ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అబ్రాహాము ప్రయాణాలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚


🚶 *అబ్రాహాము ప్రయాణాలు*



*ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసు క్రీస్తు నామమున వందనములు* *తెలియజేస్తూ అబ్రహాము*
*జీవితంలో ఆయన చేసిన ఒకొక్క ప్రయాణము ఒక్కొక్క ఆద్యాత్మిక పాఠము నేర్చుకోగలము*

👉 1. ఊరు నుండి హారాను వరకు (ఆది 11:31,32)
ఇక్కడ అబ్రహాము తండ్రి మరణించెను.తండ్రిని కోల్పోయిన కూడా ప్రయాణాలు ఆపలేదు.

👉 2.హారాను నుండి షెకేము వరకు (ఆది 12:1-6)
అక్కడ దేవుడు ప్రత్యక్షమైయ్యాడు.దేవునికి బలిపీటము నిర్మించాడు.

👉 3.షెకెము నుండి బేతేలు కు ప్రయాణం (ఆది 12:8)
బలిపీటము కట్టి ప్రార్ధన చేశాడు.

👉 4. బేతేలు నుండి ఈజిప్ట్ కు (ఆది 12:9-11)
శారా తన భార్య కాదని అప్పద్దము ఆడాడు.

👉 5.ఈజిప్ట్ నుండి బేతేలు కు (ఆది 13:3,4)
బేతేలు కు తిరిగి వచ్చి ప్రార్ధన చేశాడు.

👉
6.బేతేలు నుండి హెబ్రోనుకు (ఆది 13:18)
ఇక్కడ బలిపీఠం కట్టాడు.

👉 7.హెబ్రోను నుండి దమస్కు నకు (ఆది 14:1-6)
శత్రువు లను తరిమికొట్టి లోతును విడిపించాడు.

👉 8.హెబ్రోనుకు తిరిగి ప్రయాణం (ఆది 14:16-20)
ఇక్కడ మెల్కిసేదేకుకు అన్నిటిలో దశమ భాగము ఇచ్చాడు.

👉 9.హెబ్రోనునుండి గెరారుకు(ఆది 20:1)

👉 10.గెరారు నుండి బెయెర్షబాకు (ఆది 21:27-34)

👉 11. బెయెర్షబా నుండి మోరియా పర్వతమునకు (ఆది 22:1-14)

👉 12.తిరిగి బెయెర్షబాకు(ఆది 22:19 )

👉 13.బెయెర్షబా నుండి హెబ్రోనుకు(ఆది 25:8-10)
ఇక్కడ మరణించి సమాది చేయబడ్డాడు.

👉. అబ్రహాము గారి ఈ 13 ప్రయాణాలలో మొదట బాధకారముతో మొదలుపెట్టి ,బాధలో కూడా దేవుని
ప్రత్యక్షతను కలిగి బలిపీటము కట్టి ప్రార్ధించ గలిగాడు.మనుష్యులకు భయపడి తన భార్య అయిన శారాను
భార్యకాదని అపద్దము ఆడాడు. శత్రువులను తరిమి లోతును విడిపించుకుని వస్తాడు.దేవునికి
ఇవ్వటాములో ముందు ఉన్న వ్యక్తి . చివరిగా తన కుమారుని బలి ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు
వెనుతీయక విశ్వాసముతో బలి ఇచ్చుటకు సిద్దపడ్డాడు.దేవుడే అబ్రహాము విశ్వాసాన్ని చూచి తొందరపడినట్లు మనం చూడగలము. ఈ దినములలో మన ఆత్మీయ ప్రయాణాలు ఎలా ఉన్నాయి. ప్రశ్న వేసుకుంటూ మనము కూడా ఆత్మీయ ప్రయాణాలలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రభువు మనకు తోడై ఉండి నడిపించును గాక!




💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨



💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...