ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాహేలు గురించి & రీబ్క గురించి తెలుసుకుందాం

*రాహేలు*


*రాహేలు ఎవరు?*

ఆమె లాబాను కూతురు, ఇశ్రాయేలీయుల పూర్వీకుడైన యాకోబుకు ఇష్టమైన భార్య.

*ఆమె ఏం చేసింది?* రాహేలు యాకోబును పెళ్లిచేసుకొని, ఆయనకు ఇద్దరు కొడుకుల్ని కన్నది. ప్రాచీన ఇశ్రాయేలు 12 గోత్రాల కుటుంబపెద్దల్లో వాళ్లు కూడా ఉన్నారు. రాహేలు వాళ్ల నాన్నకు చెందిన గొర్రెల్ని కాస్తున్నప్పుడు, తనకు కాబోయే భర్తను కలిసింది. (ఆదికాండము 29:9, 10) తన అక్క లేయా కన్నా రాహేలు చాలా అందంగా ఉండేది.—ఆదికాండము 29:17.

యాకోబు రాహేలును ప్రేమించాడు, ఆమెను పెళ్లిచేసుకోవడం కోసం ఏడు సంవత్సరాలు పనిచేస్తానని చెప్పాడు. (ఆదికాండము 29:18) అయితే, లాబాను యాకోబును మోసం చేసి మొదట లేయాతో పెళ్లిచేశాడు, తర్వాత రాహేలును కూడా ఇచ్చి పెళ్లిచేశాడు.—ఆదికాండము 29:25-27.

లేయా, ఆమె పిల్లల కన్నా యాకోబు రాహేలును, ఆమె ఇద్దరు కొడుకుల్ని ఎక్కువ ప్రేమించాడు. (ఆదికాండము 37:3; 44:20,27-29) దానివల్ల ఆ ఇద్దరు స్త్రీల మధ్య శత్రుత్వం ఉండేది.—ఆదికాండము 29:30; 30:1, 15.


*రాహేలు నుండి మనమేం నేర్చుకోవచ్చు?*

రాహేలు తన కుటుంబంలోని కష్టమైన పరిస్థితిని సహించింది, అయితే దేవుడు తన ప్రార్థనలు వింటాడనే నమ్మకాన్ని ఆమె కోల్పోలేదు. (ఆదికాండము 30:22-24) ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లిచేసుకుంటే కుటుంబంలో ఎంత ఒత్తిడి ఉంటుందో ఆమె కథ చూస్తే తెలుస్తుంది. ఒక వ్యక్తికి ఒక్క భార్యే ఉండాలని దేవుడు పెట్టిన వివాహ ప్రమాణం ఎంత తెలివైనదో రాహేలు అనుభవం చూపిస్తుంది.—మత్తయి 19:4-6












*రిబ్కా*

*రిబ్కా ఎవరు?* ఆమె ఇస్సాకు భార్య. యాకోబు, ఏశావు అనే కవలల తల్లి.

*ఆమె ఏం చేసింది?* రిబ్కా ఎంత కష్టమైనా దేవుని ఇష్టాన్ని చేసింది. ఆమె బావి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు, ఒకాయన తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగాడు. రిబ్కా వెంటనే నీళ్లిచ్చి, ఆయన ఒంటెలకు కూడా నీళ్లు చేదిపెడతానని అంది. (ఆదికాండము 24:15-20) ఆయన అబ్రాహాము సేవకుడు. ఆయన అబ్రాహాము కొడుకైన ఇస్సాకుకు భార్యను వెదకడానికి ఎంతోదూరం ప్రయాణించి అక్కడికి వచ్చాడు. (ఆదికాండము 24:2-4) అంతేకాదు, దేవుని ఆశీర్వాదం కోసం ఆయన ప్రార్థించాడు. కష్టపడే స్వభావం, ఆతిథ్యస్ఫూర్తి ఉన్న రిబ్కాను చూడగానే, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడనీ ఇస్సాకుకు భార్యగా దేవుడు ఆమెను ఎంచుకున్నాడనీ ఆయనకు అర్థమైంది.—ఆదికాండము 24:10-14, 21, 27.

  ఆయన ఎందుకు వచ్చాడో రిబ్కాకు తెలిసినప్పుడు ఆయనతో పాటు వెళ్లడానికి, ఇస్సాకుకు భార్య అవ్వడానికి ఆమె ఒప్పుకుంది. (ఆదికాండము 24:57-59) ఆ తర్వాత రిబ్కాకు కవలలు పుట్టారు. పెద్ద కొడుకు ఏశావు, రెండో కొడుకు యాకోబు. పెద్దవాడు చిన్నవాడికి సేవకుడౌతాడని దేవుడు ఆమెకు ముందే తెలియజేశాడు. (ఆదికాండము 25:23) పెద్ద కొడుకుకు వచ్చే దీవెన ఏశావుకు ఇవ్వాలని ఇస్సాకు అనుకున్నప్పుడు, రిబ్కా ఆ దీవెన యాకోబుకు వచ్చేలా చేసింది. ఎందుకంటే అది యాకోబుకు రావడమే దేవుని ఇష్టమని ఆమెకు తెలుసు.—ఆదికాండము 27:1-17.

*రిబ్కా నుండి మనమేం నేర్చుకోవచ్చు?* అణకువ, కష్టపడే గుణం, ఆతిథ్యస్ఫూర్తి వంటి లక్షణాల వల్ల రిబ్కా ఒక భార్యగా, తల్లిగా, సత్యదేవుని ఆరాధకురాలిగా తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...