద్దపెద్ద చదువులు. యేసు 12 మంది అపొస్తలులను కొంతమంది “విద్యలేని పామరులని” అన్నారు, అయినా వాళ్లు లేఖనాలను అర్థం చేసుకున్నారు, ఇతరులకు బోధించారు.—అపొస్తలుల కార్యములు 4:13.

డబ్బు. మీరు బైబిల్లోని విషయాలను నేర్చుకోవడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.”—మత్తయి 10:8.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...