*లేయా*
*లేయా ఎవరు?* ఆమె, ఇశ్రాయేలీయుల పూర్వీకుడైన యాకోబు మొదటి భార్య. ఆమె చెల్లి రాహేలు, ఆయనకు రెండో భార్య.—ఆదికాండము 29:20-29.
*ఆమె ఏం చేసింది?* లేయా ద్వారా యాకోబుకు ఆరుగురు పిల్లలు పుట్టారు. (రూతు 4:11) అయితే యాకోబు పెళ్లి చేసుకోవాలనుకున్నది లేయాను కాదు రాహేలును. కానీ ఆ అమ్మాయిల తండ్రైన లాబాను, రాహేలుకు బదులు లేయాను ఇచ్చి పెళ్లిచేశాడు. తనను మోసం చేసి లేయాతో పెళ్లిచేశారని యాకోబు తెలుసుకున్నప్పుడు ఆయన లాబానును నిలదీశాడు. అప్పుడు లాబాను, పెద్ద కూతురుకు పెళ్లికాకుండా చిన్న కూతురుకు పెళ్లిచేయడం ఆనవాయితీ కాదని చెప్పాడు. ఒక వారం తర్వాత, యాకోబు రాహేలును పెళ్లి చేసుకున్నాడు.—ఆదికాండము 29:26-28.
యాకోబు లేయా కన్నా రాహేలునే ఎక్కువగా ప్రేమించాడు. (ఆదికాండము 29:30) దానివల్ల లేయా అసూయపడి, తన భర్త ప్రేమానురాగాల కోసం చెల్లితో పోటీపడేది. దేవుడు లేయా బాధను అర్థంచేసుకుని, ఆమెకు ఏడుగురు పిల్లల్ని ఇచ్చి దీవించాడు. వాళ్లలో ఆరుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల.—ఆదికాండము 29:31.
*లేయా నుండి మనమేం నేర్చుకోవచ్చు?* కుటుంబంలో సమస్యలు ఉన్నా, దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని లేయా అర్థంచేసుకుంది. (ఆదికాండము 29:32-35; 30:20) ఆమె జీవితాన్ని చూస్తే, ఎక్కువమందిని పెళ్లిచేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో అర్థమౌతుంది. దేవుడు అప్పట్లో కొంతకాలం అలా జరగనిచ్చాడు. కానీ వివాహం విషయంలో ఆయన ఏర్పాటుచేసిన ప్రమాణం ఏంటంటే, ఒక భర్తకు ఒక్క భార్యే ఉండాలి, భార్యకు ఒక్క భర్తే ఉండాలి.—మత్తయి 19:4-6.
*లోతు భార్య*
*లోతు భార్య ఎవరు?* ఆమె పేరేంటో బైబిలు చెప్పట్లేదు. అయితే ఆమెకు ఇద్దరు కూతుళ్లని, వాళ్లంతా సొదొమ నగరంలో ఉండేవాళ్లని బైబిలు చెప్తుంది.—ఆదికాండము 19:1, 15.
*ఆమె ఏం చేసింది?* దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆమె పాటించలేదు. సొదొమ, దాని చుట్టుపక్కల నగరాల ప్రజలు ఘోరమైన లైంగిక పాపాలు చేస్తుండడంతో దేవుడు ఆ నగరాల్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే సొదొమలో ఉంటున్న నీతిమంతుడైన లోతుమీద, ఆయన కుటుంబంమీద ప్రేమతో దేవుడు వాళ్లను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడానికి ఇద్దరు దూతల్ని పంపించాడు.—ఆదికాండము 18:20; 19:1, 12, 13.
ఆ దూతలు లోతు కుటుంబంతో అక్కడినుండి పారిపొమ్మని చెప్పారు. వెనక్కి తిరిగి చూడొద్దని, లేకపోతే చనిపోతారని హెచ్చరించారు. (ఆదికాండము 19:17) అయితే లోతు భార్య వెనక్కి చూడడం మొదలుపెట్టింది, ‘ఉప్పు స్తంభం అయింది.’—ఆదికాండము 19:26.
**లోతు భార్య నుండి మనమేం నేర్చుకోవచ్చు?**దేవుని ఆజ్ఞను పాటించలేనంతగా వస్తుసంపదల్ని ప్రేమిస్తే ఏమౌతుందో ఆమె కథ చూపిస్తుంది. ఆమె జీవితం ఒక హెచ్చరికగా ఉందని సూచిస్తూ యేసు, “లోతు భార్యను గుర్తుచేసుకోండి” అన్నాడు.—లూకా 17:32.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి