✳ *సంఖ్యాకాండం* ✳
(ఎడారి ప్రయాణాలు)
*పరిచయం*
*పేరు:*
👉యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనంలోని *“ఎడారిలో”* అనే పేరుతో పిలిచేవారు. పాత తెలుగు బైబిలులోని పేరు గ్రీకు తర్జుమా అయిన *“సెప్టుయజింట్”* నుంచి వచ్చినది, దానికంటే హీబ్రూ భాషలో ఉన్న పేరు అర్థవంతమైనది.
👉ఈ పుస్తకాన్ని సంఖ్యాకాండం అనడంకంటే *“ఎడారి ప్రయాణాలు”* అనడమే మేలనిపిస్తుంది.
*రచయిత:*
*మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం.*
👉ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19, 24-26; యెహో 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి.
👉అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46-47; 7:19 చూడండి.
*వ్రాసిన కాలం:*
బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో.
ముఖ్యాంశం:
👉ఎడారిలో ఇస్రాయేల్‌ప్రజలు దేవుని శిక్షణలో. ఎడారి సంచారం దేవుడు వీరికిచ్చిన శిక్ష అయినా ఈ శిక్ష ద్వారా దేవుడు వారికి (మనకు కూడా) ముఖ్యమైన పాఠాలెన్నో నేర్పాడు.
*అవిశ్వాసం, దేవుని విధానాలకు వ్యతిరేకంగా సణగడం ఇలాంటి వాటివల్ల కష్టాలు, నష్టాలు వస్తాయనీ,*
👉దేవుని మీద నమ్మకం, విధేయతవల్ల ఆశీర్వాదాలు కలుగుతాయనీ దేవుడు చూపించాడు.
👉 ఎడారిలో గడిపిన 40 సంవత్సరాలలోనూ దేవుడు తాను వారికి చేసిన వాగ్దానాల పట్ల నమ్మకత్వం కనపరుస్తూ ఆయన ప్రజలు వాగ్దాన దేశంలో అడుగుపెట్టేలా వారిని సిద్ధం చేశాడు.
*విషయసూచిక*
జనాభా లెక్కలు 1:1-54
ప్రయాణాల కోసం గోత్రాలు నడిచే క్రమం, మకాం చేసే ఏర్పాటు 2:1-34
లేవీ గోత్రం 3:1-51
లేవీ గోత్రంలోని మూడు కుటుంబాల విధులు 4:1-33
లేవీ గోత్రంలోని మూడు కుటుంబాల వారిని లెక్కించడం 4:34-49
శిబిరంలో గడిపే జీవితం గురించిన ఆదేశాలు 5:1-31
నాజీర్ వారు 6:1-21
యాజులు ప్రజలను దీవించవలసిన పద్ధతి 6:22-27
గోత్రాల నాయకుల అర్పణలు 7:1-89
లేవీ గోత్రం ప్రతిష్ఠ 8:1-26
ఈజిప్ట్ తరువాత మొదటి పస్కాపండుగ 9:1-14
దేవుని మేఘం 9:15-23
బూరల సంకేతాలు 10:1-10
ఇస్రాయేల్ ప్రజలు సీనాయిని వదలిపెట్టడం 10:11-36
ప్రజల సణుగుణ్ణి మంటలతో శిక్షించడం 11:1-3
దేవుడు వారికి పూరేడు పిట్టలతోపాటు శిక్ష ఇవ్వడం 11:4-35
మిర్యాం, అహరోను మోషేకు విరోధంగా లేవడం 12:1-16
కనానులోకి గూఢచారులు వెళ్ళడం 13:1-25
గూఢచారుల చెడు సమాచారం 13:26-33
కాదేషు–బర్నేయాలో ఇస్రాయేల్ ప్రజల తిరుగుబాటు 14:1-10
దేవుని కోపం, మోషే ప్రార్థన 14:11-19
దేవుడు శిక్షను నియమించడం 14:20-38
ఇస్రాయేల్‌వారు మళ్ళీ అవిధేయత చూపడం 14:39-45
వివిధ అర్పణలకు నియమాలు 15:1-29
బుద్ధిపూర్వకంగా గర్వంతో చేసిన పాపానికి శిక్ష 15:30-36
బట్టలు కుచ్చులు 15:37-41
కోరహు, అతని స్నేహితుల తిరుగుబాటు 16:1-22
కోరహుపై, అతని స్నేహితుల పై శిక్ష 16:25-35
ఇస్రాయేల్ మళ్ళీ సణగడం, తిరుగుబాటు చేయడం 16:41-50
అహరోను కర్ర చిగిర్చడం 17:1-12
లేవీవారి, యాజుల బాధ్యతలు 18:1-7
లేవీవారి కోసం, యాజుల కోసం పోషణ విధానం 18:9-32
అశుద్ధతను తొలగించే నీళ్ళు 19:1-22
కోపంలో మోషే అవిధేయత పూర్వకంగా రెండోసారి బండను కొట్టడం 20:2-11
మోషే అవిధేయతకు దండన 20:12
ఎదోంవారు ఇస్రాయేల్‌వారిని తమ దేశం గుండా వెళ్ళనివ్వక పోవడం 20:14-21
అహరోను మరణం 20:22-29
కంచు పాము 21:4-9
మోయాబుకు ప్రయాణం 21:10-20
సీహోను, ఓగుల పరాజయం 21:21-35
ఇస్రాయేల్‌ను శపించడానికి బాలాకు బిలాము కోసం కబురంపించడం 22:1-41
బిలాము తిరస్కరించడం 22:8-13
బిలాము ఒప్పుకోవడం 22:14-20
బిలాము గాడిద 22:21-31
బిలాము సందేశాలు 23:1—24:25
బయల్ పెయోర్ దగ్గర ఇస్రాయేల్ పాపం 25:1-18
రెండోసారి జనాభా లెక్కలు 26:1-65
కుమార్తెలు వారసత్వం పొందడానికి హక్కు 27:1-11
మోషే తరువాత నాయకుడు 27:12-23
అర్పణలు, బలులూ, సంవత్సరిక పండుగలను గురించిన చట్టాలు 28:1—29:40
మొక్కుబడి 30:1-16
మిద్యానుతో యుద్ధం 31:1-54
ఇస్రాయేల్‌వారు కొందరు తమ వాటాను యొర్దాను తూర్పుప్రాంతంలో కోరుకోవడం 32:1-42
ఈజిప్ట్‌నుండి మోయాబువరకూ జరిగిన ప్రయాణాల జాబితా 33:1-56
కనాను దేశంలో ఇస్రాయేల్ ప్రజల సరిహద్దులు 34:1-29
లేవీవారి కోసం పట్టణాలు 35:1-5
శరణు పట్టణాలు 35:6-34
కుమార్తెల వారసత్వం 36:1-13

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి